ఒకేసారి నాలుగు Android 4K TVలతో దూసుకొచ్చిన వియు
లగ్టరీ టెలివిజన్ బ్రాండ్ వియు ఇండియా మార్కెట్లో దూసుకుపోతోంది. ఇప్పటికే బడ్జెట్ రేంజ్ లోనూ అలాగే ప్రీమియం ధరల్లోనూ అదిరిపోయే టీవీలను లాంచ్ చేసిన ఈ దిగ్గజం మళ్లీ సరికొత్త టీవీలతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ
లగ్టరీ టెలివిజన్ బ్రాండ్ వియు ఇండియా మార్కెట్లో దూసుకుపోతోంది. ఇప్పటికే బడ్జెట్ రేంజ్ లోనూ అలాగే ప్రీమియం ధరల్లోనూ అదిరిపోయే టీవీలను లాంచ్ చేసిన ఈ దిగ్గజం మళ్లీ సరికొత్త టీవీలతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఒకేసారి నాలుగు premium-android-4k-tvలను లాంచ్ చేసింది. 43 అంగుళాలు, 50 అంగుళాలు, 55అంగుళాలు, 65అంగుళాల టీవీలను కంపెనీ తీసుకువచ్చింది.

ఈ స్మార్ట్ టీవీలన్నీ ఆండ్రాయిడ్ ఓరియో మీద రన్ అవుతాయి. అలాగే డాల్బే ఆడియో యాక్టివాయిస్ రిమోట్ ఫీచర్ లు ఉన్నాయి. గూగుల్ ప్లేకి నేరుగా యాక్సస్ కావచ్చు. తద్వారా యూట్యూబ్ ఇతర వీడియోలను వీక్షించవచ్చు.

మార్కెట్లో సత్తా చాటుతాం
వియు కంపెనీ టెలివిజన్ రంగంలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తోందని వీక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని వియు CEO & Design Head Devita Saraf తెలిపారు. ప్రీమియం ఆండ్రాయిడ్ 4కె మార్కెట్లో సరికొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీ మీద అడుగులు వేస్తున్నామని తెలిపారు.

ఫీచర్లు
ఈ నాలుగు టీవీలు 4K HDR 10 technology అలాగే 4K upscalingతో పనిచేస్తాయి. దీంతో పాటు ఫ్రీ లోడెడ్ యాప్స్ గా YouTube, Hotstar, SonyLIV, Eros Now, ZEE5 and Hungama లాంటివి వస్తాయి. అంతే కాకుండా యాక్టివాయిస్ ఫీచర్ ద్వారా నేరుగా గూగుల్ ప్లేకి కనెక్ట్ కావచ్చు. వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ ను పొందుపరిచారు.

దరలు
కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం ultra HD formatలో ఈ నాలుగు టీవీల వచ్చాయి. 43 అంగుళాల టీవీ ధరను కంపెనీ రూ. 43 వేలుగా నిర్ణయించింది. 50 అంగుళాల టీవీ ధరను రూ.51 వేలుగా నిర్ణయించింది.55 అంగుళాల టీవీ ధరను రూ.59 వేలుగా అలాగే 65 అంగుళాల టీవీ ధరను లక్షా 10 వేలుగా నిర్ణయించింది.

ఎక్కడ లభిస్తాయి
ఈ నాలుగు స్మార్ట్ టీవీలు అన్నీ ఆన్ లైన్ స్టోర్లలోనూ అలాగే ఆఫ్ లైన్ స్టోర్లలోనూ లభిస్తాయి. ఆసక్తి ఉన్నవారు ఈ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








