Home
News

దుమ్ములేపారంతే.. డీప్‌సీక్ సృష్టికర్త లియాంగ్ వెన్‌ఫెంగ్ స్వస్థలానికి గ్రాండ్ ఎంట్రీ!

DeepSeek: రెండు వారాల క్రితం వరకు ఎవరికీ పెద్దగా తెలియని ఒక చైనా కంపెనీ, కృత్రిమ మేధస్సు (AI) మోడల్‌తో ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ఆ కంపెనీ పేరు డీప్‌సీక్. గిట్‌హబ్‌లో వాళ్లు విడుదల చేసిన పరిశోధనా పత్రంలో డీప్‌సీక్ R1 మోడల్, బడా కంపెనీల AI మోడల్స్‌తో సమానంగా, లేదా వాటికంటే మెరుగ్గా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఆ కంపెనీలు ఏవో కాదు.. ఓపెన్ఏఐ చాట్‌జీపీటీ, మెటా Llama, ఆంథ్రపిక్ క్లాడే వంటి దిగ్గజాలు.

* తక్కువ ఖర్చుతో సంచలనం..

ఈ ఫలితాలన్నీ చాలా తక్కువ ఖర్చుతో సాధించడం విశేషం. డీప్‌సీక్ మోడల్, చాలా తక్కువ, తక్కువ శక్తివంతమైన ఎన్విడియా చిప్‌లను ఉపయోగించి ఈ అద్భుతాలు చేసింది. ముఖ్యంగా ఇది చైనాకు చాలా ముఖ్యం, ఎందుకంటే అక్కడ అత్యాధునిక చిప్‌లు దొరకడం చాలా కష్టం.

Welcome Back  Champion  Deepseek Founder Liang Wenfeng s Triumphant Homecoming

* వెనుక ఉన్న వ్యక్తి

ఈ సంచలన విజయం వెనుక ఉన్న వ్యక్తి లియాంగ్ వెన్‌ఫెంగ్. డీప్‌సీక్ వ్యవస్థాపకుడు ఆయనే. 40 ఏళ్ల వయస్సులోనే ఆయన బిలియనీర్ అయ్యారు, అంటే వందల కోట్లకు పడగలెత్తారు. అదెలా అంటే, ఆయన నడుపుతున్న హెడ్జ్ ఫండ్, హై-ఫ్లయర్ ద్వారా అతడు ఈ ఘనత సాధించారు.

ఇప్పుడు వెన్‌ఫెంగ్‌ సొంత రాష్ట్రమైన గ్వాంగ్‌డాంగ్‌లో అతన్ని ఒక హీరో, ఛాంపియన్ లాగా చూస్తున్నారు. ఇటీవల లూనార్ న్యూ ఇయర్ వేడుకల కోసం ఆయన అక్కడికి వెళ్లారు. ఆయన వెంట బాడీగార్డ్స్ ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన స్థాయి ఏ రేంజ్‌కు ఎదిగిందో చెప్పడానికి ఇదే నిదర్శనం.

* స్వస్థలంలో హీరో..

వెన్‌ఫెంగ్‌ను ఆయన స్వస్థలంలో అందరూ ఒకప్పుడు చదువులో చాలా ముందుండే విద్యార్థిగా గుర్తు చేసుకుంటారు. ఇతడు గణితంలో చాలా గొప్పగా ఉండేవారని, కామిక్ పుస్తకాలు అంటే చాలా ఇష్టమని, అంతేకాదు ఫుట్‌బాల్ కూడా బాగా ఆడేవారని స్థానికులు ఫైనాన్షియల్ టైమ్స్‌తో చెప్పారు.

ఆయనది విద్యావేత్తల కుటుంబం. బహుశా అది కూడా అతడి విజయానికి ఒక కారణం కావచ్చు. "మేమందరం ఈ ఊర్లోనే పెరిగాం," అని ఒక స్థానికుడు చెప్పాడు. "ఆయనంటే మాకు చాలా గర్వంగా ఉంది." అని అన్నారు. మొత్తం మీద వెన్‌ఫెంగ్‌ ఆ ప్రాంత ప్రజలకు చాలా స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.

* ప్రచారం దూరం.. కారణమదేనా..

రోజురోజుకూ క్రేజ్ పెరిగిపోతోంది కానీ వెన్‌ఫెంగ్ మాత్రం పబ్లిక్ లైఫ్‌కు దూరంగా ఉంటున్నారు. ఆయన గురించి చాలా మందికి తెలుసుకోవాలని ఉంది, ఎలాన్ మస్క్ వలె అతను కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ తరం ప్రజలకు ఇన్‌స్పిరేషనల్ గా నిలుస్తాడని అందరూ భావిస్తున్నారు. కానీ అతడు మాత్రం చాలా ప్రైవేట్‌గా ఉంటున్నారు.

ఇలా జాగ్రత్తగా ఉండటంలో అర్థం ఉంది. గతంలో జాక్ మా, పోనీ మా వంటి చైనాకు చెందిన కొంతమంది విజయవంతమైన CEOలు బాగా పాపులర్ అయిపోవడంతో ప్రభుత్వ పరిశీలనను ఎదుర్కొన్నారు. బహుశా అందుకే వెన్‌ఫెంగ్ కూడా తెర వెనుక ఉండాలని అనుకుంటున్నారేమో.

* సిలికాన్ వ్యాలీకి సవాల్ విసురుతుందా..

డీప్‌సీక్ విజయం AI అభివృద్ధిలో ఒక పెద్ద మలుపు. అత్యంత ఖరీదైన టెక్నాలజీ లేకుండానే అత్యుత్తమ AI మోడల్‌లను సృష్టించవచ్చని ఇది నిరూపించింది. ముఖ్యంగా చిప్ కొరతను ఎదుర్కొంటున్న దేశాలలో ఇది AI అభివృద్ధి చెందే విధానాన్ని మార్చేస్తుంది.

ప్రస్తుతానికి, వెన్‌ఫెంగ్ స్వస్థలానికి తిరిగి రావడం స్థానిక సమాజానికి గర్వకారణం. కానీ అసలు విషయం ఏమిటంటే.. డీప్‌సీక్ AI ప్రపంచంలో ఎదుగుతున్న తీరు, ఇది సిలికాన్ వ్యాలీ ఆధిపత్యాన్ని ఎలా సవాలు చేస్తుందో చూడాలి.

More from GizBot

Best Mobiles in India

English summary
DeepSeek, a Chinese company founded by Liang Wenfeng, rivals Silicon Valley AI with its R1 model. Outperforming giants like ChatGPT at lower cost, DeepSeek addresses chip limitations. Wenfeng's homecoming celebrates this achievement.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X