వొడాఫోన్ కొత్త ఆఫర్లు చెక్ చేసకున్నారా..?

|

రిలయన్స్ జియోకు పోటీగా వొడాఫోన్ ఇండియా సరికొత్త 4జీ ప్లాన్‌లను మార్కెట్లో లాంచ్ చేసింది.
ఈ ప్లాన్‌లలో భాగంగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు ప్లాన్‌ను బట్టి రోజుకు 1జీబి లేదా 2జీబి 4జీ డేటా లభించే అవకాశం ఉంటుంది.

 
వొడాఫోన్ కొత్త ఆఫర్లు చెక్ చేసకున్నారా..?

ఈ ప్లాన్స్ అనేవి ఒక్కో సర్కిల్‌ను బట్టి ఒక్కో విధంగా ఉంటాయి. మీరు వొడాఫోన్ ప్రీపెయిడ్ నెట్‌వర్క్‌ను వినియోగించుకుంటున్నట్లయితే మైవొడాఫోన్ యాప్‌లోకి లాగిన్ అవటం లేదా మీ స్మార్ట్‌ఫోన్ నుంచి *121#కు డయల్ చేయటం ద్వారా ఆఫర్ల వివరాలను తెలుసుకునే వీలుంటుంది. MyVodafone appలో సిద్ధంగా ఉన్న పలు ఆస్తికర ప్రీపెయిడ్ ప్లాన్‌ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

రూ.198 ప్లాన్.. వ్యాలిడిటీ 28 రోజులు

రూ.198 ప్లాన్.. వ్యాలిడిటీ 28 రోజులు

వొడాఫోన్ నుంచి నూతనంగా లాంచ్ అయిన ఈ ప్లాన్‌ను సబ్‌స్ర్కైబ్ చేసుకోవటం ద్వారా అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ ఇంకా నేషనల్ రోమింగ్ కాల్స్‌తో పాటు రోజుకు 1జీబి 4జీ డేటాను పొందే వీలుంటుంది. ప్లాన్ వ్యాలిడిటీ వచ్చేసరికి 28 రోజులు. ఈ ప్లాన్‌‍లో ఎటువంటి ఉచిత ఎస్ఎంఎస్‌లు అందుబాటులో ఉండవు.

రూ.348 ప్లాన్.. వ్యాలిడిటీ 28 రోజులు

రూ.348 ప్లాన్.. వ్యాలిడిటీ 28 రోజులు

రూ.198 తరహాలోనే రూ.348 పేరుతో మరో సరికొత్త ప్లాన్‌ను వొడాఫోన్ లాంచ్ చేసింది. ఈ ప్లాన్‌లో బాగంగా అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ ఇంకా నేషనల్ రోమింగ్ కాల్స్‌తో పాటు రోజుకు 2జీబి 4జీ డేటా అందుబాటులో ఉంటుంది. ప్లాన్ వ్యాలిడిటీ వచ్చేసరికి 28 రోజులు.

రూ.458 ప్లాన్..వ్యాలిడిటీ 70 రోజులు
 

రూ.458 ప్లాన్..వ్యాలిడిటీ 70 రోజులు

ఈ ప్లాన్‌ను సబ్‌స్ర్కైబ్ చేసుకోవటం ద్వారా అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ ఇంకా నేషనల్ రోమింగ్ కాల్స్‌తో పాటు రోజుకు 1జీబి 4జీ డేటా అందుబాటులో ఉంటుంది. ప్లాన్ వ్యాలిడిటీ వచ్చేసరికి 70 రోజులు. ప్లాన్‌‍ పిరియడ్‌లో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను సెండ్ చేసుకునే వీలుంటుంది.

షియోమికి శాంసంగ్ సవాల్, తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లు !షియోమికి శాంసంగ్ సవాల్, తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లు !

రూ.509 ప్లాన్.. వ్యాలిడిటీ 91 రోజులు

రూ.509 ప్లాన్.. వ్యాలిడిటీ 91 రోజులు

ఈ ప్లాన్‌ను సబ్‌స్ర్కైబ్ చేసుకోవటం ద్వారా అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ ఇంకా నేషనల్ రోమింగ్ కాల్స్‌తో పాటు రోజుకు 1జీబి 4జీ డేటా అందుబాటులో ఉంటుంది. ప్లాన్ వ్యాలిడిటీ వచ్చేసరికి 91 రోజులు. ప్లాన్‌‍ పిరియడ్‌లో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను సెండ్ చేసుకునే వీలుంటుంది.

Best Mobiles in India

Read more about:
English summary
Vodafone offers a slew of prepaid plans with unlimited voice calls, 1GB or 2GB of 4G data per day and a specific number of SMSes per day. The validity and cost of these plans are different in various circles and not all users get all these plans. These plans start from Rs. 198 for the prepaid subscribers.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X