అమెజాన్‌‍కి పొటీగా ఇండియాలో వాల్‌మార్ట్ ఇన్నవేషన్ ల్యాబ్

Posted By: Staff

అమెజాన్‌‍కి పొటీగా ఇండియాలో వాల్‌మార్ట్  ఇన్నవేషన్ ల్యాబ్

భారత అభిమానులకు ఆన్‌లైన్ షాపింగ్ ఎక్స్ పీరియన్స్‌ని కలిగించడం కొసం ప్రఖ్యాత 'వాల్‌మార్ట్' సంస్ద ఇండియాలో 'ఇన్నవేషన్ లాబ్'ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతం ఇండియాలో అమెజాన్ సంస్ద ఆన్ లైన్ రంగంలో దూసుకుపొతుండడంతో దానికి పొటీని తట్టుకునేందుకు గాను వాల్ మార్ట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రముఖ దినపత్రిక ప్రచురించారు.

ఈ సందర్బంగా వాల్ మార్ట్ గ్లోబల్ ఈ కామర్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ రాజరామన్ మాట్లాడుతూ ఇండియాలోని బెంగుళూరులో ఆఫీసు పెట్టాలని నిర్ణయించుకొవడమే కాకుండా వంద మంది బెస్ట్ ఇంజనీర్స్‌ని ఎంపిక చేసుకొవడం జరిగిందని తెలిపారు. మేము ప్రారంభించనున్న ఈ ఆఫీసు ద్వారా నిర్వహించే కార్యకలాపాలు అమెజాన్, గూగుల్, యాహు లాంటి కంపెనీలకు పొటీగా ఉంటుందని అన్నారు.

రాజరామన్ వాల్ మార్క్ గ్రూప్ కంపెనీలో ఏప్రిల్‌లో చేరడం జరిగింది. ఇండియాలో ఆన్‌లైన్ రంగంలో అమెజాన్ కంపెనీ ఎలాంటి పాత్రనైతే పోషిస్తుందో, అలాంటి పాత్రనే వాల్ మార్ట్ పోషించనుంది. వాల్ మార్ట్ ఈ కామర్స్ ప్లాట్ ఫామ్‌ని డెవలప్ చేయడం కొసం కొత్త కొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టనున్నారు. అంతేకాకుండా మేము ప్రత్యేకంగా సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా(బెంగుళూరు)ని ఎంచుకొవడం అభినందనీయం.

ఇండియాలో ఉన్న కస్టమర్స్ ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్‌ని మొబైల్ ద్వారా పొందాలనేది తమ నిర్ణయంగా తెలిపారు. ఇండియాలో ఆఫీసుని ప్రారంభించడం వెనుక, ఇండియాలో రిటైల్ ఆపరేషన్స్‌ని ఏమైనా ప్రారంభిస్తారనే విషయాన్ని మాత్రం తెలియజేయలేదు. ఇక అమెజాన్ విషయానికి వస్తే వచ్చే సంవత్సరం నుండి ఇండియన్ కస్టమర్స్ కొసం తమ సర్వీసులను ప్రారంభించనుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot