సరికొత్త పోస్ట్ పేయిడ్ ప్లాన్స్ తో దూసుకొస్తున్న వోడాఫోన్
దేశీయ టెలికాం దిగ్గజ టెలికాం సంస్థ వోడాఫోన్ వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇతర టెలికాం సంస్థలతో పోటీగా సరికొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ను మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది.టెలికాం కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం వోడాఫోన్ రెండు ప్లాన్లను లాంచ్ చేసింది. వాటిల్లో ఒకటి రూ.399 ప్లాన్ కాగా, రెండవది రూ. 499 ప్లాన్. వినియోగదారులకు అధిక డేటా అందించడమే లక్ష్యంగా వీటిని ప్రారంభించినట్లు తెలుస్తోంది.

రూ.399 ప్లాన్ :
వోడాఫోన్ RED బేసిక్ 399 ప్లాన్ పేరును RED ఎంటర్టైన్మెంట్ గా మార్చారు. ఇంతకముందు వినియోగదారులకు 20 జిబి డేటా అందించేది ,కాగా అధిక డేటా ను అందించాలనే ఉద్దేశం 40జిబి కు రెట్టింపు చేయబడింది.వోడాఫోన్ సంస్థ మరో ఆఫర్ కూడా అందిస్తుంది . 200 జిబి డేటా తో పాటు ఒక్క సంవత్సరం అమెజాన్ ప్రైమ్ మరియు వోడాఫోన్ ప్లే subscription ఉచితంగా పొందవచ్చు. మరియు రోజు వారి అపరిమిత కాల్స్,నేషనల్ రోమింగ్ ఉచితంగా పొందవచ్చు
రూ.499 ప్లాన్ :
వోడాఫోన్ RED ట్రావెలర్ R రూ.499 ప్లాన్ ను RED ఎంటర్టైన్మెంట్+ గా మార్చబడింది.ఇంతకముందు వినియోగదారులకు 40 జిబి డేటా అందించేది ,కాగా అధిక డేటా ను అందించాలనే ఉద్దేశం 75 జిబి డేటా ను అందిస్తున్నారు .ఇందులో కూడా 200 జిబి డేటా తో పాటు ఒక్క సంవత్సరం అమెజాన్ ప్రైమ్ మరియు వోడాఫోన్ ప్లే subscription ఉచితంగా పొందవచ్చు. మరియు రోజు వారి అపరిమిత కాల్స్,నేషనల్ రోమింగ్ ఉచితంగా పొందవచ్చు

వోడాఫోన్ అందిస్తున్న సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ :
ఈ వారంలో వోడాఫోన్ రెండు సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ను వినియోగదారులకు అందించింది . వాటిల్లో ఒకటి రూ.511 ప్లాన్ కాగా, రెండవది రూ.569 ప్లాన్.రూ.511 ప్లాన్ ద్వారా యూజర్లు రోజుకి 2 జిబి హై స్పీడ్ డేటాను అందుకుంటారు,దీని వాలిడిటీ 84 రోజులు మాత్రమే .రూ.569 ప్లాన్ ద్వారా యూజర్లు రోజుకి 3 జిబి హై స్పీడ్ డేటాను అందుకుంటారు,దీని వాలిడిటీ కూడా 84 రోజులు మాత్రమే. రెండు ప్లాన్స్ లోను రోజు వారి అపరిమిత కాల్స్,నేషనల్ రోమింగ్ , రోజుకు 100 ఎసెమ్మెస్ లు ఉచితం.


Click it and Unblock the Notifications