RS.9లకే అన్‌లిమిటెడ్ ప్రయోజనాలను అందిస్తున్న వోడాఫోన్ సాచెట్ ప్యాక్‌లు

|

వోడాఫోన్ ఐడియా ప్రస్తుతం కఠినమైన స్థితిలో ఉన్నప్పటికీ తన చందాదారులకు మంచి ప్రీపెయిడ్ ప్రణాళికలను అందిస్తూనే ఉంది. రిలయన్స్ జియో తన ఎంట్రీ లెవల్ సాచెట్ ప్యాక్‌లను కొన్ని రోజుల కిందట తొలగించింది. అయినప్పటికీ వోడాఫోన్ తన అన్‌లిమిటెడ్ సాచెట్ ప్యాక్‌లను వినియోగదారులకు అందిస్తూనే ఉంది.

వోడాఫోన్

వోడాఫోన్ పోర్టుఫోలియోలో రూ.9 మరియు రూ.21 అన్‌లిమిటెడ్ సాచెట్ ప్యాక్‌లతో పాటు మరొక రూ.59 డేటా సాచెట్ ప్యాక్ కూడా ఉంది.ఈ డేటా ప్యాక్ రోజుకు 1 జిబి డేటాతో ఏడు రోజులపాటు అందిస్తుంది. రూ.9 మరియు రూ.21ల సాచెట్ ప్యాక్‌లు రెండు రోజుల వరకు వాయిస్ కాలింగ్, అపరిమిత డేటా మరియు ఎస్ఎంఎస్ ప్రయోజనాలను అందిస్తుంది. వొడాఫోన్ నుండి వచ్చిన ఈ అన్‌లిమిటెడ్ సాచెట్ ప్యాక్‌లు ఎక్కువ దూరం ప్రయాణించే వినియోగదారులకు బాగా ఉపయోగపడతాయి.

 

తక్కువ ధర వద్ద ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ అదనపు ప్రయోజనాలుతక్కువ ధర వద్ద ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ అదనపు ప్రయోజనాలు

వోడాఫోన్ రూ.9ల సాచెట్ ప్యాక్‌ వివరాలు

వోడాఫోన్ రూ.9ల సాచెట్ ప్యాక్‌ వివరాలు

వొడాఫోన్ ప్రస్తుతం తన పోర్టుఫోలియోలో మూడు సాచెట్ ప్యాక్‌లను కలిగి ఉంది. ఇందులో మొదటిది రూ.9ల ప్లాన్. ఇది అందిస్తున్న ప్రయోజనాల విషయానికి వస్తే ఇది ఎటువంటి FUP పరిమితి లేకుండా అపరిమిత వాయిస్ కాలింగ్‌ను, రోజుకు 100 SMS లు మరియు 100MB 4G / 3G / 2G డేటాను కేవలం ఒక రోజు చెల్లుబాటుతో అందిస్తుంది. దీని ధరతో పరిశీలిస్తే ప్రయోజనాలు చాలా మెరుగ్గా ఉన్నాయి.

వోడాఫోన్ రూ.21ల సాచెట్ ప్యాక్‌ వివరాలు

వోడాఫోన్ రూ.21ల సాచెట్ ప్యాక్‌ వివరాలు

వోడాఫోన్ జాబితాలో ఉన్న మరొక ప్లాన్ రూ.21ల అన్‌లిమిటెడ్ సాచెట్ ప్యాక్. ఇది అపరిమిత వాయిస్ కాల్స్, 150MB 4G / 3G / 2G డేటా మరియు 100 ఎస్‌ఎంఎస్‌లతో రెండు రోజుల చెల్లుబాటుతో వస్తుంది. రూ.9 సాచెట్ ప్యాక్ మాదిరిగానే రూ .21 ప్యాక్ కూడా అపరిమిత వాయిస్ కాలింగ్‌ను అందిస్తుంది. ఇందులో ఎఫ్‌యుపి పరిమితి లేదు. 2019 ప్రారంభంలో వొడాఫోన్ ఐడియా వాయిస్ కాల్‌లపై FUP పరిమితిని తొలగించింది.

