డిజిటల్ పేమెంట్ దిగ్గజాలకు ఫోన్‌పే షాక్, రూ.743 కోట్లతో దూకుడు

డిజిటల్ పేమెంట్ దిగ్గజాలకు ఫోన్‌పే షాక్, రూ.743 కోట్లతో దూకుడుగ్లోబల్ ఆన్‌లైన​ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్‌ తీసుకున్న కీలక నిర్ణయం పేటీఎం, అమెజాన్‌, గూగుల్‌కు షాకివ్వనున్నది. ఇప్పటికే దేశీయ ఆన్‌లైన

|

గ్లోబల్ ఆన్‌లైన​ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్‌ తీసుకున్న కీలక నిర్ణయం పేటీఎం, అమెజాన్‌, గూగుల్‌కు షాకివ్వనున్నది. ఇప్పటికే దేశీయ ఆన్‌లైన్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మెజార్టీ వాటాను కొనేసిన వాల్‌మార్ట్‌. తాజాగా ఫ్లిప్‌కార్ట్‌ సొంతమైన ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ చెల్లింపుల సంస్థ ఫోన్‌పేలో భారీ పెట్టుబడులను పెడుతోంది. డిజిటల్‌‌‌‌ పేమెంట్స్‌‌‌‌ సేవలు అందించే ఫోన్‌ పేకు సింగపూర్‌‌‌‌కు చెందిన తన మాతృసంస్థ ఫోన్‌ పే ప్రైవేట్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ (ఇది వరకు ఫ్లిప్‌ కా ర్ట్‌‌‌‌ పేమెంట్స్‌‌‌‌) నుంచి తాజాగా రూ.743.5 కోట్ల పెట్టు బడులు వచ్చాయి.

 
డిజిటల్ పేమెంట్ దిగ్గజాలకు ఫోన్‌పే షాక్, రూ.743 కోట్లతో దూకుడు

ఈ మేరకు ఫోన్‌ పే రిజిస్ట్రార్‌‌‌‌ ఆఫ్‌ కంపెనీస్‌‌‌‌ (ఆర్‌‌‌‌ఓసీ)కు సమాచారం అందించింది. కాగా ఫ్లిప్‌ కా ర్ట్‌‌‌‌లో 70 శాతానికిపైగా వాటాను వాల్‌‌‌‌మార్ట్‌‌‌‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

ఫోన్‌పేలో 763 కోట్ల రూపాయలు

ఫోన్‌పేలో 763 కోట్ల రూపాయలు

డిజిటల్‌ పేమెంట్‌ మార్కెట్‌లో రానున్న విప్లవాత్మక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వాల్‌మార్ట్‌ ఈ పెట్టుబడులను పెడుతోంది. ఫోన్‌పేలో 763 కోట్ల రూపాయలు (సుమారుగా 111 మిలియన్ డాలర్లు) సమకూర్చింది. 2019లో కంపెనీకి మొట్టమొదటి పెట్టుబడి నిధిగా భావిస్తున్నారు.
ప్రకటనలు, ప్రమోషన్లపై సమీర్ నిగమ్ నేతృత్వంలోని కంపెనీ 500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని, ప్రత్యేకించి రానున్న ఐపిఎల్ సీజన్లో ప్రకటనలు, ప్రమోషన్లపై వెచ్చించాలని భావిస్తు‍న్న సమయంలో తాజా నిధులు అందడం విశేషం.

 

 

2017లో 500మిలియన్‌ డాలర్ల నిధులు

2017లో 500మిలియన్‌ డాలర్ల నిధులు

బెంగళూరుకు చెందిన సమీర్‌ నిగమ్‌ స్థాపించిన మొబైల్‌ పేమెంట్‌ సంస్థ ఫోన్‌పేను ఫ్లిప్‌కార్ట్‌ 2016లో కొనుగోలు చేసింది. 2017లో 500మిలియన్‌ డాలర్ల నిధులు సమకూర్చింది. దీంతో డిజిటల్‌ చెల్లింపుల రంగంలో మార్కెట్‌ లీడర్‌గా దూసుకుపోతోంది.
ప్రత్యర్థులకు ధీటుగా 50 మిలియన్లకు పైగా నెలవారీ వినియోగదారులతో ప్రత్యర్థులకు ధీటుగా దూసుకుపోతోంది. పేటీఎం, గూగుల్‌ పే, అమెజాన్‌ పే, వాట్సాప్‌ పేమెంట్స్‌, జియోతో పాటు కొత్తగా షియోమి ఎంఐ పే ఇటీవల డిజిటల్‌ చెల్లింపుల రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.

బ్రాండ్‌‌‌‌ అంబాసిడర్‌
 

బ్రాండ్‌‌‌‌ అంబాసిడర్‌

తన యాప్‌ కు మరింత ప్రచారం కల్పించుకోవడానికి ఈ కంపెనీ బ్రాండ్‌‌‌‌ అంబాసిడర్‌‌‌‌గా బాలీవుడ్‌‌‌‌ సూపర్‌‌‌‌స్టార్‌‌‌‌ ఆమిర్‌‌‌‌ ఖాన్‌ ను నియమించుకుంది. ఈ ఏడాది ప్రచార కార్యక్రమాల కోసం రూ.500 కోట్లను కేటాయించింది.
ఆఫర్లను కొనసాగించాల్సిందే ఎస్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌తో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా యూనిఫైడ్‌‌‌‌ పేమెంట్స్‌‌‌‌ ఇంటర్‌‌‌‌ఫేస్‌‌‌‌ (యూపీఐ) సేవలు అందిస్తున్న ఫోన్‌పే.. పేటీఎం, గూగుల్‌‌‌‌ పే నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నది. పీఐ విధానంలో చెల్లింపులు జరిపిన వారికి పేటీఎం ప్రత్యేక ఆఫర్లను ,క్యాష్‌ బ్యాక్‌‌‌‌లను ఇస్తోంది. స్క్రాచ్‌‌‌‌కార్డు ల ద్వారాక్యాష్‌ బ్యాక్‌‌‌‌లు ఇస్తూ గూగుల్‌‌‌‌ పే కస్టమర్లను ఆకట్టుకుంటోంది.

వాట్సప్‌ కూడా

వాట్సప్‌ కూడా

ప్రముఖ మెసెంజర్‌‌‌‌ ఆప్‌ వాట్సప్‌ కూడా డిజిటల్‌‌‌‌ పేమెంట్స్‌‌‌‌ విభాగంలోకి త్వరలోనే అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. దీంతో గూగుల్‌‌‌‌ పే, ఫోన్‌ పేవంటి కంపెనీలు ప్రచార కార్యక్రమాలకు, క్యాష్‌ బ్యాక్ లకు పెద్ద ఎత్తున ఖర్చు చేయడాన్ని కొనసాగించాల్సిఉంటుందని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు.

Best Mobiles in India

English summary
Walmart invests Rs 763 crore in PhonePe to compete with Amazon

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X