ఇక్కడ కిల్లో ఉల్లిపాయలు రూ.9కే!

Posted By:

సాధారణ, మధ్య తరగతి కుటుంబాల్లో ఉల్లిపాయలు కన్నీళ్లు పెట్టిస్తున్న రోజులివి. వంటింట్లో ఉల్లిలేనిదే వంటకాలు చేయలేరు. అలాంటి నిత్యవసరమైన ఉల్లిపాయ ధర సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరకుంది. ఒకప్పుడు కేజీ ఉల్లి ధర రూ.10 ఉండేది. ఇప్పుడు కేజీ ఉల్లి ధర రూ.60కి చేరుకోవటంతో దారుణమైన పరిస్థితులు నెలకున్నాయి. మార్కెట్లో ఉల్లి దిగుమతి తగ్గిపోవడం ఇంకా దళారులు కృత్రిమ కొరతను సృష్టించడం కారణంగా ఉల్లిపాయాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో ఉల్లిపాయ పేరు చెబితనే సామాన్యులు జంకుతున్నారు.

ఇక్కడ కిల్లో ఉల్లిపాయలు రూ.9కే!

ఈ నేపధ్యంలో, ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ గ్రూప్ఆన్ ఇండియా (Groupon India) కేజీ ఉల్లిపాయలను రూ.9కే ఆఫర్ చేస్తోంది. ఢిల్లీ చెందిన ప్రముఖ హోల్‌సేల్ డీలర్‌తో ఒప్పందాన్ని కుదర్చుకున్న ఈ షాపింగ్ వెబ్‌సైట్ రూ.9 ధరకు రోజుకు 3,000కిలోలు ఉల్లిపాయలను విక్రయిస్తోంది. గ్రూప్ఆన్ ఇండియా సంస్థ సెప్టంబర్ 5 నుంచి  ఈ ఆఫర్‌ను ప్రారంభించింది. రోజుకు 3,000 కిలోలను మాత్రమే విక్రయిస్తారు. ఒక్కో కస్టమర్‌కు ఒక్కో కిలోమాత్రమే. ప్రీఆర్డర్ చేసుకున్న వారికి 10 రోజుల్లో డెలివరీ అందుతుంది. గ్రూప్ఆన్ ఇండియా ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్‌లో ఉల్లి విక్రయాలు ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభమవుతాయి. గ్రూప్‌ఆన్ ఇండియా సంస్థకు దేశవ్యాప్తంగా 78నగరాల్లో

వినియోగదారులు ఉన్నారు.

మీరూ కూడా ఉల్లిపాయలను ప్రీ-ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే క్లిక్ చేయండి: www.groupon.co.in

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting