Home
News

శామ్‌సంగ్ అదిరిపోయే ఆఫర్.. నడిస్తే చాలు.. రూ.59,999 విలువైన గెలాక్సీ వాచ్ అల్ట్రా మీ సొంతం!

Samsung Health Challenge: శామ్‌సంగ్ ఇండియా అదిరిపోయే ఆఫర్‌తో మీ ముందుకు వచ్చింది. 'వాక్-ఎ-థాన్ ఇండియా’ ఛాలెంజ్‌తో శామ్‌సంగ్ హెల్త్ యాప్ యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఛాలెంజ్‌లో పాల్గొంటే, ఏకంగా శామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా గెలుచుకునే ఛాన్స్ మీ సొంతం. నెల రోజుల్లో 2 లక్షల అడుగులు నడిస్తే చాలు. ఇండియాలో శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ఎవరైనా, శామ్‌సంగ్ హెల్త్ యాప్ ఉన్నవాళ్లు ఈ ఛాలెంజ్‌లో పాల్గొనవచ్చు.

2025 జనవరి 30న మొదలైన ఈ ఛాలెంజ్, 2025 ఫిబ్రవరి 28 వరకు ఉంటుంది. స్టెప్ టార్గెట్ రీచ్ అయ్యాక, ప్రూఫ్ సబ్మిట్ చేస్తే లక్కీ డ్రాకి ఎలిజిబుల్ అవుతారు. ఇంకెందుకు ఆలస్యం, ఈ ఛాలెంజ్ డీటెయిల్స్, రూల్స్, రివార్డ్స్ అన్ని చూద్దాం.

Walk 200 000 Steps  Win a Rs 59 999 Samsung Galaxy Watch Ultra  Here   s How

* ఎవరు, ఎలా పాల్గొనాలి..

ఇండియాలో ఎవరైతే శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారో వాళ్లందరూ జాయిన్ అవ్వొచ్చు. మీ ఫోన్‌లో శామ్‌సంగ్ హెల్త్ యాప్ ఉండాలి. దాదాపు ఇంకా 20 రోజులు సమయం ఉంది కాబట్టి రోజూ పదివేల అడుగులు నడిచినా చాలు. ముందుగా శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లో శామ్‌సంగ్ హెల్త్ యాప్ ఓపెన్ చేయాలి. 'టుగెదర్’ సెక్షన్‌కి వెళ్లి 'వాక్-ఎ-థాన్ ఇండియా’ ఛాలెంజ్‌లో జాయిన్ అవ్వాలి.

ఇది జనవరి 30 నుంచి ప్రారంభమైంది. రోజూ నడవండి, శామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో మీ స్టెప్స్ ట్రాక్ చేయాలి. 2025 ఫిబ్రవరి 28 లోపు 2 లక్షల అడుగులు టార్గెట్ రీచ్ అవ్వండి. టార్గెట్ రీచ్ అయ్యాక, మీ స్టెప్ కౌంట్ స్క్రీన్ షాట్ తీయాలి. ఆ స్క్రీన్ షాట్‌ని శామ్‌సంగ్ మెంబర్స్ యాప్‌లో #WalkathonIndia హ్యాష్‌ట్యాగ్‌తో అప్‌లోడ్ చేయండి.

* రివార్డ్ ఏంటి..

ఛాలెంజ్ కంప్లీట్ చేసిన వాళ్లలో ముగ్గురు లక్కీ విన్నర్స్‌ని రాండమ్‌గా సెలెక్ట్ చేస్తారు. విన్నర్స్‌కి శామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా ఇస్తారు. ఈ ప్రీమియం స్మార్ట్‌వాచ్ ధర అక్షరాలా రూ.59,999. ఛాలెంజ్ అయిపోయాక విన్నర్స్‌ని అనౌన్స్ చేస్తారు.

* ట్రాకింగ్, కాంపిటీషన్

శామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో రియల్ టైమ్ లీడర్‌బోర్డ్ ఉంటుంది. మీ ర్యాంక్ ఏంటో, మిగతా వాళ్లతో పోలిస్తే మీ ప్రోగ్రెస్ ఎలా ఉందో చెక్ చేసుకోవచ్చు. శామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా ఒక టాప్-ఎండ్ స్మార్ట్‌వాచ్. ఇందులో 1.5-అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లే, 480x480 రిజల్యూషన్, 3,000 నిట్స్ బ్రైట్‌నెస్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ ఉన్నాయి..

ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే (AoD) ఫీచర్ కూడా ఉంది. టైటానియం గ్రేడ్ 4 ఫ్రేమ్, 10 ATM వాటర్ రెసిస్టెన్స్ దీనిలోని తన ప్రత్యేకతలు. ఇది W1000 ప్రాసెసర్‌తో వస్తుంది, 2GB RAM, 32GB స్టోరేజ్ ఉంటుంది. బ్లూటూత్ 5.3, LTE, NFC, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, GPS సపోర్ట్ చేస్తుంది.

* హెల్త్ ఫీచర్స్

స్టెప్స్, హార్ట్ రేట్, SpO2, BMI, బ్లడ్ ప్రెషర్, ECG ట్రాక్ చేస్తుంది. AI పవర్డ్ ఇన్సైట్స్ కూడా ఉన్నాయి. అడ్వాన్స్‌డ్ ఫిట్‌నెస్ మెట్రిక్స్ విషయానికొస్తే, సైక్లింగ్ కోసం ఫంక్షనల్ థ్రెషోల్డ్ పవర్ (FTP), మల్టీ-స్పోర్ట్ టైల్ ఉన్నాయి. 590mAh బ్యాటరీ ఉంటుంది, AoD ఆఫ్ చేస్తే 80 గంటల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుంది.

సేఫ్టీ ఫీచర్స్ చూస్తే ఇందులో 86-డెసిబెల్ సైరన్, ఫాల్ డిటెక్షన్, ఎమర్జెన్సీ SOS అలర్ట్స్ ఆఫర్ చేశారు. ఇది వేర్OS 5 మీద రన్ అవుతుంది, గూగుల్ ప్లే యాప్స్, థర్డ్-పార్టీ సర్వీసెస్‌ని సపోర్ట్ చేస్తుంది. చూశారుగా, ఇందులో దాదాపు అన్ని ఫీచర్లూ ఉన్నాయి. దీన్ని సొంతం చేసుకుంటే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు.

* ఈ ఛాలెంజ్‌లో ఎందుకు జాయిన్ అవ్వాలి..

ఫిట్‌గా ఉండడానికి, యాక్టివ్‌గా ఉండడానికి ఇది ఒక సరదా మార్గం. మీ ప్రోగ్రెస్ ట్రాక్ చేసుకోవచ్చు, మిగతా వాళ్లతో పోటీ పడొచ్చు. ఇంకా ముఖ్యంగా, ప్రీమియం స్మార్ట్‌వాచ్ గెలుచుకునే గోల్డెన్ ఛాన్స్ లభిస్తుంది. ఇప్పుడే వాక్-ఎ-థాన్ ఇండియా ఛాలెంజ్‌లో జాయిన్ అవ్వండి, 2 లక్షల అడుగులు కొట్టండి, గెలాక్సీ వాచ్ అల్ట్రా గెలుచుకునే ఛాన్స్ కొట్టేయండి.

Best Mobiles in India

English summary
Samsung's Walk-a-thon India challenge in February 2025: Walk 200,000 steps using Samsung Health app to win Galaxy Watch Ultra. Open to Samsung phone users.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X