 

ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీలు ఇవేప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీలు ఇవే

గమనిక

గమనిక

మీరు ఈ రీఛార్జ్ ప్యాక్‌లతో రీఛార్జ్ చేసినప్పుడు టైంతో సంబంధం లేకుండా 00:00 గంటల వరకు మాత్రమే ప్రయోజనాలు చెల్లుబాటు అవుతాయని గమనించండి. ఉదాహరణకు మీరు ఈ రోజు రాత్రి 10 గంటలకు రూ.21 ప్యాక్ రీఛార్జ్ చేస్తే వాటి ప్రయోజనాలు ఉదయం 12AM వరకు మాత్రమే చెల్లుతాయి అంటే రెండు గంటలు మాత్రమే. కాబట్టి రీఛార్జికి వెళ్లడానికి ముందు ఈ విషయం బాగా గుర్తుంచుకోండి. ప్యాక్‌ యొక్క ప్రయోజనాలను పూర్తిగా ఉపయోగించుకోవడానికి ఉదయాన్నే లేదా 12AM తర్వాత రీఛార్జ్ చేసుకోవడం చాలా మంచిది.

 

మీరు ఆ వీడియోలు చూస్తున్నారా.. జాగ్రత్త హ్యాకర్లు చూస్తున్నారుమీరు ఆ వీడియోలు చూస్తున్నారా.. జాగ్రత్త హ్యాకర్లు చూస్తున్నారు

వోడాఫోన్ రూ.59ల సాచెట్ ప్యాక్‌ వివరాలు

వోడాఫోన్ రూ.59ల సాచెట్ ప్యాక్‌ వివరాలు

పైన పేర్కొన్న రెండు ప్లాన్‌లతో పాటుగా వోడాఫోన్‌లో రూ.59 ధర గల డేటా-ఓన్లీ సాచెట్ ప్యాక్ కూడా ఉంది. వోడాఫోన్ నుండి వచ్చిన ఈ సాచెట్ ప్యాక్‌ను ఇటీవల కొత్తగా ప్రవేశపెట్టారు. పైన తెల్పిన రెండు ప్లాన్‌లకు బిన్నంగా ఇది కేవలం డేటా ప్రయోజనంతో మాత్రమే వస్తుంది. రూ.59 సాచెట్ ప్యాక్ తో రీఛార్జ్ చేసే వోడాఫోన్ యూజర్లు రోజుకు 1GB డేటాను ఏడు రోజుల పాటు ఆస్వాదించగలుగుతారు. ఈ డేటా ప్యాక్ ఎక్కువగా ప్రయాణ సమయాలలో వినియోగదారులకు బాగా ఉపయోగపడుతుంది.

 

ఈ టెక్నాలజీ మీ సాధారణ కార్లను ఎలక్ట్రిక్ కారుగా మార్చగలదుఈ టెక్నాలజీ మీ సాధారణ కార్లను ఎలక్ట్రిక్ కారుగా మార్చగలదు

రిలయన్స్ జియో సాచెట్ ప్యాక్‌ వివరాలు

రిలయన్స్ జియో సాచెట్ ప్యాక్‌ వివరాలు

ఒక నెల క్రితం రిలయన్స్ జియో సంస్థ తమ రూ.19 మరియు రూ .52 సాచెట్ ప్యాక్‌లను తొలగించింది. మొదట రిలయన్స్ జియో రెండు ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు రూ.19 మరియు రూ.52 ధర వద్ద వరుసగా ఒక రోజు మరియు ఏడు రోజుల కాల పరిమితితో అపరిమిత ప్రయోజనాలతో అందించేది. కానీ ఇప్పుడు ప్రతి రిలయన్స్ జియో ప్రీపెయిడ్ యూజర్ కనీసం 98 రూపాయలతో రీఛార్జ్ చేయవలసి ఉంటుంది. ఇది 28 రోజుల పాటు అన్ని రకాల ప్రయోజనాలను అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Vodafone Sachet Pack Details: Offers,Benefits,validity

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X