Home
News

దిగ్గజాలకు వొడాఫోన్ కొత్త ట్విస్ట్, పరతులతో కొత్త ఆఫర్ వచ్చింది

దేశీయ టెలికాం రంగం సరికొత్త మార్పులకు వేదికగా నిలుస్తోంది. దిగ్గజాల దెబ్బకు చిన్నా చితకా కంపెనీలు విలీనం బాట పట్టాయి.

By Hazarath Aiah

దేశీయ టెలికాం రంగం సరికొత్త మార్పులకు వేదికగా నిలుస్తోంది. దిగ్గజాల దెబ్బకు చిన్నా చితకా కంపెనీలు విలీనం బాట పట్టాయి. ఇందులో భాగంగా ఐడియా వొడాఫోన్తో జత కట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రెండు దిగ్గజాలకు ధీటుగా ఆపర్లను ప్రకటించి కస్టమర్లను కాపాడుకోవాల్సిన బాధ్యతను విలీనబాట పట్టిన కంపెనీలు చాలా ఉన్నాయి. ఇందులో భాగంగా వోడాఫోన్‌ ప్రత్యర్థుల కంపెనీలకు ధీటుగా సరికొత్త ప్లాన్‌ను అందు బాటులోకి తీసు​కొచ్చింది. జియో, ఎయిర్‌టెల్‌ కంపెనీలను దెబ్బకొట్టేలా వోడాఫోన్‌ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ తీసుకొచ్చింది.

597 రూపాయల రీఛార్జ్ ప్యాక్‌

597 రూపాయల రీఛార్జ్ ప్యాక్‌

ప్రీపెయిడ్‌ కస‍్టమర్లకోసం 597 రూపాయల రీఛార్జ్ ప్యాక్‌ను లాంచ్‌ చేసింది. ఇందులో అన్‌లిమిటెడ్‌ వాయిస్‌కాల్స్‌, 10జీబీ డేటా, రోజుకు 100ఎస్‌ఎంఎస్‌లు అందిస్తోంది.

కొన్ని పరిమితులు

కొన్ని పరిమితులు

అయితే ఈ ప్లాన్‌లో దుర్వినియోగం నివారించడానికంటూ కొన్ని పరిమితులు విధించడం విశేషం.

వాయిస్ కాలింగ్‌

వాయిస్ కాలింగ్‌

వాయిస్ కాలింగ్‌లో పరిమితి పెట్టింది. రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాలకు మాత్రమే కాల్స్‌ పరిమితం.

వాలిడిటీ పీరియడ్‌

వాలిడిటీ పీరియడ్‌

అంతేకాదు మొత్త వాలిడిటీ పీరియడ్‌లో 100 యూనిక్‌ నెంబర్లకు మాత్రమే కాల్‌ చేసుకునే అవకాశం ఉంది.

ఇంకో ట్విస్ట్..

ఇంకో ట్విస్ట్..

ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా వుంది. ఈ ప్లాన్ వాలిడిటీస్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల కోసం 112 రోజులు, ఫీచర్ ఫోన్ వినియోగదారులకయితే 168 రోజులుగా నిర్ణయించింది.

రూ.159 ప్లాన్

రూ.159 ప్లాన్

ఇదిలా ఉంటే వొడాఫోన్ ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను తాజాగా ప్రవేశపెట్టింది. రూ.159 కి అందుబాటులోకి వచ్చిన ఈ ప్లాన్‌ను కస్టమర్లు రీచార్జి చేసుకుంటే దాంతో వారికి రోజూ 1జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీని 28 రోజులుగా నిర్ణయించారు.

250 నిమిషాల వాయిస్ కాల్స్

250 నిమిషాల వాయిస్ కాల్స్

ఈ ప్లాన్‌లో కస్టమర్లు రోజుకు 250 నిమిషాల వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే వారానికి ఈ పరిమితి 1000 నిమిషాల వరకు ఉంటుంది.

జియోలో ఉన్న రూ.149 ప్లాన్‌కు.

జియోలో ఉన్న రూ.149 ప్లాన్‌కు.

జియోలో ఉన్న రూ.149 ప్లాన్‌కు పోటీగా వొడాఫోన్ ఈ ప్లాన్‌ను ప్రవేశ పెట్టింది. జియో రూ.149 ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 28 రోజులే కావడం విశేషం.

Best Mobiles in India

English summary
Vodafone’s Rs 597 prepaid recharge offer with 10GB data, unlimited calls more news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X