ఎంతకొంటే అంత ఉచితం!

జియో దెబ్బకు వొడాఫోన్ కూడా దిగిరాక తప్పలేదు. పోటీ మార్కెట్ నేపథ్యంలో అన్ని 4జీ రీఛార్జుల పై డబల్ డేటాను ఆఫర్ చేస్తున్నట్లు వొడాఫోన్ ఇండియా ప్రకటించింది. రూ.255 అంతకన్నా ఎక్కువ రీఛార్జులకు మాత్రమే ఈ డబల్ డేటా ఆఫర్ వర్తిస్తుందని వొడాఫోన్ తెలిపింది.

Read More : ఈ ఫోన్‌లో ఒకేసారి 20 యాప్స్ రన్ చేసుకోవచ్చు!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1జీబి కొంటే మరొక జీబి ఫ్రీ...

వొడాఫోన్ లాంచ్ చేసిన కత్త స్కీమ్‌లో భాగంగా యూజర్ 1జీబి 4జీ డేటాను కొనుగోలు చేసినట్లయితే అతని అకౌంట్‍లో 2జీబి 4జీ డేటా యాడ్ అవుతుంది. ఇలా ఎన్ని జీబిలు కొంటే అన్ని జీబిలు ఇంటర్నెట్ అదనంగా యాడ్ అవుతుంటుంది.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రూ.255, అంతకన్నా ఎక్కువ రీఛార్జులకు మాత్రమే

రూ.255, అంతకన్నా ఎక్కువ రీఛార్జులకు మాత్రమే ఈ స్కీమ్ అందుబాటులో ఉన్న నేపథ్యంలో వొడాఫోన్ యూజర్లు ఆఫర్ ను సద్వినియోగం చేసుకునేందుకు మినిమమ్ 1జీ 4జీ డేటా అయినా రీఛార్జ్ చేయించుకోవల్సి ఉంటుంది. ఈ రీఛార్జ్ పై లభించే డేటాకు 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుందని వొడాఫోన్ తెలిపింది.

Vodafone Play..

రిలయన్స్ జియోకు పోటీగా వొడాఫోన్ సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. రిలయన్స్ MyJio యాప్ తరహాలో వొడాఫోన్ తన Vodafone Play యాప్‌ను మూడు నెలల పాటు ఉచితంగా సబ్‌స్ర్కైబ్ చేసుకునే అవకాశాన్ని తన యూజర్లకు కల్పిస్తోంది.

డిసెంబర్ 31, 2016 వరకు ఉచితం..

వొడాఫోన్ ప్లే యాప్‌ను ఫిబ్రవరి 2016లో లాంచ్ చేయటం జరిగింది. వొడాఫోన్ 3జీ అలానే 4జీ యూజర్లకు ఈ యాప్ అందుబాటులో ఉంది. ఏప్రిల్ 15 నుంచి ఈ యాప్ ను 4జీ యూజర్లకు 3 నెలలు పాటు 3జీ యూజర్లకు 1 నెల పాటు ఉచితంగా అందిచారు. ఆగష్టు 31తో ఆ గడువు ముగియటంతో తాజా సవరణలో భాగంగా డిసెంబర్ 31, 2016కు ఈ సబ్ స్ర్కిప్షన్‌ను పొడిగించటం జరిగింది.

లైవ్ టెలివిజన్ షోస్..

Vodafone Play యాప్ పూర్తిస్థాయిలో ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆఫర్ చేస్తుంది. ఈ యాప్ ద్వారా పూర్తి నిడివి సినిమాలతో పాటు లైవ్ టెలివిజన్ షోస్ అలానే వివిధ genresకు చెందిన మ్యూజిక్‌ను ఆస్వాదించవచ్చు.

14000 సినిమాలు..

ఈ యాప్‌లో 180 లైవ్ టీవీ ఛానళ్లతో పాటు 14000 పై చిలుకు సినిమాలు ఇంకా 12 లక్షల ఆడియో, వీడియో సాంగ్స్ అందుబాటులో ఉంటాయి. ఆండ్రాయిడ్ 4.1, iOS 7.0తో పాటు ఆపై వర్షన్ డివైస్‌లను Vodafone Play యాప్

సపోర్ట్ చేస్తుంది.

 

199 నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేయండి..

ఈ 90 రోజుల ఉచిత సబ్‌స్ర్కిప్షన్‌ను పొందాలనుకునే ఆండ్రాయిడ్ అలానే ఐఫోన్ యూజర్లు తమ తమ గూగుల్ ప్లే/ఐఓఎస్ యాప్ స్టోర్‌ల నుంచి Vodafone Play యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవల్సి ఉంటుంది. ఇలా కుదరని పక్షంలో PLAY అని టైప్ చేసి 199 నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేయటం ద్వారా అప్లికేషన్‌కు సంబంధించిన లింక్ అందుతుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Vodafone Started Offering Double Data Benefits on All the 4G Recharges!. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot