కొత్త సిమ్ కార్డ్ కనెక్షన్‌కు ఆధార్ నెంబర్ అవసరం లేదు

|

కొత్తగా సిమ్ కార్డ్ లేదా మొబైల్ కనెక్షన్‌ను ఇష్యూ చేసే సమయంలో పౌరుల నుంచి ప్రూఫ్స్ క్రింద ఆధార్ నెంబర్లను తీసుకోవటమనేది ఇకపై తప్పనిసరికాదంటూ సుప్రీంకోర్డు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో టెలికం ఆపరేటర్లకు సరికొత్త నిబంధనలను భారత టెలికం శాఖ జారీ చేసింది. ఈ నిబంధనల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టెలికం సంస్థలు కొత్త సిమ్ కార్డ్ రిజిస్ట్రేషన్ నిమిత్తం వర్చువల్ ఐడీ (ఆధార్ ఈ-కెవైసీ సర్వీస్) ఇంకా లిమిటెడ్ కేవైసీ ప్రాసెస్‌లను ఎనేబల్ చేసుకోవాలని సూచించింది. రీ-వెరిఫికేషన్‌కు కూడా ఇదే విధమైన ప్రాసెస్ వర్తిస్తుందని డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికం వెల్లడించింది.

 

రూ.10 వేల కేటగిరిలో బెస్ట్ డ్యూయెల్ సెల్ఫీ కెమెరా స్మార్ట్‌ఫోన్రూ.10 వేల కేటగిరిలో బెస్ట్ డ్యూయెల్ సెల్ఫీ కెమెరా స్మార్ట్‌ఫోన్

కొత్త నింబధనల ప్రకారం...

కొత్త నింబధనల ప్రకారం...

డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికం జారీ చేసిన కొత్త నింబధనల ప్రకారం ఆయా టెలికం ఆపరేటర్లు తమ తమ యూజర్లకు సంబంధించిన వర్చువల్ ఐడీలను జూలై 1లోగా ఏర్పాటు చేసుకోవల్సి ఉంటుంది. వర్చువల్ ఐడీ ఇంకా లిమిటెడ్ ఈ-కేవైసీ అనేవి ఆధార్ ఇకో‌సిస్టమ్‌లో భాగంగా పనిచేస్తాయి. మొబైల్ చందాదారులు ఈ ప్రాసెస్ క్రిందకు రావటం వల్ల వారివారి ఆధార్ నెంబర్లు భద్రంగా ఉంటాయి. వాటిని ఇతరులు చూడటం కుదరదు. ఇక పై కొత్త సిమ్ కార్డ్ కనెక్షన్‌ను తీసుకునే సమయంలో మీ ఆధార్ నెంబర్‌ను షేర్ చేయకుండా వర్చువల్ ఐడీని ఆప్ట్ చేసుకుంటే సరిపోతుంది.

వర్చువల్ ఐడీ, లిమిటెడ్ ఈ-కేవైసీ అంటే ఏంటి..?

వర్చువల్ ఐడీ, లిమిటెడ్ ఈ-కేవైసీ అంటే ఏంటి..?

వర్చువల్ ఐడీ అనేది 16 డిజిట్లతో కూడిన ర్యాండమ్ నెంబర్. ఈ నెంబర్‌ను UIDAI అసైన్ చేస్తుంది. ఈ యూఆర్ఎల్ (https://resident.uidai.gov.in/web/resident/vidgeneration)లోకి వెళ్లటం మీ ఆధార్‌కు సంబంధించిన వర్చువల్ ఐడీని జనరేట్ చేసుకోవచ్చు. వర్చువల్ ఐడీ జనరేట్ అయ్యే సమయంలో మీ ఆధార్ నెంబర్ ఓటీపీ వెరిఫికేషన్‌తో సింక్ అవ్వాల్సి ఉంటుంది.

అవసరమైన సమచారాన్ని మాత్రమే షేర్ చేస్తుంది...
 

అవసరమైన సమచారాన్ని మాత్రమే షేర్ చేస్తుంది...

ఒకవేళ మీ మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్‌తో సింక్ అవనట్లయితే సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి మీ మొబైల్ నెంబర్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. ఈ వర్చువల్ ఐడీ అనేది మీ ఆధార్ నెంబర్‌కు టెలికం ఆపరేటర్‌కు మధ్య ఫిల్టర్‌లా పనిచేస్తుంది. వారికి అవసరమయ్యే సమాచారాన్ని మాత్రమే ఈ వ్యవస్థ షేర్ చేస్తుంది.

లిమిటడ్ ఈ-కేవైసీ అనేది ప్రత్యేకమైన ప్రాసెస్..

లిమిటడ్ ఈ-కేవైసీ అనేది ప్రత్యేకమైన ప్రాసెస్..

ఇక లిమిటడ్ ఈ-కేవైసీ విషయానికి వచ్చేసరికి ఇది ఒక ప్రత్యేకమైన ప్రాసెస్. ఈ ప్రాసెస్ ద్వారా కొత్త సిమ్‌ను ఇష్యూ చేసే సమయంలో టెలికమ్ ఆపరేటర్ ఈ-కేవైసీ ద్వారా మీ పేరు ఇంకా అడ్రస్‌ను మాత్రమే తీసుకోగలుగుతారు. ఈ పేపర్ లెస్ ప్రాసీజర్ సెకన్ల వ్యవధిలో పూర్తవుతుంది. ఇక పై కొత్త సిమ్ కార్డులను తీసుకునే సమయంలో యూజర్లు ప్రూఫ్ ఆఫ్ వెరిఫికేషన్ తమ ఆధార్ కార్డులకు బదులుగా వర్చువల్ ఐడీని ప్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది.

కొత్త నిబంధన

కొత్త నిబంధన

కొత్త నిబంధన మరింత ప్రయోజనకరంగా..తమ ఆధార్ డేటా గల్లంతవుతోందని భయపడుతోన్న వారికి ఈ కొత్త నిబంధన మరింత ప్రయోజనకరంగా మారిపోతోంది. ఈ వర్చువల్ ఐడీ ద్వారా యూజర్ ఆధార్ నెంబర్ ను ట్రాక్ చేయటమనేది ఎంత మాత్రం సాధ్యపడదు. యూజర్ కు కేటాయించే వర్చువల్ ఐడీ 24 గంటలు మాత్రమే పనిచేస్తుంది. 24 గంటలు దాటిన తరువాత కొత్త వర్చువల్ ఐడీ జనరేట్ అవుతుంది.

Best Mobiles in India

English summary
Telecommunications (DoT) has notified to all telecom operators across the country to enable Virtual ID (Aadhaar e-KYC service) and limited KYC processes for new SIM card registration.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X