సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ను ప్రవేశపెట్టిన వోడాఫోన్
దేశీయ టెలికాం రంగం రోజురోజుకు పెను విప్లవాల వైపుగా దూసుకుపోతోంది. జియో రాకతో పోటీవాతావరణం వేడెక్కిన విషయం అందరికీ తెలిసిందే
దేశీయ టెలికాం రంగం రోజురోజుకు పెను విప్లవాల వైపుగా దూసుకుపోతోంది. జియో రాకతో పోటీవాతావరణం వేడెక్కిన విషయం అందరికీ తెలిసిందే. ఉచిత ఆఫర్లతో దిగ్గజాలకు ముచ్చెమటలు పట్టించిన జియోని ఢీకొట్టడమే లక్ష్యంగా మిగతా టెల్కోలు ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారులు తమ నుంచి చేజారిపోకుండా కాపాడుకుంటున్నాయి.ఇప్పటికే ఎయిర్టెల్ మరియు BSNL సరికొత్త ప్లాన్స్ ను విడుదల చేయగా వోడాఫోన్ కూడా మరో రెండు సరికొత్త ప్లాన్ లను మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. యూజర్లకు అధిక డేటా ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశం తో రూ. 549,రూ. 799 ప్లాన్స్ ను విడుదల చేసింది.

రూ.549 ప్లాన్ ....
వోడాఫోన్ ప్రీపెయిడ్ వినియోగదారులు రూ.549రీఛార్జ్ చేసుకుంటే రోజుకి 3.5 జీబీ ఇంటర్నెట్ డేటా పొందవచ్చు. ఈ ప్యాక్ కాలపరిమితి 28 రోజులు. ఇందులో ఉచిత లోకల్, ఎస్టీడీ కాల్స్ లభిస్తాయి. 100 ఎసెమ్మెస్ లు లభిస్తాయి.

రూ.799 ప్లాన్ ....
వోడాఫోన్ ప్రీపెయిడ్ వినియోగదారులు రూ.799రీఛార్జ్ చేసుకుంటే రోజుకి 4.5 జీబీ ఇంటర్నెట్ డేటా పొందవచ్చు. ఈ ప్యాక్ కాలపరిమితి 28 రోజులు. ఇందులో ఉచిత లోకల్, ఎస్టీడీ కాల్స్ లభిస్తాయి. 100 ఎసెమ్మెస్ లు లభిస్తాయి.

వోడాఫోన్ ప్లే యాప్ లో అందుబాటులో ఉన్న....
అధిక డేటా మరియు ఉచిత కాల్స్ తో పాటు వోడాఫోన్ వినియోగదారుడు వోడాఫోన్ ప్లే యాప్ లో అందుబాటులో ఉన్న లైవ్ టీవీ,మూవీస్ ,వీడియో కంటెంట్ ను ఉచితంగా యాక్సిస్ చేసుకోవచ్చు.

జియో vs వోడాఫోన్
రిలయన్స్ జియో ప్రవేశపెట్టిన 4 జిబి, 5 జిబి డేటా ప్లాన్స్ పై పోటీ చేయాలని వోడాఫోన్ ప్రయత్నిస్తోంది.అయితే వోడాఫోన్ అందిస్తున్న సరి కొత్త ప్లాన్స్ కు జియో అందిస్తున్న రూ. 509,రూ.799 ప్లాన్స్ కు గట్టి పోటీనీ ఇస్తుంది. ఈ జియో రూ. 509 ప్లాన్ లో వినియోగదారుడు 4 జీబీ ఇంటర్నెట్ డేటా ,రూ. 799 ప్లాన్ లో 5 జీబీ ఇంటర్నెట్ డేటా పొందుతారు. రెండు ప్లాన్ లా కాలపరిమితి 28 రోజులు మాత్రమే. అదే విధంగా ఈ ప్లాన్స్ లో కూడా ఉచిత లోకల్, ఎస్టీడీ కాల్స్, 100 ఎసెమ్మెస్ లు లభిస్తాయి


Click it and Unblock the Notifications








