ఎవరితోనైనా ‘రహస్యంగా’ మాట్లాడాలనుకుంటున్నారా!!! ఈ యాప్ ల గురించి తెలుసుకొండి
ప్రపంచం మొత్తం అభివృద్ధి పథంలో పయనిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరిని మీ వాట్సాప్ లేదా ఫేస్‌బుక్ అకౌంటుకు జోడించడం మంచిది కాదు అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. మీ యొక్క పర్సనల్ ఫోన్ నంబర్‌ను ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం చేయలేని సందర్భాలు చాలానే ఉంటాయి. మీ ఫోన్ నంబర్‌తో ఆధార్, బ్యాంక్ అకౌంట్, ఆదాయపు పన్ను, చాటింగ్ యాప్ లు, కారు రిజిస్ట్రేషన్ వంటి మీ మొత్తం జీవితంలోని చాలా విషయాలు కనెక్ట్ చేయబడి ఉండవచ్చు. ప్రపంచ అభివృద్ధిలో స్కామర్లు కూడా కొత్తగా అలోచిస్తున్నారు ఈ మార్పును 2020లో ప్రత్యేకంగా హైలైట్ చేసింది. స్కామర్లు ఇప్పుడు వినూత్న పద్దతిలోని మోసాలను ఎంచుకుంటున్నారు. మీ ఫోన్ నంబర్‌ను బహిర్గతం చేయకుండా చాట్ చేయడానికి మిమ్మల్ని అనుమతించే చాటింగ్ యాప్ ల గురించి మరిన్ని వివరాల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వైర్ సెక్యూర్ మెసేజింగ్ యాప్
మీ యొక్క ఫోన్ నంబర్‌ను బహిర్గతం చేయకుండా ఎవరితోనైనా రహస్యంగా మాట్లాడటానికి వైర్ సెక్యూర్ మెసేజింగ్ యాప్ సరైన వేదికగా ఉంది. మీ యొక్క డెస్క్‌టాప్ లేదా లాప్ టాప్ లో "https://app.wire.com/" ను ఓపెన్ చేసి మీ యొక్క ఇమెయిల్ ఐడిని ఉపయోగించి నమోదు చేసుకొని ప్రొఫైల్ ఐడిని సులభంగా సృష్టించవచ్చు. తరువాత మీ ఫోన్‌లో ఈ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకొని నమోదిత ఇమెయిల్ ఐడితో సైన్-ఇన్ చేసుకోవచ్చు. వైర్ అనేది ట్విట్టర్ వలె ఉంటుంది కావున మీ ప్రొఫైల్ ఐడిలతో ఇతర వ్యక్తులను జోడించవచ్చు మరియు చాట్ చేయవచ్చు. దీని కోసం మీ యొక్క ఫోన్ నంబర్ అవసరం లేదు.

టెలిగ్రామ్ ద్వారా ప్రైవేటుగా చాట్ చేయడం
టెలిగ్రామ్ యాప్ లో మీ యొక్క ఫోన్ నంబర్‌ను భాగస్వామ్యం చేయకుండా ఇతరులతో ప్రైవేట్‌గా చాట్ చేయడానికి అనుమతిస్తుంది. ఇందులో మీరు మీ ఫోన్ నంబర్ మరియు ప్రొఫైల్ ఫోటోను బహిర్గతం చేయకుండా ప్రైవేటుగా చాట్ చేయడానికి మీ ప్రొఫైల్ ఐడిని సెటప్ చేయవచ్చు. సెట్టింగులలోని కొన్ని ఎంపికలతో మీ ఫోన్ నంబర్‌ను సులభంగా దాచవచ్చు. కానీ టెలిగ్రామ్ ను ప్రారంభించడానికి సెటప్ కోసం మీ ఫోన్ నంబర్ అవసరమని గుర్తుంచుకోండి.

Discord యాప్: ఎటువంటి వ్యక్తిగత వివరాలు అవసరం లేదు
డిస్కోర్డ్ యాప్ లో మిమ్మల్ని మీరు నమోదు చేసుకోవడానికి లేదా ఉపయోగించటానికి ఎటువంటి వ్యక్తిగత డేటా అవసరం లేదు. ఇందులో ప్రొఫైల్‌ను సృష్టించడానికి మరియు ఇతరుల ID లతో వ్యక్తులను జోడించడానికి ఫోన్ నంబర్ అవసరం లేదు.

Skype యాప్ లో ఎవరితోనైనా రహస్యంగా మాట్లాడటం
Skype యాప్ అనేది పాతది అయినప్పటికీ ఇందులో ID ఉన్నవారితో మాట్లాడటానికి, చాట్ చేయడానికి మరియు వీడియో కాల్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇందులో ID క్రీయేట్ చేయడానికి ఫోన్ నెంబర్ అవసరం లేదు. కానీ బాగా పాపులర్ అయిన స్కైప్ యాప్ ద్వారా ఏదైనా సున్నితమైన సమాచారాన్ని మరొకరితో భాగస్వామ్యం చేయడానికి దీనిని ఉపయోగించకపోవడమే మంచిది.


Click it and Unblock the Notifications








