పోస్ట్‌పెయిడ్ విభాగంలో గెలుపు నీదా?నాదా? అంటున్న వోడాఫోన్ & ఎయిర్‌టెల్‌

|

పోస్ట్‌పెయిడ్ విభాగంలో భారతీ ఎయిర్‌టెల్‌కు వోడాఫోన్ ఇండియా తీవ్ర పోటీని ఇస్తోంది. భారతీ ఎయిర్‌టెల్ మొదటగా యాడ్-ఆన్స్ కాన్సెప్ట్‌తో వచ్చింది. త్వరలోనే వోడాఫోన్ కూడా దీనినే అనుసరించింది. గత సంవత్సరం వోడాఫోన్ RED ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఇది ఒక కనెక్షన్ మీద ఒకే సారి కుటుంబంలోని ఐదు కనెక్షన్‌లకు యాక్సిస్ ను అందిస్తుంది.

పోస్ట్‌పెయిడ్ ప్లాన్

ఉదాహరణకు వోడాఫోన్ యొక్క రూ.999 రెడ్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ మొత్తంగా ఐదు కనెక్షన్‌లకు యాక్సిస్ ను అందిస్తుంది. వీటిలో మొదటిది ప్రైమరీ కనెక్షన్ కాగా మిగిలిన నాలుగు చైల్డ్ కనెక్షన్లుగా ఉన్నాయి. అదేవిధంగా ఎయిర్టెల్ యొక్క మైప్లాన్ ఇన్ఫినిటీ ప్లాన్లు రూ.749 ధర వద్ద ఫ్యామిలీ యాడ్-ఆన్ కనెక్షన్లతో వస్తాయి.

 

 

5W ఛార్జింగ్ వేగంతో రియల్‌మి వైర్‌లెస్ ఛార్జర్... త్వరలోనే ప్రారంభం5W ఛార్జింగ్ వేగంతో రియల్‌మి వైర్‌లెస్ ఛార్జర్... త్వరలోనే ప్రారంభం

ఎయిర్‌టెల్

ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ రెండు కూడా రూ.749 ధర వద్ద పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను అందిస్తున్నాయి. ఇవి 125 జిబి వరకు డేటా రోల్‌ఓవర్ సౌకర్యం, అపరిమిత వాయిస్ కాలింగ్ వంటి అనేక ఇతర ప్రయోజనాలతో అందించబడతాయి. వోడాఫోన్ యొక్క రూ.749 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఎయిర్‌టెల్ ప్లాన్‌తో పోలిస్తే కొంచెం మెరుగైన ప్రయోజనాలను అందిస్తాయి. వాటి గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

ఫేస్‌బుక్‌లో హిస్టరీని డెలిట్ చేయడానికి కొత్తగా ఫేస్‌బుక్‌లో హిస్టరీని డెలిట్ చేయడానికి కొత్తగా "క్లియర్ హిస్టరీ" ఆప్షన్

వొడాఫోన్ రూ .749 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

వొడాఫోన్ రూ .749 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

వోడాఫోన్ యొక్క 749 రూపాయల రెడ్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ 200GB వరకు రోల్‌ఓవర్ సదుపాయంతో 120GB డేటా ప్రయోజనంను, ఇండియాలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు వంటి ప్రయోజనాలను అందిస్తాయి. అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే ఇవి రూ.499 విలువైన వోడాఫోన్ ప్లే చందాను, రూ.999 విలువైన అమెజాన్ ప్రైమ్ చందాను, రూ.3,000 విలువైన మొబైల్ ఇన్సూరెన్స్ కాంప్లిమెంటరీ, రూ.999 విలువైన Zee5 ప్రీమియం చందాలకు ఉచితంగా యాక్సిస్ ను అందిస్తుంది. చివరగా వోడాఫోన్ యొక్క రూ.749 ప్లాన్‌ రెండు యాడ్-ఆన్ కనెక్షన్‌లను కూడా అందిస్తోంది.

 

 

టాటా స్కై మల్టీ టీవీ కనెక్షన్‌లకు సువర్ణ అవకాశంటాటా స్కై మల్టీ టీవీ కనెక్షన్‌లకు సువర్ణ అవకాశం

భారతి ఎయిర్‌టెల్ రూ .749 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

భారతి ఎయిర్‌టెల్ రూ .749 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్‌టెల్ యొక్క రూ.749 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ అందిస్తున్న ప్రయోజనాల విషయానికి వస్తే ఇది 200GB వరకు రోల్‌ఓవర్ సదుపాయంతో 125 GB డేటా బెనిఫిట్, ఇండియాలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌ వంటి ప్రయోజనాలను అందిస్తుంది. ఇతర అదనపు ప్రయోజనాలలో రెండు యాడ్-ఆన్ కనెక్షన్లు, ఒక సంవత్సరపు అమెజాన్ ప్రైమ్ చందా, ZEE5 ప్రీమియం సభ్యత్వం, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ చందా మరియు హ్యాండ్‌సెట్ ప్రొటెక్షన్ వంటి ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

 

 

స్మార్ట్‌ఫోన్ బ్యాటరీని సేవ్ చేయడానికి 5 చిట్కాలుస్మార్ట్‌ఫోన్ బ్యాటరీని సేవ్ చేయడానికి 5 చిట్కాలు

ఎయిర్‌టెల్ & వొడాఫోన్ రూ.749 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల పోలికలు

ఎయిర్‌టెల్ & వొడాఫోన్ రూ.749 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల పోలికలు

పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో ఈ రెండు టెల్కోలు అందించే ప్రయోజనాలు సమానంగా ఉన్నపటికీ వోడాఫోన్ కొంచెం అధిక ప్రయోజనాలను కలిగి ఉంది. వోడాఫోన్ యొక్క రూ.749 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో మెయిన్ కనెక్షన్‌తో పాటు అదనంగా రెండు ఫ్యామిలీ కనెక్షన్‌లను కూడా అందిస్తోంది. ఎయిర్‌టెల్ కూడా మూడు యాడ్-ఆన్ కనెక్షన్‌లను అందిస్తోంది. అయితే ఎయిర్టెల్ యొక్క ప్లాన్ ఒక సాధారణ యాడ్-ఆన్ కనెక్షన్ మరియు ఒక డేటా యాడ్-ఆన్ కనెక్షన్‌ను అందిస్తుంది. అంటే రెండవ యాడ్-ఆన్ కనెక్షన్ డేటా ప్రయోజనాన్ని మాత్రమే వినియోగించగలదు.

 

 

మీ ఫోన్‌లు పాడవ్వక ముందే ఈ యాప్‌లను వెంటనే తొలగించండిమీ ఫోన్‌లు పాడవ్వక ముందే ఈ యాప్‌లను వెంటనే తొలగించండి

కనెక్షన్‌

వోడాఫోన్ ఎయిర్‌టెల్ మాదిరిగా కాకుండా రెండు రెగ్యులర్ కనెక్షన్‌లను అందిస్తోంది. వోడాఫోన్ అందిస్తున్న డేటా ఆఫర్‌ల విషయంలో కాస్త వెనుకంజలో ఉంది. ప్రతి సాధారణ యాడ్-ఆన్ కనెక్షన్‌కు వోడాఫోన్ 30GB డేటా ప్రయోజనాన్ని అందిస్తోంది. అయితే ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లో అలాంటి పరిమితి లేదు. ఎయిర్‌టెల్ ప్రణాళికలో మొత్తం 125GB డేటా ప్రయోజనం యాడ్-ఆన్‌లతో సహా ప్రతి కనెక్షన్ ద్వారా ఉపయోగించబడుతుంది.

Best Mobiles in India

English summary
Vodafone Vs Bharti Airtel: Who Own The 3 Add-on Connections Postpaid Plans

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X