Home
News

వొడాపోన్ రోజుకి 2జిబి డేటా ప్లాన్, టార్గెట్ ఆ రెండే !

దేశీయ టెలికాం రంగం రోజురోజుకు పెను విప్లవాల వైపుగా దూసుకుపోతోంది. జియో రాకతో పోటీవాతావరణం వేడెక్కిన విషయం అందరికీ తెలిసిందే.

By Hazarath Aiah

దేశీయ టెలికాం రంగం రోజురోజుకు పెను విప్లవాల వైపుగా దూసుకుపోతోంది. జియో రాకతో పోటీవాతావరణం వేడెక్కిన విషయం అందరికీ తెలిసిందే. ఉచిత ఆఫర్లతో దిగ్గజాలకు ముచ్చెమటలు పట్టించిన జియోని ఢీకొట్టడమే లక్ష్యంగా మిగతా టెల్కోలు ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారులు తమ నుంచి చేజారిపోకుండా కాపాడుకుంటున్నాయి.ఈ నేపథ్యంలోనే ప్రధాన పోటీదారులైన జియో, ఎయిర్‌టెల్‌తో సమానంగా వొడాఫోన్‌ సరికొత్త ప్లాన్‌తో ప్రజల ముందుకు వచ్చింది. 28 రోజుల పాటు రోజుకు 2జిబి డేటాను అందించే ప్లానుతో యూజర్లను ఆకట్టుకునేందుకు రెడీ అయింది.

రూ.255 రీఛార్జి చేయించుకుంటే

రూ.255 రీఛార్జి చేయించుకుంటే

రూ.255 రీఛార్జి చేయించుకుంటే ప్రిపెయిడ్‌ వినియోగదారులకు రోజూ 2జీబీ డేటాను 28 రోజుల సమయానికి అందించనున్నట్లు వొడాఫోన్ ఆధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. దీనికింద అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్‌ కాల్స్ చేసుకోవచ్చు. వొడాఫోన్‌ ప్లాన్ కింద రోజుకు 250 నిమిషాలు లేక వారానికి 1000 నిమిషాల వాయిస్‌ కాల్స్‌ వినియోగించుకోవచ్చు. రోజుకు 100 సందేశాలు పంపుకొనే సదుపాయం కూడా ఉంది.

తన రూ.198 ప్లాన్‌లో..

తన రూ.198 ప్లాన్‌లో..

ఇప్పటికే వొడాఫోన్ తన రూ.198 ప్లాన్‌లో అందిస్తున్న డేటా లిమిట్‌ను పెంచిన సంగతి తెలిసిందే. ఈ ప్లాన్‌లో వినియోగదారులకు రోజుకు 1జీబీ డేటా లభించగా ఇప్పుడు దీన్ని 400 ఎంబీ పెంచారు. దీంతో ప్రస్తుతం ఈ ప్లాన్‌లో యూజర్లకు రోజుకు 1.4 జీబీ వరకు మొబైల్ డేటా ఉచితంగా వస్తుంది. ఇక దీంతోపాటు యథావిధిగా ఈ ప్లాన్‌లో కస్టమర్లకు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీని 28 రోజులుగా నిర్ణయించారు.

రిలయన్స్ జియో

రిలయన్స్ జియో

ఇక రిలయన్స్ జియో తన కస్టమర్లకు రూ.299 ప్లాన్‌లో అందిస్తున్న డేటా లిమిట్‌ను 2జీబీ నుంచి 3జిబికి పెంచింది. ఇప్పుడీ ప్లాన్‌లో రోజుకు 3జీబీ మొబైల్ డేటాను యూజర్లు పొందవచ్చు. ఇక ఇందులో అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, కాంప్లిమెంటరీ జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ యథావిధిగా లభిస్తున్నాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉండడంతో మొత్తం అన్ని రోజులకు కలిపి జియో కస్టమర్లకు 84 జీబీ డేటా లభిస్తుంది.

 ఎయిర్‌టెల్‌

ఎయిర్‌టెల్‌

ఈ రూ.249 ప్యాక్‌లో రోజుకు 2జీబీ 3జీ లేదా 4జీ డేటా, అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను 28 రోజుల పాటు ఆఫర్‌ చేస్తోంది.

ఐడియా

ఐడియా

ఐడియా 249 రూపాయలతో రోజుకు 2జీబీ 3జీ లేదా 4జీ డేటాను, అపరిమిత వాయిస్‌ కాల్స్‌ను(రోమింగ్‌ కలిపి), ఉచిత ఎస్‌ఎంఎస్‌ ప్రయోజనాలను అందించనున్నట్టు పేర్కొంది. ఈ ప్యాక్‌ వాలిడిటీ 28 రోజులు. అంటే మొత్తంగా ఐడియా తన కస్టమర్లకు 56జీబీ డేటాను అందించనుంది. వాయిస్‌కాల్స్‌లో రోజుకు 250 నిమిషాలను, వారానికి 1000 నిమిషాలను మాత్రమే వెసులుబాటును ఐడియా కల్పిస్తుంది. ప్రస్తుతం ఈ ప్యాక్‌ ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

 వొడాఫోన్‌

వొడాఫోన్‌

ఈ మధ్యనే వొడాఫోన్‌ రూ.458, రూ.509లతో రెండు ప్రిపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. వాటికింద రోజుకు 1 జీబీ డేటా, అపరిమిత కాల్స్ పొందవచ్చు. వీటి కాలపరిమితి 70, 84 రోజులు. అంతేకాకుండా ఈ టెలికాం సంస్థ రూ.348 ప్లాన్‌ను సవరించింది. దీనికింద 1.5జీబీ డేటాను అందిస్తోంది.

Best Mobiles in India

English summary
To Counter Jio, Airtel, Vodafone Introduces Rs. 255 Plan, Offers 2GB Data Per Day More news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X