వొడాఫోన్ ప్లాన్ మార్పు, ఇకపై రోజుకు 2జిబి డేటా
టెలికం దిగ్గజాల మధ్య ధరల యుద్ధం ప్రారంభమైన నేపథ్యంలో అన్ని టెల్కోలు ఇప్పుడు ఆఫర్ల మీద ఆఫర్లు గుప్పిస్తూ వినియోగదారులను చేజారిపోకుండా కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
టెలికం దిగ్గజాల మధ్య ధరల యుద్ధం ప్రారంభమైన నేపథ్యంలో అన్ని టెల్కోలు ఇప్పుడు ఆఫర్ల మీద ఆఫర్లు గుప్పిస్తూ వినియోగదారులను చేజారిపోకుండా కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈనేపథ్యంలోనే జియోకి కౌంటర్ గా అన్ని టెలికాం కంపెనీలు సరికొత్త ప్లాన్లతో బరిలోకి దిగాయి. వొడాఫోన్ సైతం ఇప్పుడు జియోతో పోటీకి సై అంటోంది. తన పాత ప్లాన్ అప్‌గ్రేడ్ చేసింది.

రూ.348..
వొడాఫోన్ తన పాత ప్లాన్ రూ.348ను అప్‌గ్రేడ్ చేసింది. ఈ ప్యాక్‌పై రోజుకు అందిస్తున్న 1జీబీ డేటాను 2జీబీకి పెంచింది. దీంతో 28 రోజుల పాటు మొత్తం 56జీబీ డేటా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.

రోజుకు 2జీబీ డేటాతో పాటు..
రోజుకు 2జీబీ డేటాతో పాటు అపరిమిత ఉచిత లోకల్, ఎస్టీడీ కాల్స్, ఉచిత రోమింగ్ అవుట్‌గోయింగ్ కాల్స్‌ను అందించనుంది. అయితే ఉచిత కాల్స్‌లో రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాలు మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది.

5 శాతం క్యాష్‌బ్యాక్..
ఆ తర్వాత సెకనుకు 1పైసా ఛార్జీ విధించనుంది. రూ.348 ప్లాన్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు. కాగా వొడాఫోన్‌కు చెందిన ఈ ప్యాక్, ఎయిర్‌టెల్ రూ.349 ప్యాక్‌కు డైరెక్ట్ పోటీగా నిలుస్తోంది. ఎయిర్‌టెల్ కూడా రూ.349 ప్యాక్ కింద రోజుకు 2జీబీ 4జీ డేటాను అందిస్తోంది.

నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్ రూ.176..
వొడాఫోన్ ప్రస్తుతం అప్‌గ్రేడ్ చేసిన రూ.348 ప్యాక్‌ను ఈ కంపెనీ ఆగస్టులో లాంచ్ చేసింది. అత్యంత చౌకైన నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్ రూ.176ను వొడాఫోన్ లాంచ్ చేసింది. ఈ ప్లాన్ కింద ఉచిత కాల్స్‌తో పాటు రోజుకు 1జీబీ 2జీ డేటాను అందిస్తోంది.


Click it and Unblock the Notifications








