మతిపోగొడుతున్న స్నానపు వీడియో!

Posted By: Prashanth

మతిపోగొడుతున్న స్నానపు వీడియో!

 

స్నానపు వీడియో ఏంట్రాబాబో అని ఏదేదో ఊహించుకంటున్నారా..?, ఐఫోన్ కు స్నానం చెయ్యించటం ఎప్పుడైనా చూశారా..?, అసలు నీటిలో తడిస్తే ఐఫోన్ పని చేస్తుందా..?

Read In English

తడి వాతావరణంలో సాంకేతిక పరికరాలు ఇట్టే మన్నికను కొల్పోతాయన్న విషయం మనందరికి తెలుసు. ఈ సమస్యను అధిగమించేందకు లిక్విపెల్ సంస్థ సరికొత్త వాటర్‌ప్రూఫ్ టెక్నాలజీతో ముందుకొచ్చింది. ఇక పై స్నానం చేస్తున్న సందర్భంలోనూ నిశ్చితంగా స్మార్ట్‌ఫోన్‌‌ను ఆపరేట్ చేస్తూ కమ్యూనికేషన్ సంభాషణలను సాగించవచ్చు. ఈ టెక్నాలజీ వెసలబాటుతో మొబైల్, స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ పీసీలను తేమ వాతవరణం నుంచి పరిరక్షించుకోవచ్చు. ఈ ప్రక్రియలో భాగంగా తేమ వతావరణాన్ని సమర్థవంతంగా తట్టుకోగల వాటర్‌ప్రూఫ్ పొరను గ్యాడ్జెట్ అంతర్గత మరియు బాహ్య ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తారు. తద్వారా మీ డివైజ్ నీటిని సమర్థవంతంగా ఎదుర్కొగల శక్తిని సంతరించుకుంటుంది. వాటర్‌ప్రూఫ్ పొర ఏర్పాటు వల్ల డివైజ్‌కు ఏ విధమైన ఇబ్బంది వాటిల్లదు. నెట్‌వర్క్, బ్యాటరీ ఛార్జింగ్ వంటి అంశాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. తమ తమ డివైజ్‌లకు ఈ వాటర్‌ప్రూఫ్ కోటింగ్ కావాలనుకునే వారు లిక్విపెల్ కేంద్రానికి సంబంధిత డివైజ్‌ను పంపించాల్సి ఉంటుంది. ధర రూ.3,500. వాటర్‌ప్రూఫ్ కోటింగ్ పటిష్టతను రజువు చేసే వీడియో మీ కోసం...

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot