నిఘా నీడలో సెక్స్ బొమ్మలను విక్రయిస్తోన్న వెబ్‌సైట్‌లు

Posted By:

నిఘా నీడలో సెక్స్ బొమ్మలను విక్రయిస్తోన్న వెబ్‌సైట్‌లు

ఇటీవల కాలం వరకు భారత్ మార్కెట్లో సెక్స్ టాయ్స్ అంత సులువుగా దొరికేవి కావు. కొద్ది నెలల క్రితం నుంచి ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు సెక్సువల్ వెల్‌నెస్ పేరుతో ఓ విభాగాన్ని పరిచయం చేసి ఆన్‌లైన్ ద్వారా సెక్స్ టాయ్స్, కిట్స్, ఎడిబుల్ లింగరీ, లూబ్రికేంట్స్, కండోమ్స్ తదితర వస్తువులను విక్రయిస్తున్నారు. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ కేటగిరి క్రింద ఏకంగా 260 ఉత్పత్తులను విక్రయిస్తోంది. iambesharam.com, thatspersonal.com, ohmysecrets.com తదితర వెబ్‌సైట్‌లు భారత్‌లో సెక్స్ టాయ్‌లను విక్రయిస్తోన్న వెబ్‌సైట్‌ల జాబితాలో ఉన్నాయి.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

భారత్‌లోని మెట్రో నగరాలకే పరిమితమైన ఈ వ్యాపారం విలువ 1500 కోట్ల వరకు ఉంటుందని ఓ అంచనా. ఇప్పటి వరకు విచ్చలవిడిగా సాగిన ఈ వ్యాపారం ఇక పై ప్రభుత్వ నిఘా నీడలో సాగనుంది. నాలుగు వెబ్‌సైట్‌లు అభ్యంతరకర వస్తువులను అక్రమంగా విక్రయిస్తున్నాయంటూ హరిత్ కుమర్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు అప్రమత్తమైన ఢిల్లీ పోలీస్ క్రైం బ్రాంచ్ ఈ అంశాన్ని పరిశీలించాలని సమాచార & ప్రసారాల మంత్రిత్వ శాఖను కోరింది. ఈ పరిశీలనలో భాగంగా సదరు వెబ్‌సైట్‌లు దోషులుగా తేలినట్లయితే ప్రభుత్వం వాటి పై బ్యాన్ విధించే అవకాశం ఉంది.

English summary
Websites selling sex toys under lens. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting