మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీసుల పై వీరంగం...వైరల్ అయిన వీడియో

|

నడిరోడ్డులో ఒక తాగుబోతు రెచ్చిపోయాడు .హెల్మెట్ ఎక్కడ అని ప్రశ్నించన పోలీసులనే చితకబాదాడు . విచక్షణారహితంగా కొట్టడంతో ఓ ట్రాఫిక్‌ పోలీసు తలలోంచి రక్తం కారింది.ఈ ఘటన బుధవారం (అక్టోబర్ 10) మధ్యాహ్నం 12 గంటల సమయంలో కర్ణాటకలోని దావణగెరె ప్రాంతంలో చోటుచుసుకుంది.

ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు....
 

ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు....

దావణగెరెలో ఓ ప్రాంతంలో ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తున్న వాహనదారులకు చలానాలు వేస్తున్నారు. అదే సమయంలో ఆ మార్గం ద్వారా రుద్రేశ్‌ అనే వ్యక్తి తన బైక్‌పై వచ్చాడు. అతణ్ని పోలీసులు అడ్డుకున్నారు. అతడు మద్యం తాగి వాహనం నడుపుతున్నట్లు గుర్తించారు.

రుద్రేశ్‌ వాహనాన్ని నిలిపేసి అతడిపై చలానా విధించారు....

రుద్రేశ్‌ వాహనాన్ని నిలిపేసి అతడిపై చలానా విధించారు....

రుద్రేశ్‌ వాహనాన్ని నిలిపేసి అతడిపై చలానా విధించారు ట్రాఫిక్ పోలీసులు. దీంతో అతడికి ఆగ్రహంతో ఊగిపోయాడు . ఆ ఇద్దరు ట్రాఫిక్‌ పోలీసులపై విరుచుకుపడ్డాడు. రోడ్డు పక్కన ఉన్న ఓ మట్టి పాత్రతో ఓ పోలీసు తలపై బలంగా కొట్టడంతో ఆయన తలకు దెబ్బ తగిలి రక్తం కారింది.

మరో పోలీసును కిందపడేసి కొట్టాడు...

మరో పోలీసును కిందపడేసి కొట్టాడు...

అనంతరం మరో పోలీసు వద్దకు పరుగెత్తుకెళ్లిన రుద్రేశ్‌ ఆయణ్ని కిందపడేసి కొట్టాడు. మద్యం మత్తులో తుళ్లిపడిపోతూ లేచి మరీ పోలీసులపై దాడి చేశాడు. దాడిలో తలకు గాయాలైన పోలీసు కానిస్టేబుల్ నారాయణ రాజును ఆస్పత్రికి తరలించి చికిత్స తీసుకున్నారు.

అరెస్టు చేసి కేసు నమోదు చేశారు....

అరెస్టు చేసి కేసు నమోదు చేశారు....

ఎట్టకేలకు పోలీసులు రుద్రేశ్‌ను పట్టుకున్నారు. అతణ్ని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
WATCH! Drunk man assaults traffic cops who stopped him for not wearing a helmet.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X