Home
News

వొడాఫోన్ రోజుకు 4.5జిబి డేటా కొత్త ప్లాన్ వివరాలు ఇవే !

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియోకి వొడాఫోన్ సవాల్ విసిరేందుకు రంగంలోకి దిగింది. 799 రూపాయలతో సరికొత్త ప్యాక్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.

By Hazarath

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియోకి వొడాఫోన్ సవాల్ విసిరేందుకు రంగంలోకి దిగింది. 799 రూపాయలతో సరికొత్త ప్యాక్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ ప్యాక్‌ డైరెక్ట్‌ జియో రూ.799 ప్లాన్‌కు పోటీగా ఉంది. జియో తన రూ.799 ప్లాన్‌ కింద రోజుకు 5జీబీ డేటా ఆఫర్‌ చేస్తుండగా... దీని కంటే 0.5 జీబీ తక్కువగా రోజుకు 4.5జీబీ డేటాను ఆఫర్‌ చేయనున్నట్టు వొడాఫోన్‌ తెలిపింది. ఈ ప్యాక్‌ వాలిడిటీ 28 రోజులు. దీంతో మొత్తంగా 28 రోజుల పాటు 126 జీబీ డేటా యూజర్లకు లభించనుంది. అదనంగా అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌, రోమింగ్స్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా లభించనున్నాయి.

రూ.549తో..

రూ.549తో..

దీంతో పాటు రూ.549తో కూడా వొడాఫోన్‌ మరో ప్లాన్‌ను ఆవిష్కరించింది. ఈ ప్లాన్‌ కింద రోజుకు 3.5జీబీ డేటాను వొడాఫోన్‌ ఆఫర్‌ చేయనుంది. దీనిపై కూడా ఇతర ప్రయోజనాలు అపరిమిత లోకల్‌, ఎస్టీడీ, రోమింగ్‌ వాయిస్‌ కాల్స్‌ ఉచితం. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా యూజర్లు పొందనున్నారు. మొత్తంగా యూజర్లకు 28 రోజులకు 98జీబీ డేటా అందుబాటులోకి రానుంది.

ఇటీవలే రూ.158 ప్లాన్‌

ఇటీవలే రూ.158 ప్లాన్‌

కాగా ఇటీవలే రూ.158 ప్లాన్‌ను వొడాఫోన్‌ పునరుద్ధరించింది. ఈ ప్లాన్‌ కింద కూడా 28 రోజులకు అపరిమిత వాయిస్‌ కాల్స్‌, 1జీబీ 3జీ లేదా 4జీ డేటాను వొడాఫోన్‌ ఆఫర్‌ చేస్తోంది. అయితే ఈ ప్లాన్‌పై రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాలు మాట్లాడుకునే అవకాశం మాత్రమే ఉంటుంది. ఈ ప్లాన్‌ కూడా డైరెక్ట్‌ జియో రూ.149 ప్లాన్‌కు గట్టి పోటీగా ఉంది.

కేరళ సర్కిల్‌లో..

కేరళ సర్కిల్‌లో..

ప్రీపెయిడ్‌ యూజర్ల కోసం ప్రత్యేకంగా రూ.151 సూపర్‌ప్లాన్‌ను కూడా వొడాఫోన్‌ ఆఫర్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు ప్లాన్స్‌ కూడా కేవలం కేరళ సర్కిల్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

 రెడ్‌ ప్లాన్‌ అప్‌డేట్‌

రెడ్‌ ప్లాన్‌ అప్‌డేట్‌

ఇదిలా ఉంటే తన పోస్టు పెయిడ్‌ సబ్‌స్క్రైబర్ల కోసం కొత్త రెడ్‌ ప్లాన్‌ను వొడాఫోన్‌ అప్‌డేట్‌ చేసింది. ఈ కొత్త వొడాఫోన్‌ ప్లాన్‌ రూ.399 కింద నెలకు 30జీబీ 3జీ/4జీ డేటాను ఆఫర్‌ చేయనున్నట్టు పేర్కొంది. డేటాతో పాటు అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌, నేషనల్‌ రోమింగ్‌, 100 ఎస్‌ఎంఎస్‌లు కస్టమర్లకు లభించనున్నాయి. వొడాఫోన్‌ ప్లే సర్వీసు ద్వారా రూ.4000 విలువైన మూవీలకు ఉచిత యాక్సస్‌ లభించనుంది.

నాలుగు నెలల పాటు

నాలుగు నెలల పాటు

నాలుగు నెలల పాటు 3500 ఈ-మ్యాగజైన్లను చదువుకునేలా మ్యాగ్‌జటర్‌ సబ్‌స్క్రిప్షన్‌ను వొడాఫోన్‌ ఆఫర్‌ చేయనుంది. ఇతర ప్లాన్స్‌ మాదిరిగానే కొత్త రూ.399 వొడాఫోన్‌ రెడ్‌ప్లాన్‌ అపరిమిత కాల్స్‌లో రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాలు మాత్రమే మాట్లాడుకోవాలి.

Best Mobiles in India

English summary
Vodafone to soon offer 126GB of 4G data at Rs 799 to take on Jio More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X