తక్కువ ధరకే 84 రోజుల వాలిడిటీ ఇస్తున్న వోడాఫోన్ ఆ ప్లాన్ ఏంటో చూడండి...
దేశీయ టెలికాం రంగం సరికొత్త మార్పులకు వేదికగా నిలుస్తోంది. దిగ్గజాల దెబ్బకు చిన్నా చితకా కంపెనీలు విలీనం బాట పట్టాయి.
దేశీయ టెలికాం రంగం సరికొత్త మార్పులకు వేదికగా నిలుస్తోంది. దిగ్గజాల దెబ్బకు చిన్నా చితకా కంపెనీలు విలీనం బాట పట్టాయి. ఇందులో భాగంగా ఐడియా వొడాఫోన్తో జత కట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రెండు దిగ్గజాలకు ధీటుగా ఆపర్లను ప్రకటించి కస్టమర్లను కాపాడుకోవాల్సిన బాధ్యతను విలీనబాట పట్టిన కంపెనీలు చాలా ఉన్నాయి. ఇందులో భాగంగా వోడాఫోన్ ప్రత్యర్థుల కంపెనీలకు ధీటుగా సరికొత్త ప్లాన్‌ను అందు బాటులోకి తీసుకొచ్చింది. జియో, ఎయిర్‌టెల్ కంపెనీలను దెబ్బకొట్టేలా వోడాఫోన్ రూ.279 ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చింది.

279 రూపాయల రీఛార్జ్ ప్యాక్...
ప్రీపెయిడ్ కస‍్టమర్లకోసం 279 రూపాయల రీఛార్జ్ ప్యాక్‌ను లాంచ్ చేసింది. ఇందులో అన్‌లిమిటెడ్ వాయిస్‌కాల్స్,వారనికి 4జీబీ డేటా, రోజుకు 100ఎస్‌ఎంఎస్‌లు అందిస్తోంది.

వాలిడిటీ పీరియడ్....
వాలిడిటీ విషయంలో దిగ్గజ టెలికాంలకు షాక్ ఇచ్చింది . ఇప్పటివరకు ఏ టెలికాం కంపెనీ ఇవ్వని 84 రోజుల వాలిడిటీ వొడఫోనే ఇస్తుంది.

కొన్ని సర్కిల్స్ లో మాత్రమే...
అయితే వోడాఫోన్ అందిస్తున్న ఈ ప్లాన్ కేవలం కర్ణాటక,ముంబై ఇతర రాష్ట్రాలలో సర్కిల్స్ లో మాత్రమే అందుబాటులో ఉంది.

జియో vs వోడాఫోన్
జియో అందిస్తున్న రూ.348 ప్లాన్ కి చెక్ పెడుతు వోడాఫోన్ రూ.279 ప్లాన్ ను విడుదల చేసింది . జియో రూ.348 తో 84 రోజులు వాలిడిటీ ఇవ్వగా వోడాఫోన్ రూ.279 కే 84 రోజుల వాలిడిటీ ని ఇస్తుంది .

రూ.99 , రూ.109..
వోడాఫోన్ రీసెంట్ గా ఈ రూ.99 , రూ.109 ప్లాన్లను లాంచ్ చేసింది.ఈ రెండు ప్లాన్ల వాలిడిటీ 28 రోజులు మాత్రమే అయితే రూ.99 ప్లాన్ తో ఎటువంటి 3జి/4జి డేటా లభించదు,రూ. 109 ప్లాన్ తో మాత్రం 1జీబీ 3జి/4జి డేటా లభిస్తుంది .


Click it and Unblock the Notifications








