ఇతర నెట్‌వర్క్‌ల నుంచి jio 4gకి పోర్ట్ అవుతున్నారా?

ఇంటర్‌కనెక్టువిటీ పాయింట్ల విషయంలో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌ల మధ్య నెలకున్న వివాదం రోజుకో మలుపు తీసుకుంటోంది. నిన్నటి వరకు ఇంటర్ కనెక్టివిటీ విషయంలో మాటల యుద్ధానికి తెరలేపిన ఈ కంపెనీలు, తాజాగా మొబైల్ నెంబర్ పోర్టబులిటీ విషయంలో కొట్లాడుకుంటున్నాయి.

ఇతర నెట్‌వర్క్‌ల నుంచి jio 4gకి పోర్ట్ అవుతున్నారా?

Read More : ఈ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుంటే, మీ ఫోన్‌లో రోజుంతా ఉచిత ఇంటర్నెట్

మొబైల్ నెంబర్‌ పోర్టబులిటీ కింద ఎయిర్‌టెల్‌ నుంచి రిలయన్స్‌ జియో నెట్‌వర్క్‌కు మారే ఖాతాదారులనూ ఎయిర్‌టెల్‌ ఇబ్బంది పెడుతోందని రిలయన్స్ జియో ఆరోపించింది. అయితే, జియో తాజా ఆరోపణలను ఎయిర్‌టెల్ ఖండించింది. అదనపు ఇంటర్‌కనెక్టువిటీ పాయింట్ల విషయంలో జియో కావాలనే రాద్ధాంతం చేస్తోందని, మొబైల్ నెంబర్‌ పోర్టబిలిటీ విజ్ఞప్తులను తాము అడ్డుకుంటున్నట్లు చేస్తున్న ఆరోపణల్లోనూ వాస్తవం లేదని స్పష్టం చేసింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ట్రాయ్‌కు జియో ఫిర్యాదు

టెలికం కంపెనీలు తమకు తగిన ఇంటర్‌కనెక్టింగ్ పాయింట్లను కల్పించకపోవడంవల్ల భారీగా కాల్‌డ్రాప్‌లకు కారణమవుతున్నాయని దీనిపై చర్యలు తీసుకోవాలంటూ టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్‌కు జియో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

రంగంలోకి ట్రాయ్

దీంతో ఇరువర్గాల మధ్య ట్రాయ్ ఏర్పాటు చేసిన భేటి అనంతరం జియోకు అవసరమైన పీఓఐలు కల్పించేందుకు ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులార్, వొడాఫోన్, బీఎస్‌ఎన్‌ఎల్‌లు సుముఖత వ్యక్తం చేసాయి.

ఎంఎన్‌పీ ప్రక్రియ మొదలైంది!

ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులార్, వొడాఫోన్, బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్ల నుంచి వస్తోన్న ఎంఎన్‌పీ రిక్వస్ట్‌లను జియో 4జీ ఇప్పటికే స్వీకరిస్తోంది. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి జియో 4జీకి పోర్ట్ అవ్వాలనుకుంటన్న వ్యక్తులు గుర్తుపెట్టుకోవల్సిన ముఖ్యమైన విషయాలు.

జియో 4జీకి పోర్ట్ అయ్యే ముందు

3జీ సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లో సైతం జియో 4జీ అందుబాటులో ఉన్నప్పటికి నెట్‌వర్క్ కవరేజ్ విషయంలో ఇంకా విస్తరణ జరగాల్సి ఉంది. జియో సేవలు కొన్ని ప్రాంతాల్లో ఇఫ్పటికి ప్రశ్నార్థకంగానే మారాయి. కాబట్టి జియో 4జీకి పోర్ట్ అయ్యే ముందు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోండి. ముందు మీ ప్రాంతంలో జియో నెట్‌వర్క్ కవరేజ్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. ఆ తరువాతే ఎంఎన్‌పీకి సిద్ధమవ్వండి.

మీరు వాడే ఫోన్ తప్పనిసరిగా

ఎంఎన్‌పీ ద్వారా జియో 4జీకి మారిన పక్షంలో మీరు వాడే ఫోన్ తప్పనిసరిగా 4G VoLTE సదుపాయాన్ని కలిగి ఉండాలి. మీరు 3జీ లేదా 2జీ ఫోన్‌ను వాడుతున్నట్లయితే పూర్తిస్థాయి జియో సేవలను ఆస్వాదించలేరు.

ఎంఎన్‌పీ తరువాత

డిసెంబర్ 31, 2016 వరకు మీకు వర్తించే జియో వెల్‌కమ్ ఆఫర్ పూర్తిస్థాయిల్ అన్‌లిమిటెడ్ కాదు. ఈ ఆఫర్‌లో భాగంగా రోజుకు మీరు కేవలం 4జీబి డేటాను మాత్రమే వాడుకోగలుగుతారు. లిమిట్ దాటిన తరువాత వేగం 128 kbpsకు పడిపోతుంది.

 

సిమ్ యాక్టివేషన్ అవ్వాలంటే

జియో 4జీ సిమ్‌లకు దేశవ్యాప్తంగా ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడటంతో సిమ్ యాక్టివేషన్ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. eKYC activation ప్రక్రియ అన్ని చోట్లా అందుబాటులోకి రాకపోవటంతో సిమ్ యాక్టివేషన్ అవటానికి కనీసం

10 రోజులైనా సమయం తీసుకుంటుంది.

 

జియో ఆఫర్ చేస్తున్న స్పీ

రిలయన్స్ జియో ఆఫర్ చేస్తున్న స్పీడ్‌ ఒక్కోసారి అమాంతం డ్రాప్ అయిపోతుందని పలువురు యూజర్లు ఆరోపిస్తున్నారు.

నైట్ డేటా అర్ధరాత్రి 2 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రమే

డిసెంబర్ 31, 2016 తరువాత రిలయన్స్ జియో ఆఫర్ చేసే అన్‌లిమిటెడ్ నైట్ డేటా అర్ధరాత్రి 2 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇదే సమయంలో ఇతర టెలికం ఆపరేటర్లు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటలకు నైట్ డేటాను ఆఫర్ చేస్తున్నాయి.

VoLTE సపోర్ట్‌ అందుబాటులోలేని ఫోన్‌లలో

VoLTE సపోర్ట్‌ అందుబాటులోలేని 4జీ ఎల్టీఈ ఫోన్‌లలో నేరుగా జియో వాయిస్ కాల్స్ చేసుకోవటం సాధ్యం కాదు. జియో4జీవాయిస్ యాప్ ద్వారా మాత్రమే వాయిస్ కాల్స్ చేసుకోవల్సి ఉంటుంది.

ఏదో ఒక టారిఫ్ ప్లాన్‌ తప్పనిసరి

రిలయన్స్ జియో ఫోన్‌లలో మీరు వాయిస్ కాల్స్ చేసుకోవాలంటే ఏదో ఒక టారిఫ్ ప్లాన్‌ను తప్పనిసరిగా మీ డివైస్‌లో యాక్టివేట్ చేయించాల్సి ఉంటుంది. ఇలా చేయించని పక్షంలో వాయిస్ కాల్స్ చేసుకునే వీలుండదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
War on Mobile Number Portability heats up. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot