రాయల్ వెడ్డింగ్‌కి అన్ని ఏర్పాట్లు సిద్దం, యూట్యూబ్‌లో లైవ్‌

Posted By: Super

రాయల్ వెడ్డింగ్‌కి అన్ని ఏర్పాట్లు సిద్దం, యూట్యూబ్‌లో లైవ్‌

ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రాయల్ వెడ్డింగ్ రానే వచ్చింది. ఆ మధుర క్షణాలను లైవ్‌లో చూడాలని చాలా మంది ఊవిళ్శుఊరుతుంటారు. కానీ చాలా మంది ఆఫీసులోనే లేక టివికి అందుబాటులో లేకపోవడమే జరుగుతుంది. అలాంటి వారు ఇప్పుడు భాద పడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆ మధుర క్షణాలను ఇప్పుడు యూట్యూబ్ లైవ్‌లో ఉంచబోతుంది.

టెక్నాలజీ గెయింట్ అయిన గూగుల్ తనయొక్క వీడియో షేరింగ్ వెబ్ సైట్ అయినటువంటి యూట్యూబ్‌లో ఈ కార్యక్రమాన్ని లైవ్‌లో అందించనుంది. యూట్యూబ్ ఎకౌంట్ ద్వారా రాయల్ వెడ్డింగ్‌ని ఫ్రీగా చూడోచ్చు రాయల్ ఛానల్ యూట్యాబ్ ఎకౌంట్ ద్వారా. మీరు గనుక రాయల్ వెడ్డింగ్‌ని లైవ్‌గా చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి

ప్రిన్స్ విలియమ్, మిస్ మిల్టన్‌ల వివాహాం లైవ్ ప్రోగ్రామ్‌ని సిఎన్‌ఎన్.కామ్, ఈ ఆన్‌లైన్ సమర్పించున్నాయి. ఇక సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్‌లు అయినటువంటి ఫేస్ బుక్, ట్విట్టర్‌లు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించడానికి సిధ్దంగా ఉన్నాయి. ఇక బిబిసి టెలివిజన్ ఐతే రాయల్ వెడ్డింగ్ కోసం డెడికేటెడ్ వెడ్డింగ్ సైట్‌ని ఫ్రారంభించి వెడ్డింగ్ ప్రాసెస్ నుండి వెస్ట్ మినిస్టర్ అబ్బీ సెరమనీ వరకు ప్రపంచం మొత్తం టెలికాస్ట్ చేయనుంది.

లండన్‌లో ఉన్నటువంటి మిగతా టివి ఛానల్స్ కూడా రాయల్ వెడ్డింగ్ గురించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు కామెంటరీ ద్వారా అందించనున్నాయి. రాయల్ వెడ్డింగ్ ని ప్రపంచం మొత్తం మీద 2బిలియన్ జనాభా లైవ్ టివి ద్వారా, మిగతా 400మిలియన్ జనాభా ఆన్ లైన్‌లో చూడనున్నారని అంచనా. ఏది ఐతేనేం ప్రిన్స్ త్వరలో ఓ ఇంటివారు కాబోతున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot