రూ.16కే వాడుకున్నంత 4జీ ఇంటర్నెట్

రిలయన్స్ జియోకు పోటీగా వొడాఫోన్ ఇండియా సరికొత్త టారిఫ్ ప్లాన్‌లను మార్కెట్లో అనౌన్స్ చేసింది. సూపర్ అవర్ స్కీమ్ పేరుతో అనౌన్స్ కాబడిన ఈ ప్లాన్స్‌లో భాగంగా రూ.16 చెల్లించి గంట పాటు అపరిమితంగా 3జీ/4జీ ఇంటర్నెట్‌ను వాడుకోవచ్చు. మరో ప్లాన్‌లో భాగంగా రూ.5 చెల్లించి గంట పాటు అపరిమితంగా 2జీ ఇంటర్నెట్‌ను వాడుకోవచ్చు.

రూ.16కే వాడుకున్నంత 4జీ ఇంటర్నెట్

Read More: భారత్‌కు సామ్‌సంగ్ 6బిబి ర్యామ్ ఫోన్, త్వరలోనే లాంచ్!

ప్రస్తుతానికి ఈ ఆఫర్‌ను ప్రీపెయిడ్ కస్టమర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంచినట్లు వొడాఫోన్ తెలిపింది. ఇదే సమయంలో సూపర్ అవర్ వాయిస్ కాలింగ్ ఆఫర్‌ను కూడా వొడాఫోన్ అనౌన్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆఫర్‌లో భాగంగా రూ.7 చెల్లించి గంట పాటు అపరిమితంగా మాట్లాడుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో సహా బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము అండ్ కాశ్మీర్ సర్కిళ్లలో జనవరి 9 నాటికి ఈ ఆఫర్ అందుబాటులోకి రానుంది.

English summary
Vodafone Offers Unlimited 3G/4G Data at Rs.16, 2G Data for Rs. 5, Validity Expires in 1 Hour. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot