Just In
Don't Miss
- Sports
MI vs SRH: ప్చ్.. గెలిచే మ్యాచ్‌లో మళ్లీ ఓడిన హైదరాబాద్!
- News
కోవిడ్ ఆస్పత్రిలో మంటలు.. వార్డులకు వ్యాపించిన వైనం,, ఐదుగురు మృతి..
- Finance
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, జూలై 1 నుండి పూర్తి డీఏ
- Movies
ట్రెండింగ్: పోలీస్ స్టేషన్లో జబర్దస్త్ కమెడియన్..హాట్‌గా శ్రీముఖి.. రెండోపెళ్లి చేసుకో అంటూ యాంకర్ శ్యామలను..
- Lifestyle
కరోనా పెరగడానికి ఈ 4 విషయాలు ప్రధాన కారణం ... జాగ్రత్తగా ఉండండి ...
- Automobiles
భారత్‌లో ఫేమ్ స్కీమ్స్ కింద స్థాపించబడిన EV ఛార్జింగ్ స్టేషన్లు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Vodafone Long Term Plans ధరల పెంపుపై వోడాఫోన్ యూజర్లకు కొంత కాలం ఊరట
ప్రస్తుత కాలంలో టెలికాం పరిశ్రమలో అన్ని టెలికాం ఆపరేటర్లు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇందులో మరి ముఖ్యంగా వోడాఫోన్ ఐడియా సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత మరి కఠినంగా తయారైంది. వోడాఫోన్ యొక్క బకాయిలు దాదాపు రూ.28,000 కోట్లు ఉన్నాయి. ఈ నష్టాలను అధిగమించడానికి డిసెంబర్ 1 నుండి తన ప్లాన్ లపై ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.

వోడాఫోన్ ఐడియా తన ప్లాన్ లపై ధరలను పెంచుతున్నట్లు ప్రకటించినప్పటి నుండి చందాదారులు చాలా ఆలోచనలో పడ్డారు. డిసెంబర్ 1 నుండి ప్రస్తుతం వాడుతున్న ప్లాన్ లపై దాదాపు 30% రేట్లు పెరుగుతున్నట్లు అందరు భావిస్తున్నారు. అందుకోసం ధరలను పెంచడానికి ముందు దీర్ఘకాలిక ప్లాన్ లతో రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ప్రస్తుతం ఉన్న ధరల వద్ద డేటా మరియు వాయిస్ కాల్స్ సేవలను మరికొంత ఎక్కువ కాలం ఆస్వాదించవచ్చు. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వోడాఫోన్ ధరల పెంపు తర్వాత కూడా మీరు వాటి ప్రయోజనాలను ఆస్వాదించగలిగే కొన్ని ప్లాన్లను ఇక్కడ పొందుపరుస్తున్నాము. ఇక్కడ మేము పరిగణలోకి తీసుకున్నది 100 రోజుల లోపు మరియు 100 రోజులకు పైబడి ఉన్న లాంగ్ టర్మ్ ప్లాన్ వివరాలను తెలుపుతున్నాము. ఇక్కడ తెల్పుతున్న ప్రతి ప్లాన్ అన్ని రకాల అదనపు ప్రయోజనాలను కలుపుకొని వస్తాయి.

వోడాఫోన్ వినియోగదారుల కోసం అందిస్తున్న దీర్ఘకాలిక ప్రణాళికల జాబితాలో మొదటి వరుసలో ఉన్నది 399 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్. ఇది 1GB రోజువారి డేటాతో 84 రోజుల పాటు యాక్సిస్ ను అందిస్తుంది. ఈ ప్లాన్ మీద అపరిమిత కాల్స్, రోజుకు 100 SMS వంటి అదనపు ప్రయోజనం కూడా లభిస్తుంది. 84 రోజుల చెల్లుబాటు కాలంతో వస్తున్న మరొక ప్లాన్ రూ.458 ప్రీపెయిడ్ ప్లాన్. ఇది రోజుకు 1.5 జిబి డేటాను అన్లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్‌తో క్లబ్చేయబడి వస్తుంది.

ఈ రెండు ప్లాన్ల కంటే కొంచెం ఎక్కువ ధర వద్ద మరొక రూ.509 ప్లాన్ కూడా ఉంది. ఇది వినియోగదారులకు రోజుకు 1.5GB డేటాను 90 రోజుల పాటు యాక్సిస్ ను అందిస్తుంది. ఈ పరిమిత కాలంలో ఇది చందాదారులకు అపరిమిత కాల్‌లను కూడా అందిస్తుంది. మరింత ఎక్కువ డేటా కోసం ప్రయత్నిస్తున్న వినియోగదారుల కోసం 511 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ఉంది. ఇది 84 రోజుల చెల్లుబాటు కాలానికి యాక్సిస్ అందిస్తుంది. ఈ మొత్తం కాలంలో ఇది 2GB రోజువారి డేటాను అందిస్తుంది. అలాగే రూ.569 ప్రీపెయిడ్ ప్లాన్‌తో చందాదారులు రోజుకు 3 జీబీ డేటాను 84 రోజుల చెల్లుబాటుతో పొందుతారు.

వినియోగదారులు వారి ప్లాన్లపై మరింత ఎక్కువ కాలం యాక్సిస్ ను కోరుకుంటే కనుక వోడాఫోన్ యొక్క రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్ ను ఎంచుకోవచ్చు ఇది 180 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది. కాకపోతే ఇది అన్లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్‌తో కూడి ఉండి దీని మొత్తం చెల్లుబాటు కాలానికి కేవలం 6 జిబి డేటాను మాత్రమే అందిస్తుంది.

70 రోజుల చెల్లుబాటుతో చందాదారులకు లభిస్తున్న మరొక ప్లాన్ రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్. ఇది మొత్తం చెల్లుబాటు కాలానికి గాను కేవలం 3 జిబి డేటాను అందిస్తుంది అలాగే ఇది అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని అందిస్తుంది. 365 రోజుల సంవత్సరపు యాక్సిస్ విషయానికి వస్తే వోడాఫోన్ మొత్తం వాలిడిటీ వ్యవధిలో 12 జిబి డేటాను మరియు అపరిమిత కాల్స్ ప్రయోజనంతో రూ.999 ప్రీపెయిడ్ ప్లాన్ వస్తున్నది. అలాగే మొత్తం సంవత్సరపు చెల్లుబాటుతో రోజువారీ 1.5 జిబి డేటా మరియు అపరిమిత కాలింగ్ ప్రయోజనాలతో అందించే మరొక రూ.1,699 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది.

పైన తెలిపిన అన్ని ప్లాన్లు SMS ప్రయోజనాలతో వస్తాయి. అలాగే ఇవి వోడాఫోన్ ప్లే యాప్ కి కూడా యాక్సిస్ ను అందిస్తాయి. వీటిలో చందాదారులు సినిమాలు చూడవచ్చు మరియు ఇతర వీడియో ఫార్మాట్ కంటెంట్‌ను కూడా వినియోగించవచ్చు. అదే సమయంలో ధరల పెరుగుదలకు ముందు మీరు వీటితో రీఛార్జ్ చేస్తే దీర్ఘకాలిక ప్రణాళికలు మీకు కొంత మొత్తాన్ని ఆదా చేస్తాయని గమనించాలి. డిసెంబర్ 1 తరువాత ఈ ప్లాన్ల మీద సుమారు 30% పెంచవచ్చు.
-
54,535
-
1,19,900
-
54,999
-
86,999
-
49,975
-
49,990
-
20,999
-
1,04,999
-
44,999
-
64,999
-
20,699
-
49,999
-
11,499
-
54,999
-
7,999
-
8,980
-
17,091
-
10,999
-
34,999
-
39,600
-
25,750
-
33,590
-
27,760
-
44,425
-
13,780
-
1,25,000
-
45,990
-
1,35,000
-
82,999
-
17,999