రూ.60 కడితే చాలు, ఫోన్ పోతే రూ.50,000 వరకు ఇస్తారు

వినియోగదారులను ఆకట్టుకునేందుకు వొడాఫోన్ ఇండియా కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. తాజాగా, వొడాఫోన్ రెడ్ షీల్డ్ పేరుతో కొత్త ప్రోగ్రామ్ ను వొడాఫోన్ ఇండియా అనౌన్స్ చేసింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సెక్యూరిటీ సొల్యూషన్స్‌తో పాటు కాంప్లిమెటరీ ఇన్స్యూరెన్స్

వొడాఫోన్ రెడ్ షీల్డ్ ప్రోగ్రామ్‌లో డివైస్ సెక్యూరిటీ సొల్యూషన్స్‌తో పాటు కాంప్లిమెటరీ ఇన్స్యూరెన్స్ ఉంటుంది.

రూ.50,000 వరకు కవరేజ్

స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ ప్రొటెక్షన్ ప్యాకేజీని తీసుకోవటం ద్వారా కాంప్లిమెటరీ ఇన్స్యూరెన్స్ క్రింద ఫోన్ పోతే రూ.50,000 వరకు కొత్త లభిస్తుంది.

డాఫోన్ రెడ్ పోస్ట్ పెయిడ్ ఖతాదారులకు మాత్రమే

ప్రస్తుతానికి ఈ సదుపాయం వొడాఫోన్ రెడ్ పోస్ట్ పెయిడ్ ఖతాదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ డివైస్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ క్రింద కాంప్లిమెటరీ ఇన్స్యూరెన్స్ కవరేజ్‌తో పాటు తెఫ్ట్ కవరేజ్‌, బియాండ్ బేసిక్ హ్యాండ్‌సెట్ డ్యామేజ్ కవరేజ్‌లు లభిస్తాయి.

కాంప్లిమెటరీ ఇన్స్యూరెన్స్ 6 నెలలలోపు ఫోన్‌లకు మాత్రమే

కాంప్లిమెటరీ ఇన్స్యూరెన్స్ అనేది 6 నెలలలోపు ఫోన్‌లకు మాత్రమే వర్తిస్తుంది. వొడాఫోన్ రెడ్ రెడ్ పోస్ట్ పెయిడ్ ఖతాదారులు వొడాఫోన్ రెడ్ షీల్డ్ యాప్‌ను తాము వాడుతున్న ఫోన్‌ను బట్టి గూగుల్ ప్లే స్టోర్ లేదా ఐఓఎస్ యాప్ స్టోర్ ద్వారా పొందవచ్చు.

నెలకు రూ.60 కడితే చాలు..

వొడాఫోన్ రెడ్ షీల్డ్ సర్వీసులను యాక్టివేట్ చేసుకోవాలంటే ఏడాది ప్రీమియమ్ క్రింద రూ.720 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా నెలకు రూ.60 చొప్పున చెల్లిస్తే సరిపోతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Vodafone RED Shield Announced; Offering up to Rs. 50,000 Insurance for New and Six-Month Old Handsets. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot