Home
News

ప్రపంచాన్ని కలరపెడుతున్న వ్యర్థాలు, ఎంతలా అంటే..?

ప్రపంచాన్ని ఇప్పుడు ఇ-వ్యర్థాలు కలవరపెడుతున్నాయి. చేతిలో స్మార్ట్‌ఫోన్‌.. ఇంట్లో టీవీలు, వాషింగ్‌ మెషిన్‌లు, ఫ్రిజ్‌లు.. ఆఫీసుల్లో ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు..

ప్రపంచాన్ని ఇప్పుడు ఇ-వ్యర్థాలు కలవరపెడుతున్నాయి. చేతిలో స్మార్ట్‌ఫోన్‌.. ఇంట్లో టీవీలు, వాషింగ్‌ మెషిన్‌లు, ఫ్రిజ్‌లు.. ఆఫీసుల్లో ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు.. ఇవే కాక బయట మరో సవాలక్ష ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఇవన్నీ కాలం తీరిన తరువాత వ్యర్థాలుగా మారి ప్రజలను భయానికి గురిచేస్తున్నాయి. ఏటా కాలం తీరిన ఎలక్ట్రానిక్‌ పరికరాలను వందల టన్నుల్లో పడేయడం వల్ల ఇ-వ్యర్థాలు గుట్టలా పేరుకుపోతున్నాయి. ఇలా నిరుపయోగంగా మారిన ఇ-వేస్ట్‌తో సంవత్సరానికి దాదాపు 4,500 ఈఫిల్‌ టవర్లను నిర్మించవచ‍్చని నిపుణులు చెబుతున్నారు.ఇలా పోగుపడిన ఇ - వేస్ట్‌ బరువు ఏకంగా 1,25,000 బోయింగ్‌ 747 జంబో జెట్ల బరువుకు సమానమనే షాకింగ్ న్యూస్ చెబుతున్నారు.

ఇ-వ్యర్థాల గురించి

ఇ-వ్యర్థాల గురించి

దావోస్‌ వేదికగా నిర్వహించిన ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సదస్సులో ఈ నివేదికను వెల్లడించారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన డబ్ల్యూఈఎఫ్‌ వార్షిక సదస్సులో ఈ ఇ-వ్యర్థాల గురించి చర్చించారు. పెరిగిపోతున్న ఇ-వేస్ట్‌ను తగ్గించేందుకు తీసుకునే చర్యలే కాక.. సులభంగా రీసైకిల్‌ చేసి రీయూజ్‌ చేసే మార్గాల గురించి పరిశోధనలు పెంచాలని నిర్ణయించారు.

2.87 బిలియన్లకు

2.87 బిలియన్లకు

2017 నాటికి ప్రపంచవ్యాప్తంగా 1.46 బిలియన్ల స్మార్ట్‌ఫోన్‌లు ఉంటే.. 2020నాటికి స్మార్ట్‌ఫోన్లు వినియోగించే వారి సంఖ్య 2.87 బిలియన్లకు చేరనుందట. ఇంతమందికి మొబైల్‌ ఫోన్‌ సౌకర్యాలు కల్పించాలంటే సెల్‌ టవర్ల సంఖ్య కూడా పెంచాలి. అంటే నెట్‌వర్కింగ్‌ పరికరాలను కూడా పెంచాలి.

వాడే ప్రతి ఎలక్ట్రాననిక్‌ పరికరం

వాడే ప్రతి ఎలక్ట్రాననిక్‌ పరికరం

అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఎంత టెక్నాలజీ పెరిగితే అంత ఎక్కువ మొత్తంలో ఇ-వేస్ట్‌ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు మనం వాడే ప్రతి ఎలక్ట్రాననిక్‌ పరికరం ఏదో ఒక రోజు నిరుపయోగంగా మారుతుంది. ఫలితం ప్రస్తుతం ఉన్న చెత్తను తగ్గించకపోగా.. మరికొంత పెంచుతున్నట్లేనని వారు చెబుతున్నారు.

100 టన్నుల స్మార్ట్‌ఫోన్‌లలో

100 టన్నుల స్మార్ట్‌ఫోన్‌లలో

అయితే దీనిలో ఉపయోగాలను కూడా వారు చెబుతున్నారు. మనం వాడే స్మార్ట్‌ఫోన్‌ల తయారీలో చాలా తక్కువ మొత్తంలో బంగారం వాడతారనే విషయం తెలిసిందే. 100 టన్నుల బంగారు ధాతులో లభించే బంగారం కంటే.. 100 టన్నుల స్మార్ట్‌ఫోన్‌లలో లభించే బంగారం ఎక్కువనే నిజాన్ని నమ్మి తీరాలి.

4,35,000 టన్నుల మొబైల్‌ ఫోన్లను

4,35,000 టన్నుల మొబైల్‌ ఫోన్లను

బంగారం మాత్రమే కాక వెండి, రాగి, ప్లాటినం, పల్లాడియం వంటి విలువైన లోహాలు ఉంటాయి. వీటిని సరిగా సేకరించే వీలు లేకపోవడం వల్ల ఏటా దాదాపు 4,35,000 టన్నుల మొబైల్‌ ఫోన్లను చెత్త కుప్పలో పడేస్తున్నాం.

రీసైకిల్‌తో మంచి ఆదాయం

రీసైకిల్‌తో మంచి ఆదాయం

ఇ-వ్యర్థాలు నుంచి విలువైన లోహాలను వేరు చేయడం ఇప్పటికే పెద్ద బిజినెస్‌గా మారింది. ప్రతి ఏడాది ఇ వేస్ట్‌ను రీసైకిల్‌ చేయడం ద్వారా 62.5 బిలియన్ల సంపద లభిస్తుంది. ఈ మొత్తం కొన్ని దేశాల జీడీపీకి సమానం. అయితే ఇది చాలా రిస్క్ తో కూడుకున్నది.సరైన సౌకర్యాల మధ్య జరగకపోతే.. పర్యావరణానికే కాక మనుషులకు కూడా హాని కల్గించే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
We generate 125,000 jumbo jets worth of e-waste every year. Here’s how we can tackle the problem More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X