Home
News

మరో అద్భుత ప్లాన్ తో అదరగొడుతున్న వోడాఫోన్

దేశీయ టెలికాం రంగంలో పలు విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా రిలయన్స్ జియో రాకతో దేశీయ టెలికాం ఒక్కసారిగా అనేక కుదుపులకు కారణం అయింది. అలాగే అనేక సంచలనాల ఫలితాలు నమోదయ్యాయి.

దేశీయ టెలికాం రంగంలో పలు విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా రిలయన్స్ జియో రాకతో దేశీయ టెలికాం ఒక్కసారిగా అనేక కుదుపులకు కారణం అయింది. అలాగే అనేక సంచలనాల ఫలితాలు నమోదయ్యాయి. డేటా ధరలు అప్పటివరకు ఆకాశంలో ఉంటే జియో వచ్చిన తరువాత నేల చూపులు చూశాయి. ముఖ్యంగా జియో ఉచిత డేటాతో ఓ సునామినే తలపించింది. దాని దెబ్బకు దిగ్గజ టెల్కోలు సరికొత్త ప్లాన్స్ ను లాంచ్ చేసాయి. ఈ నేపథ్యంలోనే వొడాఫోన్ రూ.1999 అనే సరికొత్త యానువల్ ప్లాన్ తో దూసుకొచ్చింది. ఎయిర్‌టెల్‌, జియో,BSNL నెట్‌వ‌ర్క్ ల‌లో కూడా రూ.1699 కి ఈ త‌ర‌హా ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.

వోడాఫోన్ రూ.1999 ప్లాన్

వోడాఫోన్ రూ.1999 ప్లాన్

ఈ ప్లాన్‌ కింద రోజుకు 1.5 జీబీ డేటాను వొడాఫోన్‌ ఆఫర్‌ చేయనుంది. దీనిపై కూడా ఇతర ప్రయోజనాలు అపరిమిత లోకల్‌, ఎస్టీడీ, రోమింగ్‌ వాయిస్‌ కాల్స్‌ ఉచితం. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా యూజర్లు పొందనున్నారు.ఈ ప్లాన్ వాలిడిటీని 365 రోజులుగా నిర్ణయించారు

జియో రూ.1699 ప్లాన్

జియో రూ.1699 ప్లాన్

జియో రూ.1699 ప్లాన్ తో ఉచితంగా లోకల్‌, నేషనల్‌ కాల్స్‌, అపరిమిత రోమింగ్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 547.5 జీబీ డేటాను పొందవచ్చు. అంటే రోజుకు 1.5జీబీ డేటా లభిస్తుంది

ఎయిర్‌టెల్‌ రూ.1699

ఎయిర్‌టెల్‌ రూ.1699

365 రోజుల వ్యాలిడిటీతో ఎయిర్‌టెల్ అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రీపెయిడ్ ప్లాన్ రూ.1,699 ధర ట్యాగ్‌తో లభ్యమవుతోంది. 365 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్‌లో భాగంగా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు రోజు 100 ఎస్సెమ్మెస్‌లు, 1జీబీ డేటాను వినియోగించుకోవచ్చు.

BSNL రూ.1,699 ప్లాన్

BSNL రూ.1,699 ప్లాన్

365 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్‌లో భాగంగా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 2జీబి 4జీ డేటా అందుబాటులో ఉంటుంది. ఇదే సమయంలో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను పంపుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Vodafone Rs 1,999 prepaid plan launched: How it compares to Airtel's Rs 1,699 and Reliance Jio's 1,699 prepaid plans.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X