వొడాపోన్ రెండు సరికొత్త ఆఫర్లు

Written By:

జియో ఆఫర్లతో దూసుకుపోతున్నతరుణంలో దానికి పోటీగా ఎయిర్‌టెల్, జియోలు పోటీలు మీద పోటీలుగా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వొడాఫోన్ కూడా యూజర్ల కోసం అదిరే ఆఫర్లను ప్రకటించింది. తమ యూజర్ల కోసం సరికొత్తగా రెండు ఆఫర్లను ప్రకటించింది.

లేటెస్ట్‌గా వచ్చిన బెస్ట్ మోటో ఫోన్లపై ఓ లుక్కేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ. 181తో రీఛార్జ్

యూజర్లు రూ. 181తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజులు పాటు రోజుకు 1జిబి 2జీ డేటా లభిస్తుంది. అలాగే అన్‍లిమిటెడ్ లోకల్ , ఎస్టీడీ కాల్స్ లభిస్తాయి. ఇది 2జీ యూజర్లను బాగా ఆకర్షిస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

రూ. 195తో రీఛార్జ్

రెండో ప్లాన్ కింద యూజర్లు రూ. 195తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1జిబి డేటా చొప్పున 2/3/4జీ డేటా 28రోజులు పాటు లభిస్తుంది. దీంతో పాటు అన్‍లిమిటెడ్ లోకల్ , ఎస్టీడీ కాల్స్ లభిస్తాయి.

కాల్ లిమిట్

అయితే ఈ ప్లాన్ లో కాల్ లిమిట్ కూడా ఉంది. రోజుకు 250 నిమిషాల పాటు వారానికి 1000 నిమిషాల పాటు కాల్స్ చేసుకునే పరిమితిని కంపెనీ విధించింది.

ఐడియాలో కూడా

ఇదే ప్లాన్ ఐడియాలో కూడా ఉంది. రూ. 198తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1జిబి డేటా చొప్పున 28 రోజులు పాటు ఎంజాయ్ చేయవచ్చు. దీంతో పాటు అన్‍లిమిటెడ్ లోకల్ , ఎస్టీడీ కాల్స్ లభిస్తాయి. కొత్త యూజర్లకు రూ. 178తో ఈ ప్యాక్ లభిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Vodafone Outs Two New Plans of Rs. 181 and Rs. 195 With 1GB Data and Unlimited Voice Calling Benefits Read more News aT Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot