వొడాఫోన్ సంచలన ఆఫర్.. 1జీబి డేటా ధరకే 10జీబి 4జీ ఇంటర్నెట్

రిలయన్స్ జియో ఉచిత సర్వీస్ ఆఫర్‌కు ధీటుగా సరికొత్త ఆఫర్‌ను వొడాఫోన్ సోమవారం మార్కెట్లో అనౌన్స్ చేసింది. ఈ సంచలనాత్మక ఆఫర్‌లో భాగంగా 1జీబి డేటా ధరకే 10జీబి 4జీ ఇంటర్నెట్‌ను పొందే అవకాశాన్ని వొడాఫోన్ తన సూపర్ నెట్ యూజర్లకు కల్పించింది.

 వొడాఫోన్ సంచలన ఆఫర్.. 1జీబి డేటా ధరకే 10జీబి 4జీ ఇంటర్నెట్

Read More : Amazonలో దుమ్మురేపుతోన్న దసరా డిస్కౌంట్‌‌లు

కొత్త 4జీ స్మార్‌ఫోన్‌లను కొనుగోలు చేసే వొడాఫోన్ యూజర్లకు ఈ ఆఫర్ మూడు నెలల పాటు వర్తిస్తుంది. అంటే ప్రతినెలా 1జీబి ఇంటర్నెట్‌కు డబ్బులు వెచ్చిస్తే చాలు, మీగితా 9జీబి ఉచితంగా లభిస్తుంది. వొడాఫోన్‌కు సొంతంగా 3జీ, 4జీ సేవలు అందిస్తున్న సర్కిల్స్‌లో ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రీపెయిడ్ అలానే పోస్ట్ పెయిడ్ కస్టమర్‌లకు

వొడాఫోన్ ప్రీపెయిడ్ అలానే పోస్ట్ పెయిడ్ కస్టమర్‌లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ ఆఫర్ ప్రకటించినట్టు వొడాఫోన్ తెలిపింది. ఈ ఆఫర్‌లో భాగదంగా వొడాపోన్ కస్టమర్‌లు వొడాఫోన్ ప్లే యాప్‌లోని టీవీలు, సినిమాలు అలానే మ్యూజిక్‌ను ఉచితంగ్ సబ్‌స్ర్కైబ్ చేసుకోవచ్చు. తమ వినియోగదారులు 4జీ హ్యాండ్‌సెట్లకు అప్‌గ్రేడ్ కావాలన్న ఉద్దేశంతో ఈ ఆఫర్‌‌ను తీసుకువచ్చినట్లు వొడాఫోన్ వెల్లడించింది. వొడాఫోన్ 4జీ అందుబాటులో లేని ప్రాంతాల్లో యూజర్లకు 3జీ డేటా లభిస్తుంది.

వొడాఫోన్ 4జీ గురించి ఆసక్తికర విషయాలు...

వొడాఫోన్ తన సూపర్‌నెట్ 4జీ సేవలను ఇటీవల భారత్‌లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఆధునిక సాంకేతిక హంగులతో వచ్చిన తమ కొత్త నెట్‌వర్క్ కాల్ డ్రాప్‌లను తగ్గించటంతో పాటు క్లారిటీతో కూడిన వాయిస్ కాల్స్ ఇంకా నాణ్యమైన డేటా స్పీడ్స్‌ను యూజర్‌కు చేరువచేస్తుందని వొడాఫోన్ చెబుతోంది. వినూత్న ప్రకటనలతో మార్కెట్‌ను అలరిస్తోన్న వొడాఫోన్ సూపర్‌నెట్ 4జీ గురించి పలు ఆసక్తికర విషయాలు.

ప్రపంచంలోనే అతిపెద్ద 4జీ నెట్‌వర్క్‌..

ప్రపంచంలోనే అతిపెద్ద 4జీ నెట్‌వర్క్‌గా వొడాఫోన్ గుర్తింపు తెచ్చుకుంది. 20కు పైగా దేశాల్లో వొడాఫోన్ 4జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. భారత్‌లో తన 4జీ సేవలను 1800 MHz బ్యాండ్ విడ్త్‌లో వొడాఫోన్ ఆఫర్ చేస్తుంది.

వొడాఫోన్ సూపర్‌నెట్ 4జీ సేవలు దేశీయంగా...

వొడాఫోన్ సూపర్‌నెట్ 4జీ సేవలు దేశీయంగా నాలుగు సర్కిళ్లలో అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలు.. కేరళ, కర్నాటక, ఢిల్లీ & నేషనల్ కేపిటల్ రీజియన్, కోల్‌కతా.

14 మార్కెట్లలో ఇంటర్నెషనల్ రోమింగ్‌...

14 మార్కెట్లలో ఇంటర్నెషనల్ రోమింగ్‌ను అందిస్తోన్ననెట్‌వర్క్‌గా వొడాఫోన్ గుర్తింపు తెచ్చుకుంది.

5జీకి రెడీ..

తన రేడియో నెట్‌వర్క్‌‍ను ఐపీ టెక్నాలజీకి అప్‌గ్రేడ్ చేసుకున్న వొడాఫోన్ 5జీకి రెడీ అవుతోంది.

కోట్లలో కస్టమర్‌లు...

వినియోగదారులకు నాణ్యమైన నెట్‌వర్క్‌ను అందించే క్రమంలో పలు ఆధునిక టెక్నాలజీలను వొడాఫోన్ ఉపయోగిస్తోంది. ఈ ఆపరేటర్‌కు 194 మిలియన్ల పై చిలుకు కస్టమర్లు ఉన్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Vodafone rolls out free 4G data plan to counter Jio impact. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot