Disney + Hotstar ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో లభించే Vi ప్రీపెయిడ్ ప్లాన్‌లు!! వాటి వివరాలు

|

ఇండియాలో గల మూడు అతిపెద్ద ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లలో ఒకటైన వోడాఫోన్ ఐడియా (Vi) యూజర్ల పరంగా ఎయిర్టెల్ మరియు జియో కంటే తక్కువ మందిని కలిగి ఉంది. ఇప్పుడు ఈ టెల్కో కేవలం రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లతో డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. ఈ రెండు ప్లాన్‌లలో గల ఉమ్మడి విషయానికి వస్తే ఇవి రెండూ కూడా 3GB రోజువారీ డేటా ప్రయోజనాలతో లభిస్తాయి. అంతే కాకుండా ఈ ప్లాన్‌లను కొనుగోలు చేసిన వినియోగదారులు కంపెనీ నుండి బోనస్ డేటాను పొందడానికి కూడా అర్హులు అవుతారు. డిస్నీ+ హాట్‌స్టార్ ప్రయోజనాన్ని ఉచితంగా అందించే వోడాఫోన్ ఐడియా యొక్క ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలను పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వోడాఫోన్ ఐడియా(Vi) డిస్నీ+ హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్

వోడాఫోన్ ఐడియా(Vi) డిస్నీ+ హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్

వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో తన యొక్క వినియోగదారులకు చౌకైన ధరలో డిస్నీ+ హాట్‌స్టార్ ప్రయోజనాన్ని ఉచితంగా అందించే ప్రీపెయిడ్ ప్లాన్ రూ.601 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు రోజుకు 100 SMS మరియు అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు 3GB రోజువారీ డేటాను పొందుతారు. అయితే ఈ ప్లాన్ 28 రోజుల స్వల్ప వ్యాలిడిటీని మాత్రమే కలిగి ఉంటుంది. ఇంకా వినియోగదారులు ఈ ప్లాన్‌తో Vi హీరో అన్‌లిమిటెడ్ ప్రయోజనాలను కూడా పొందుతారు. Vi హీరో అన్‌లిమిటెడ్ ప్రయోజనాలలో బింగే ఆల్ నైట్, వీకెండ్ డేటా రోల్‌ఓవర్ మరియు డేటా డిలైట్స్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. దీనితో పాటు వినియోగదారులు Vi మూవీస్ & TV VIPకి ఉచిత సబ్‌స్క్రిప్షన్ మరియు 16GB బోనస్ డేటా వంటి అధిక ప్రయోజనాలు కూడా పొందుతారు.

వోడాఫోన్ ఐడియా రూ. 901 డిస్నీ+ హాట్‌స్టార్ ప్లాన్

వోడాఫోన్ ఐడియా రూ. 901 డిస్నీ+ హాట్‌స్టార్ ప్లాన్

వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో రూ.901 ధర వద్ద అందించే మరొక ప్రీపెయిడ్ ప్లాన్‌తో కూడా తన యొక్క వినియోగదారులకు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తుంది. ఈ ప్లాన్ కూడా 3GB రోజువారీ డేటా ప్రయోజనంతో లభిస్తుంది. ఈ ప్లాన్‌ 70 రోజుల సర్వీస్ వాలిడిటీతో వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు రోజుకు 100 SMS ప్రయోజనాలను కూడా పొందుతారు. అదనంగా ఈ ప్లాన్ కు టెల్కో యొక్క అన్ని Vi హీరో ప్రయోజనాలు కూడా వర్తిస్తాయి. ఈ ప్లాన్ 48GB బోనస్ డేటాతో పాటు Vi Movies & TV VIP యాక్సెస్‌ను కూడా అందిస్తుంది.

డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్

Vi యొక్క ఈ రెండు ప్లాన్‌లతో ఉచితంగా లభించే డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కేవలం మొబైల్ ప్లాన్ మాత్రమేనని గుర్తుంచుకోవాలి. వినియోగదారులు ఒకేసారి నాలుగు స్క్రీన్‌లలో 4K రిజల్యూషన్‌లో కంటెంట్‌ను చూడటానికి అనుమతించే ప్రీమియం ప్లాన్ కాదని గుర్తుంచుకోండి. మీరు ప్లాట్‌ఫారమ్‌కి ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కావాలనుకుంటే మీరు రిలయన్స్ జియో యొక్క ప్రీపెయిడ్ ప్లాన్‌లకు వెళ్లవచ్చు.

అపరిమిత డేటాను ప్రయోజనంతో Vi పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు

అపరిమిత డేటాను ప్రయోజనంతో Vi పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు

వోడాఫోన్ ఐడియా (Vi) టెల్కో తన యొక్క వినియోగదారులకు అపరిమిత డేటా ప్రయోజనంతో పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నప్పటికీ కొన్ని ప్లాన్‌లు పరిమిత డేటా ప్రయోజనంతో కూడా లభిస్తాయి. వీటిలో మొదటగా చాలా సరసమైన ధరలో లభించే వాటి యొక్క ప్రయోజనాలను పరిశీలిద్దాం. రూ.699 ధర వద్ద లభించే పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ వినియోగదారులకు రెండు కనెక్షన్ లతో 80GB డేటాతో పాటు 200GB రోల్ ఓవర్ ఉపయోగంతో పాటుగా అపరిమిత వాయిస్ కాలింగ్‌ ప్రయోజనాలను పొందుతారు. వినియోగదారులు డేటాను వినియోగించకుండా నిర్దిష్ట పరిమితి వరకు పరిమితం చేసే డేటాపై ఫెయిర్ యూసేజ్ పాలసీ (FUP) లేదు. ఈ ప్లాన్‌తో ఉన్న ఏకైక సమస్య ఏమిటంటే ఇది నెలకు 100 SMSలను అందిస్తుంది. ఇది చాలా మందికి సరిపోదు. అమెజాన్ ప్రైమ్ యొక్క ఒక-సంవత్సరం సభ్యత్వం మరియు రూ.499 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ వంటి కొన్ని ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనాలను ఉచితంగా అందించే Vi పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ధరలు రూ.999 నుండి ప్రారంభమవుతాయి. ఇంకా Vi సంస్థ యొక్క తన స్వంత OTT ప్లాట్‌ఫారమ్‌ని Vi Movies & TVని వినియోగదారుల కోసం బండిల్ చేయబడి వస్తాయి. అయితే రూ.999 ధర వద్ద లభించే ప్లాన్ వినియోగదారులకు మూడు కనెక్షన్ లతో 220GB డేటాను వినియోగదారులకు అందిస్తుంది.

Vi యూజర్లకు ఆరు నెలల హంగామా మ్యూజిక్ ఉచిత సబ్స్క్రిప్షన్

Vi యూజర్లకు ఆరు నెలల హంగామా మ్యూజిక్ ఉచిత సబ్స్క్రిప్షన్

Vi యూజర్లు మొదటి ఆరు నెలల పాటు తమ Vi యొక్క యాప్ లో యాడ్-ఫ్రీ మ్యూజిక్ మరియు అపరిమిత డౌన్‌లోడ్‌లను పొందుతారని టెల్కో తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఆరు నెలల తర్వాత డౌన్‌లోడ్ మరియు ఆఫ్‌లైన్ మ్యూజిక్ అనుభవం కోసం వినియోగదారులు హంగామా మ్యూజిక్ అందించే ధరల వద్ద ఛార్జీలను చెల్లించి కొనుగోలు చేయవలసి ఉంటుంది. హంగామా మ్యూజిక్ యొక్క స్టాండర్డ్ మార్కెట్ సబ్‌స్క్రిప్షన్ ఛార్జీ కావచ్చు. వినియోగదారులకు మ్యూజిక్ యాప్ సేవలను అందిస్తున్న ఏకైక టెలికాం ఆపరేటర్ వోడాఫోన్ ఐడియా కాదని గమనించండి. భారతీ ఎయిర్‌టెల్ మరియు రిలయన్స్ జియో కూడా వినియోగదారులకు ఉచిత సంగీత సేవలను అందిస్తున్నాయి. ఎయిర్‌టెల్ దీనిని Wynk మ్యూజిక్ ప్లాట్‌ఫారమ్ ద్వారా అందిస్తుంది. అయితే జియో టెల్కో JioSaavn ద్వారా ఉచిత మ్యూజిక్ ని అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Vodafone(Vi) These Prepaid Plans Comes With Disney + Hotstar Free Subscription: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X