ఆధార్‌ కార్డ్ తీసుకువస్తే చాలు.. మొబైల్ కనెక్షన్ ఇచ్చేస్తాం!

Posted By: Staff

ఆధార్‌ కార్డ్ తీసుకువస్తే చాలు.. మొబైల్ కనెక్షన్ ఇచ్చేస్తాం!

 

హైదరాబాద్: ప్రముఖ మొబైల్ నెట్‌వర్క్ ప్రొవైడర్ వొడాఫోన్ ఇక పై ఆధార్ నెంబర్‌నే రుజువులుగా పరిగణించి కొత్త ప్రీయిడ్, పోస్ట్ పెయిడ్ కనెక్షన్లను మంజూరు చేయనుంది. సికింద్రాబాద్ ఎస్‌పి రోడ్, విజయవాడ బందర్ రోడ్‌లోని ఔట్‌లెట్ల లో ఈ విధానాన్ని బుధవారం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా వొడాఫోన్ రెసిడెంట్ డైరెక్టర్ (రెగ్యుటేలరీ వ్యవహారాలు, ప్రభుత్వ సంబంధాలు) టివి రామచంద్రన్ మాట్లాడుతూ.. ఈ విధానాన్ని క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరిస్తామని తెలిపారు.

ఈ విధానం అమలుపరిచేందుకు యుఐడిఎఐతో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. ఇప్పటివరకు కనెక్షన్ తీసుకోవాలనుకునే వారి నుంచి ట్రాయ్ నిబంధనలకు అనుగుణంగా నివాసం, గుర్తింపు ధ్రువీకరణ కోసం వేర్వేరుగా పత్రాలు తీసుకోవాల్సివచ్చేదని చెప్పారు. ఇక నుంచి ఆధార్ నంబర్ ఉన్న వారు ఆ నంబర్ చెబితే స్టోర్‌లోని వారు వారి వేలిముద్రలు తీసుకుని ఆధార్ ధ్రువీకరణకు పంపుతారని, యుఐడిఎఐ నుంచి ధ్రువీకరణ రాగానే క్షణాల్లో వొడాఫోన్ సిమ్‌కార్డు ఇస్తారని ఆయన తెలిపారు. ఇదంతా కొద్ది నిముషాల వ్యవధిలోనే జరుగుతుందన్నారు. ఇందుకోసం యుఐడిఎఐ తమకు అధీకృత సర్వీస్ ఏజెన్సీ (ఎఎస్ఎ), అధీకృత యూజర్ ఏజెన్సీ (ఎయుఎ) గుర్తింపును ఇచ్చిందని ఆయన చెప్పారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting