Vodafone Rs 555 Plan ప్రయోజనాలు ఏంటో చూడండి
వోడాఫోన్ యొక్క ప్రీపెయిడ్ విభాగంలోకి ఇప్పుడు మరొక పెద్ద మార్పులు జరిగాయి. వోడాఫోన్ ఇప్పుడు కొత్తగా రూ.499ల రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇది కంపెనీ యొక్క రోజువారీ 1.5GB డేటా ప్లాన్‌లైన రూ.249, రూ.399, రూ.555, రూ.599 ప్రీపెయిడ్ విభాగంలోకి చేరింది.

వోడాఫోన్ సంస్థ కొన్ని వారాల క్రితం రూ.499 ప్లాన్ కు సమానమైన రూ.555ల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను 70 రోజుల వాలిడితో టెల్కో ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఇందులో కూడా పెద్ద మార్పు జరిగింది. టెల్కో రూ.555ల ప్లాన్ యొక్క మునుపటి 70 రోజుల వాలిడిటీని ఇప్పుడు 77 రోజుల వాలిడిటీకి పెంచింది.

రూ.499 ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు 70 రోజుల చెల్లుబాటును అందిస్తున్నది. కొత్తగా ప్రారంభించిన రూ .499 ప్లాన్ మెజారిటీ సర్కిల్‌లలో 70 రోజులు ప్రయోజనాలను అందిస్తుండగా మరికొన్ని ప్లాన్‌లు 60 రోజుల చెల్లుబాటుతో కూడా అందుబాటులో ఉన్నాయి. వోడాఫోన్ తన ప్రీపెయిడ్ ప్లాన్ పోర్ట్‌ఫోలియోను వేగంగా విస్తరిస్తోంది మరియు రూ .499 రీఛార్జ్ దీనికి అదనంగా జోడయింది.

వొడాఫోన్ రూ 499 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు
వొడాఫోన్ ఐడియా ప్రస్తుతం ఇండియాలో తన సేవలను మెరుగుపరచడానికి కష్టపడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇందులో భాగంగా ప్రీపెయిడ్ విభాగంలో వోడాఫోన్ ఇప్పుడు కొత్తగా 499 ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఐడియా కూడా ఇదే ప్లాన్‌ను ప్రస్తుతానికి ఎంచుకున్న సర్కిల్‌లలో మాత్రమే ప్రారంభించింది. రూ.499 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ వోడాఫోన్ యొక్క ఇతర 1.5GB రోజువారీ డేటా ప్లాన్‌లలో రూ .249, రూ. 399, రూ. 555 మరియు రూ .599 లో చేరింది.

ప్రయోజనాలు
వొడాఫోన్ యొక్క రూ 499 ప్రీపెయిడ్ ప్లాన్ అందించే ప్రయోజనాల విషయానికి వస్తే ఇది ఇండియాలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్, 1.5GB రోజువారీ డేటా మరియు రోజుకు 100SMS ప్రయోజనాలు 70 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తాయి. ఈ రీఛార్జ్ ప్లాన్ యొక్క అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే అదనపు ఖర్చు లేకుండా వోడాఫోన్ ప్లే సబ్స్క్రిప్షన్, మరియు రూ.999 విలువైన ZEE5 ప్రీమియం కంటెంట్‌ను కూడా అందిస్తుంది.

వోడాఫోన్ రూ.555 ప్రీపెయిడ్ ప్లాన్ చెల్లుబాటు సవరణ
వోడాఫోన్ కొన్ని వారాల క్రితం ఇండియాలో రూ.555 ప్రీపెయిడ్ రీఛార్జి ప్లాన్ 1.5 జీబీ రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ మరియు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను 70 రోజుల చెల్లుబాటు కాలానికి ప్రవేశపెట్టింది. కొత్తగా ప్రారంభించిన రూ.499 ప్లాన్ అదే చెల్లుబాటు కాలానికి అన్ని రకాల ప్రయోజనాలను అందిస్తున్నందున టెల్కో రూ.555 ప్లాన్ యొక్క చెల్లుబాటును మరో ఏడు రోజులకు పెంచింది. అంటే ఇప్పుడు ఈ ప్లాన్ రీఛార్జ్ చేసిన తేదీ నుండి 77 రోజుల వరకు అన్ని రకాల ప్రయోజనాలను అందిస్తుంది. కాబట్టి వోడాఫోన్ కస్టమర్లు రూ.555 ప్లాన్ మీద ఇప్పుడు మరో ఏడు రోజుల చెల్లుబాటును అదనంగా పొందుతున్నారు. 84 రోజుల చెల్లబాటుతో అదే ప్రయోజనాలను అందించే 599 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ కూడా తన పోర్ట్ ఫోలియోలో ఉంది.

వోడాఫోన్ 1.5GB రోజువారీ డేటా ప్లాన్‌లు
499 రూపాయల ప్లాన్‌ను ప్రారంభించడంతో వోడాఫోన్ పోర్ట్ ఫోలియోలో ఇప్పుడు 1.5GB రోజువారీ డేటాతో మొత్తంగా ఐదు ప్రీపెయిడ్ ప్లాన్‌లను కలిగి ఉంది. రూ.249 ప్లాన్ రోజుకు 1.5 జిబి డేటాను 28 రోజుల చెల్లుబాటుతో, రూ .939 ప్లాన్ 56 రోజుల వాలిడిటీతో అందిస్తుంది. అప్పుడు కొత్తది రూ.499 ప్యాక్ 70 రోజుల చెల్లుబాటుతో వస్తుంది (కొన్ని సర్కిల్‌లలో 60 రోజులు). రూ.555 మరియు రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్లు 1.5 జిబి రోజువారీ డేటాతో 77 రోజులు మరియు 84 రోజుల చెల్లుబాటుతో అందుబాటులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications