ఆషామాషీ రోబోలు కాదండోయ్...!

Posted By: Prashanth

ఆషామాషీ రోబోలు కాదండోయ్...!

 

మీ ఇంట్లో ఆడవారికి రోజు రోజుకు శారీరక శ్రమ ఎక్కువవుతుందా..?, వారికి మీరు ఏ విధంగా సహాయ పడలేపోతున్నారా..?, గృహిణిలు శ్రమ భారాన్ని కాస్తలో కాస్తంతైనా తగ్గించేందుకు జపాన్ సంస్థ షార్ప్ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. సాంకేతికత సాయంతో ఇంటిని శుభ్రపరిచే రోబోట్ వాక్యూమ్ క్లీనర్‌ ఈ సంస్థ వృద్థి చేసింది. ఈ వాక్యూమ్ క్లీనర్ పేరు కోకోరోబో(Cocorobo).ఇంగ్లీష్, చైనీస్, జపనీస్ భాషలను ఈ డివైజ్ మాట్లాడగలదు. ఐఫోన్ ఆధారితంగా ఈ క్లీనర్‌ను ఆపరేట్ చేసుకోవచ్చు. ఇందుకు గాను, క్లీనర్‌లో నిక్షిప్తం చేసిన కోకోరోబో అప్లికేషన్‌ను ఐఫోన్‌కు అనుసంధానం చేసుకోవల్సి ఉంటుంది. ఈ సౌలభ్యతతో క్లీనర్ పనితీరును ప్రత్యక్షంగా తిలకించవచ్చు. రోబోలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన ఇన్‌ఫ్రా రెడ్ సెన్సార్స్ క్లీనింగ్ సమయంలో ఇంట్లోని వస్తువులకు ఏ విధమైన హానిని కలగకకుండా జాగ్రత్తవహిస్తాయి.

ఖైదీలను పర్యవేక్షించే ‘ప్రిజన్ గార్డ్ రోబోట్’!

జైలు నుంచి కరుడు గట్టిన ఖైదీ పరార్.., అధికారుల తీరు పై అనుమానాలు.. తరచూ మీడియాలో వినిపిస్తున్న కథనాలు ఇవే. జైళ్ల బధ్రతను సాంకేతికత సాయంతో మరింత కట్టుదిట్టం చేస్తూ సరికొత్త యాంత్రిక వ్యవస్థను నిపుణులు సృష్టించారు. ఖైదీల కదిలకలను అనునిత్యం మానిటర్ చేసే యాంత్రిక రోబోలను వీరు రూపొందించారు. ఈ మరమనిషిలో నిక్షిప్తం చైసిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇంకా ఇన్-బుల్ట్ 3డి కెమెరా వ్యవస్థ కారాగార ప్రాంగణాన్ని అనువనువునా జల్లెడ పడుతుంది. దక్షిణకొరియాలోని పొహాంగ్‌లో ఈ రోబోట్ సేవలను పరీక్షిస్తున్నారు. ఆసియన్ ఫోరమ్ ఆప్ కరెక్సన్స్, మ్యానుఫాక్షర్ ఎస్ఎమ్ఈఎస్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ 5 అడుగుల రోబోట్‌ను రూపొందించారు. 3డి కెమెరా, వైర్‌లెస్ టెక్నాలజీ, హ్యూమన్ బిహేవియర్, ఎమోషన్ ట్రాకింగ్ టెక్నాలజీ వంటి పరిజ్ఞానాన్ని ఈ మర యంత్రంలో అమర్చారు. ఈ పరిశోధన విజయవంతమైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని కారాగారలు, నిర్బంధ కేంద్రాల్లో వీటిని నెలకొల్పనున్నారు. మన దేశంలో ఈ విధానాన్ని ఆచరణలోకి తెస్తే జైళ్లలో చాటుమాటుగా సాగుతున్న ఆసాంఘీక కార్యక్రమాలను నిర్మూలించవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot