ప్రత్యర్థులకు షాక్ ఇచ్చేలా వోడాఫోన్ కొత్త ప్లాన్
దేశీయ టెలికాం రంగంలో పలు విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా రిలయన్స్ జియో రాకతో దేశీయ టెలికాం ఒక్కసారిగా అనేక కుదుపులకు కారణం అయింది.
దేశీయ టెలికాం రంగంలో పలు విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా రిలయన్స్ జియో రాకతో దేశీయ టెలికాం ఒక్కసారిగా అనేక కుదుపులకు కారణం అయింది. అలాగే అనేక సంచలనాల ఫలితాలు నమోదయ్యాయి. డేటా ధరలు అప్పటివరకు ఆకాశంలో ఉంటే జియో వచ్చిన తరువాత నేల చూపులు చూశాయి. ముఖ్యంగా జియో ఉచిత డేటాతో ఓ సునామినే తలపించింది. దాని దెబ్బకు దిగ్గజ టెల్కోలు సరికొత్త ప్లాన్స్ ను లాంచ్ చేసాయి. ఈ నేపథ్యంలోనే వొడాఫోన్ కూడా సరికొత్త యానువల్ ప్లాన్ తో దూసుకొచ్చింది

వోడాఫోన్ రూ.1699 ప్లాన్
ఈ ప్లాన్ కింద రోజుకు 1జీబీ డేటాను వొడాఫోన్ ఆఫర్ చేయనుంది. దీనిపై కూడా ఇతర ప్రయోజనాలు అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా యూజర్లు పొందనున్నారు.ఈ ప్లాన్ వాలిడిటీని 365 రోజులుగా నిర్ణయించారు

ఇపుడు మార్కెట్లో రూ.1699 ధరతో ఇతర టెలికాం కంపెనీలు కూడా ప్లాన్ ను లాంచ్ చేశాయి...
ఎయిర్‌టెల్ రూ.1699
365 రోజుల వ్యాలిడిటీతో ఎయిర్‌టెల్ అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రీపెయిడ్ ప్లాన్ రూ.1,699 ధర ట్యాగ్‌తో లభ్యమవుతోంది. 365 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్‌లో భాగంగా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు రోజు 100 ఎస్సెమ్మెస్‌లు, 1జీబీ డేటాను వినియోగించుకోవచ్చు.

BSNL రూ.1,699 ప్లాన్
365 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్‌లో భాగంగా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 2జీబి 4జీ డేటా అందుబాటులో ఉంటుంది. ఇదే సమయంలో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను పంపుకోవచ్చు.

జియో రూ.1699 ప్లాన్
జియో రూ.1699 ప్లాన్ తో ఉచితంగా లోకల్, నేషనల్ కాల్స్, అపరిమిత రోమింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 547.5 జీబీ డేటాను పొందవచ్చు. అంటే రోజుకు 1.5జీబీ డేటా లభిస్తుంది


Click it and Unblock the Notifications