HDFC ఎర్గో స్కామ్ బట్టబయలు.. యాపిల్ వాచ్ ఫ్రీ ఆఫర్‌తో నిలువునా ముంచేశారు!
HDFC Ergo Apple Watch cashback: నవంబర్‌లో ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించేందుకు "ఇండియా గెట్స్ మూవింగ్" అనే పేరుతో జోప్పర్, HDFC ఎర్గో కలిసి ఒక ఆఫర్‌ను ప్రకటించాయి. అదేంటంటే, యాపిల్ వాచ్ కొన్న కస్టమర్లు, రోజుకి 15,000 అడుగులు నడిస్తే, వాచ్ డబ్బులు మొత్తం క్యాష్‌బ్యాక్ రూపంలో తిరిగి పొందొచ్చు. ఈ ఆఫర్ నచ్చి చాలామంది వాచ్‌లు కొనేసి, స్టెప్స్ ట్రాక్ చేయడం మొదలుపెట్టారు. ఏడాది తర్వాత డబ్బులు తిరిగొస్తాయని ఆశగా ఎదురుచూశారు. కానీ చాలామందికి క్యాష్‌బ్యాక్ రాలేదు.
* అసలు సమస్య ఇదే
మొదట్లో అంతా సజావుగానే సాగింది. జనాలు యాపిల్ వాచ్‌లు కొన్నారు, రోజుకి 15 వేల అడుగులు నడిచారు, అన్నీ రూల్స్ ఫాలో అయ్యారు. కానీ క్యాష్‌బ్యాక్ ఇవ్వాల్సిన టైమ్ వచ్చేసరికి చాలామంది క్లెయిమ్స్‌ని HDFC ఎర్గో రిజెక్ట్ చేసింది. కారణం ఏంటంటే, కొంతమంది స్టెప్స్‌ని మోసం చేసి పెంచారట.

అంతేకాదు, వేరే వాళ్లకి వాచ్ ఇచ్చి నడిపించారని, లేదా ఫేక్ స్టెప్స్ కోసం ఏవో టూల్స్ వాడారని కంపెనీ చెప్పింది. కానీ చాలామంది యూజర్లు తాము మోసం చేయలేదని, కరెక్ట్‌గానే నడిచామని అంటున్నారు. అంతేకాదు, GPS డేటా, హార్ట్ రేట్ రికార్డ్స్ లాంటి అదనపు ప్రూఫ్‌లు పెట్టినా కూడా క్లెయిమ్స్‌ని రిజెక్ట్ చేశారంట.
* యూజర్ల ఆగ్రహం - #FraudErgo ట్రెండింగ్..
ఇది ఎంత అన్యాయమో చెప్పండి అంటూ కస్టమర్లు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోసపోయామని ఫీలైన యూజర్లు సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. ఒక ఫిట్‌నెస్ కోచ్ అయితే ఈ స్కీమ్‌ని "మోసం" అంటూ తిట్టిపోశాడు. తప్పుడు హామీలతో తమను బురిడీ కొట్టించారని ఫైర్ అయ్యాడు.
ఇంకొక యూజర్ HDFC ఎర్గో ఒక "కుట్రపూరిత స్కామ్" నడిపిందని ఆరోపించాడు. ఏకంగా యాపిల్ ఇండియా, యాపిల్ సపోర్ట్‌ని ట్యాగ్ చేసి మరీ గోల చేశాడు. టెక్నోఫినో లాంటి ఫోరమ్‌లలో కూడా ఈ విషయం హాట్ టాపిక్ అయిపోయింది. నెటిజన్లు HDFC ఎర్గోని ఓ రేంజ్‌లో ఆడుకున్నారు.
* యూజర్లపై ఆర్థిక భారం
చాలామంది క్యాష్‌బ్యాక్ వస్తుందని నమ్మి యాపిల్ వాచ్ కోసం చాలా ఖర్చు పెట్టారు. ఇప్పుడు డబ్బులు తిరిగి రాకపోవడంతో, వాళ్లకి ఊహించని ఆర్థిక ఇబ్బందులు వచ్చి పడ్డాయి. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, కొంతమంది యూజర్ల ఇన్సూరెన్స్ పాలసీలను కూడా HDFC ఎర్గో క్యాన్సిల్ చేసిందంట. దీంతో కంపెనీ మీద నమ్మకం పూర్తిగా పోయింది.
HDFC ఎర్గోకి ఫోన్లు చేసినా, మెయిల్స్ పెట్టినా ఎవరూ పట్టించుకోలేదు. వాళ్లకి రెస్పాన్స్ ఇవ్వడానికి కూడా టైమ్ లేదట. విమర్శలు ఎక్కువ కావడంతో, HDFC ఎర్గో ఒక స్టేట్‌మెంట్ ఇచ్చింది. కొంతమంది యూజర్లు "అనుమానాస్పదమైన డేటా" సబ్మిట్ చేశారని, అందుకే క్లెయిమ్స్‌ని రిజెక్ట్ చేశామని చెప్పుకొచ్చింది.
* దర్యాప్తు చేశాం
దర్యాప్తు చేశాక మోసం చేసినట్టు ఆధారాలు దొరికాయని కూడా చెప్పింది. అందుకే క్లెయిమ్స్ రిజెక్ట్ చేశామని, అంతేకాదు కొన్ని పాలసీలు కూడా క్యాన్సిల్ చేశామని చెప్పింది. అసలు మోసం చేయని వాళ్లకి మాత్రం క్యాష్‌బ్యాక్ ఇచ్చేశామని కంపెనీ గొప్పగా చెప్పుకుంది. కానీ చాలామంది కస్టమర్లు మాత్రం HDFC ఎర్గో మాటల్ని నమ్మట్లేదు.
ఎందుకంటే, తాము కరెక్ట్‌గానే డేటా ఇచ్చినా కూడా క్లెయిమ్స్‌ని రిజెక్ట్ చేశారని వాళ్లు వాపోతున్నారు. దీంతో స్కీమ్ మొదట్లోనే మంచి ఐడియాలా అనిపించినా, ఇప్పుడు మాత్రం అట్టర్ ఫ్లాప్ అయిందని చాలామంది అంటున్నారు. యూజర్ల నమ్మకాన్ని HDFC ఎర్గో పూర్తిగా పోగొట్టుకుంది. ఇలాంటి మోసాలు జరగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
* జాగ్రత్తలు
ఇలాంటి స్కీమ్స్‌లో మోసపోకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. క్యాష్‌బ్యాక్ ప్రోగ్రామ్‌లో చేరేముందు రూల్స్ అన్నీ క్షుణ్ణంగా చదవాలి. చిన్న ముద్రణలో ఏముందో కూడా చూడాలి. కంపెనీ ఇంతకుముందు ఎలా పనిచేసింది, కస్టమర్ల రివ్యూస్ ఏంటి అనేది తెలుసుకోవాలి. గూగుల్ రివ్యూస్ చూడటం మర్చిపోవద్దు.
స్టెప్ కౌంట్ స్క్రీన్‌షాట్స్, GPS డేటా లాంటి ప్రూఫ్స్ అన్నీ భద్రంగా దాచుకోవాలి. గొడవ జరిగితే ఇవే మనకు ఉపయోగపడతాయి. క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఉందని వెంటనే ఖరీదైన వస్తువులు కొనెయ్యొద్దు. ఎందుకంటే, రూల్స్ ఎప్పుడైనా మారొచ్చు. ఈసారి ఇలాంటి స్కీమ్స్‌లో జాయిన్ అయ్యేముందు జాగ్రత్తగా ఉండండి.


Click it and Unblock the Notifications