వింతైన ఆవిష్కరణలు...

Posted By:

ఆ హోటల్‌లో రోబోట్‌లు మాత్రమే పనిచేస్తాయ్.. ఐఫోన్5 కోసం ఓ అభిమాని వింత వేషధారణ.. 36 కెమెరాలు కలిగిన బంతి... అలరిస్తున్న ఆడ రోబోట్.. గాజుతో రూపొందించబడిన స్టీవ్ జాబ్స్ స్మారకస్ధూపం ఇలా అనేక వినూత్నమైన హై-టెక్ ఆవిష్కరణలను ఈ శీర్షిక ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం. చూసేందుకు మీరు సిద్ధమేనా..?. సరికొత్త రూపకల్పనలతో ఇండస్ట్రియల్ డిజైనర్లు టెక్నాలజీ ప్రపంచాన్ని కనవిందు చేస్తున్నారు. తమ ఆధునిక భావాలకు సాంకేతికతను జోడించి ఆశ్చర్యపరిచే కాన్సెప్ట్ డిజైన్‌లను వెలుగులోకి తీసుకువస్తున్నారు.

చిట్కా: మీకు ట్విట్టర్‌లో అకౌంట్ ఉందా.. మరి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారా. మీ ట్విట్టర్ అకౌంట్ సురక్షితంగా ఉండాలంటే http://twittercounter.comలో సభ్యులుగా చేరిపోండి.

భవిష్యత్ టెక్నాలజీ కోసం క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వింతైన ఆవిష్కరణలు...

చైనాలోని హార్బిన్ పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రోబోట్ రెస్టారెంట్‌లో రోబోలు మాత్రమే సర్వ్ చేస్తాయి.

వింతైన ఆవిష్కరణలు...

యాపిల్ సహ వ్యవస్థాపకులు దివంగత స్టీవ్ జాబ్స్ జ్ఞాపకాలకు చిహ్నంగా ఏర్పాటు చేసిన ఐఫోన్ ఆకారంలోని ఓ స్మారకస్థూపం గ్లాస్‌తో నిర్మించిబడింది. ఎత్తు 74 అడుగుల. సాంకేతిక మెళవింపుతో రూపుదిద్దుకున్న ఈ స్థూపం వివిధ వాతావరణాలను తట్టుకోగలదు.

వింతైన ఆవిష్కరణలు...

పక్షవాతానికి గురైన యాన్ చింగ్ - హాంగ్ ఇలా పేసిఫైర్ ఆకారంలో ఉండే స్విచ్‌ను ఉఫయోగించుకుని ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేస్తారు. ఈ ప్రత్యేక వ్యవస్థను తైవాన్ నేషనల్ చింగ్ కుంగ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ లుయో చింగ్-హ్సింగ్ అభివృద్ధి చేశారు.

వింతైన ఆవిష్కరణలు...

టోక్యోలో నూతనంగా ప్రారంభించిన ఓ రెస్టారెంట్‌లో ఏర్పాటు చేసిన 3.6 మీటర్లు ఆడ రోబోట్ చూపరులను ఆకట్టుకుంటోంది.

వింతైన ఆవిష్కరణలు...

న్యూయార్క్‌‌‌కు చెందిన ప్రముఖ పచ్చబొట్టు కళాకారుడు డేవ్ హర్బన్ ఐపోడ్ నానోను అయస్కాంత కుట్లు సాయంతో తన చేతికి అనుసంధానించుకున్నాడు.

వింతైన ఆవిష్కరణలు...

18 మీటర్ల ఎత్తును కలిగి జెయింట్ శిలను తలపిస్తున్న ఈ రోబోట్ పేరు గుండార్. టోక్యోలో ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ రోబోట్‌ను ప్రదర్శించారు.

వింతైన ఆవిష్కరణలు...

42వ టోక్యో మోటార్ షోలో భాగంగా హోండా మోటర్ కంపెనీకి చెందిన హ్యూమనాయిడ్ రోబోట్ ఒక కప్పులోకి పానియాన్ని పోస్తున్న దృశ్యమిది.

వింతైన ఆవిష్కరణలు...

టోక్యోకు చెందిన ఓ యాపిల్ అభిమాని ఐఫోన్5ను కొనుగోలు చేసేందుకు ఇలా వినూత్నంగా దుస్తులు ధరించాడు.

వింతైన ఆవిష్కరణలు...

ఈ చిత్రంలో మీరు చూస్తున్న పానోరమిక్ బాల్ 36 మొబైల్ ఫోన్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఈ బంతిని విసిరిని సమయంలో ఫోటోలను 360 డిగ్రీల కోణంలో చిత్రీకరించుకోవచ్చు.

వింతైన ఆవిష్కరణలు...

జుట్టును శుభ్రం చేసే రోబోట్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot