మీ లాప్‌టాప్ బ్యాటరీ బ్యాకప్ పెరగాలంటే..?

Posted By: Super

మీ లాప్‌టాప్ బ్యాటరీ బ్యాకప్ పెరగాలంటే..?

దేశీయంగా ల్యాప్‌టాప్‌ల వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది. పలు కంపెనీల ప్రాథమిక స్థాయి ఫీచర్లతో కూడిన ల్యాప్‌టాప్‌లను రూ.20 వేల ధరల్లోనే విక్రయిస్తున్నాయి. అయితే ల్యాప్‌టాప్ యూజర్లను ప్రధానంగా బ్యాటరీ బ్యాకప్ సమస్య వేధిస్తుంటోంది. మార్కెట్లో లభ్యమవుతున్న అధిక ముగింపు ల్యాపీలు సైతం 5 గంటలకు మించి బ్యాకప్‌ను అందిచలేవు. ల్యాపీ పై వర్క్ చేస్తున్న సమయంలో కనీస జాగ్రత్తలు పాటిస్తే బ్యాకప్‌ను కొంత వరకు పెంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పలు చిట్కాలు వారి మాటల్లోనే...

- ల్యాపీ బ్యాటరీ పవర్ పై నడుస్తున్న సమయంలో అవసరమైన అప్లికేషన్‌లు మాత్రమే రన్ చేసుకోవాలి.

- స్ర్రీన్ వెలుతురు స్థాయిని తగ్గించుకోవటం మంచిది.

- ల్యాపీ అడుగుభాగంలో వేడి బయటకు పోయేందుకు ఏర్పాటు చేసిన రంధ్రాలను మూసి ఉంచ కూడదు.

- 3డి గేమ్స్, సీడీ డ్రైవ్ ద్వారా సినిమాలు చూడకూడదు. సౌండ్స్ ఆఫ్ చెయ్యాలి. మల్టీ మీడియా అప్లికేషన్స్ క్లోజ్ చెయ్యాలి. ఈ విధమైన చర్యలు బ్యాటరీ బ్యాకప్‌ను వేగంగా హరించి వేస్తాయి.

- యూఎస్బీ పోర్ట్‌లకు కనెక్ట్ చేసి ఉన్న ఇతర డివైజ్‌లను వేరు చేయటం మంచిది.

- సూర్యకాంతి నేరుగా ల్యాపీ పై పడకూడదు. వైర్‌లెస్ లాన్, బ్లూటూత్ వంటి అదనపు కనెక్టువిటీ ఫీచర్లను ఈ సమయంలో డిసేబుల్ చేయటం ఉత్తమం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot