టెక్ బిలియనీర్లు 20 ఏళ్ల వయసులో ఏం చేసేవారు..?

|

మీరు 20 ఏళ్ల వయసులో ఏంచేసుంటారు..? బహుశా కాలేజ్ లేదా విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తూ యూత్ ఫు‌ల్ లైఫ్‌ను ఆస్వాదించుంటారు. కానీ.. టెక్ ప్రపంచాన్ని శాసిస్తున్న ఆ 5గురు బిలియనీర్లు 20వ ఏట నంచే తమ లక్ష్యాల వైపు గురిపెట్టారు.

 

వారి ఆశయాల ప్రేరణతో మైక్రోసాఫ్ట్.. యాపిల్.. ఫేస్‌బుక్.. డెల్..గూగుల్ వంటి సంస్థలు పుట్టుకొచ్చాయి. శ్రమనే ఆయుధంగా భావించి తమ తమ లక్ష్యాలను నెరవేర్చుకున్న 8మంది టెక్ బిలియనీర్ల టీనేజ్ జీవిత విశేషాలను గిజ్‌బాట్ మీతో షేర్ చేసుకుంటోంది.

టెక్ బిలియనీర్లు 20 ఏళ్ల వయసులో ఏం చేసేవారు..?

టెక్ బిలియనీర్లు 20 ఏళ్ల వయసులో ఏం చేసేవారు..?

1.) మార్క్ జూకర్‌బర్గ్, ఫేస్‌బుక్ అధినేత:

తన 23వ ఏటే ప్రముఖ టెక్ బిలియనీర్‌గా గుర్తింపుతెచ్చుకున్న మార్క్ జూకర్‌బెర్గ్, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని తన విద్యాభ్యాసాన్ని సగంలోనే ముగించాల్సి వచ్చింది. కోట్లాది మంది యూజర్లతో ప్రపంచదేశాలను కలగలుపుతున్న మార్క్ జూకర్‌బెర్గ్ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ ఫేస్‌బుక్‌కు గొప్ప చరిత్రే ఉంది. తొలత ఈ సామాజిక సైట్ ‘ఫేస్‌మాష్ డాట్‌కామ్ 'గా ప్రారంభమైంది. దీని రూపకర్త మార్క్ జూకర్స్‌బర్గ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని తన మిత్రులతో కలిసి ఫేస్‌మాష్ కార్యకలాపాలను ప్రారంభించాడు. సదరు విశ్వవిద్యాలయంలోని అమ్మాయిలు, అబ్బాయిల ఫోటోలను వారికి తెలియకుండా వారి వారి ప్రొఫైల్స్ నుంచి సేకరించి తన లోకల్ నెట్‌వర్క్‌లో పొందుపరిచాడు. ఈ చర్య మార్క్‌ను నేరారోపణలు ఎదుర్కొనేలా చేసింది. ఈ వివాదం ముగిసిన అనంతరం ఫిబ్రవరి 4వ తేదిన ఫేస్‌మాష్ డాట్‌కామ్ ‘ద ఫేస్‌బుక్ డాట్ కామ్'గా రూపాంతరం చెందింది. 30 రోజుల వ్యవధిలనో ద ఫేస్‌బుక్ కాస్తా ఫేస్‌బుక్‌లా మారిపోయింది.

 

టెక్ బిలియనీర్లు 20 ఏళ్ల వయసులో ఏం చేసేవారు..?
 

టెక్ బిలియనీర్లు 20 ఏళ్ల వయసులో ఏం చేసేవారు..?

2.) బిల్‌గేట్స్ (మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు):

హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని తన చదువును అర్థంతరంగా ముగించిన బిల్‌గేట్స్ తమ మిత్రుడు పాల్ ఆలెన్‌తో కలిసి మైక్రోసాఫ్ట్ పేరుతో సాఫ్ట్‌వేర్ కంపెనీని ప్రారంభించటం జరిగింది.

మైక్రోసాఫ్ట్ పుట్టుక:

1975లో బిల్‌గేట్స్ ఇంకా పౌల్ అలెన్‌లు అమెరికాలోని రెడ్మాండ్ నగరంలో మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సంస్థ వివిధ రకాలైన కంప్యూటరు పరికరాలకు వివిధ రకాలయిన సాఫ్టువేర్ అభివృద్ది పరచడం, తయారు చేయడం, లైసెన్స్‌లు ఇవ్వడం ఇంకా సహకారం అందించడం చేస్తుంది. మైక్రోసాఫ్ట్ వృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల్లో మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంకా మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌లు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణను పొందాయి. ఇటీవల కాలంలో మైక్రోసాఫ్ట్ ‘విండోస్ 8' పేరుతో సరికొత్త మొబైల్ ఇంకా కంప్యూటింగ్ ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

 

టెక్ బిలియనీర్లు 20 ఏళ్ల వయసులో ఏం చేసేవారు..?

టెక్ బిలియనీర్లు 20 ఏళ్ల వయసులో ఏం చేసేవారు..?

3.) స్టీవ్‌జాబ్స్ (యాపల్ సంస్థల వ్యవస్థాపకులు):

స్టీవ్‌జాబ్స్ తన 19 సంవత్సరాల ప్రాయంలో ప్రముఖ గేమ్ కంపెనీ అటారీలో టెక్నీషియన్‌గా పనిచేసే వారు. ఆ విభాగంలో ప్రత్యేక నైపుణ్యాలను అలవరుచుకున్న జాబ్స్ తన 21వ ఏట మిత్రుడు స్టీవ్ వోజ్నియాక్ తో కలిసి ‘యాపిల్ కంప్యూటర్ కంపెనీ'ని ప్రారంభించి సర్క్యూట్ బోర్డ్‌లను విక్రయించేవారు.

 

టెక్ బిలియనీర్లు 20 ఏళ్ల వయసులో ఏం చేసేవారు..?

టెక్ బిలియనీర్లు 20 ఏళ్ల వయసులో ఏం చేసేవారు..?

4.) స్టీవ్ బాల్మర్ (మైక్రోసాఫ్ట్ సీఈవో):

ప్రస్తుత మైక్రోసాఫ్ట్ సీఈఓగా కొనసాగుతున్న స్టీవ్ బాల్మర్ తమ 20వ ఏటా హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి గణిత శాస్త్రం ఇంకా అర్థశాస్త్ర విభాగాల్లో నిష్ణాతులయ్యారు. సదరు విశ్వవిద్యాలయంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్‌తో స్నేహబాంధవ్యాలను కొనసాగించే వారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువు పూర్తి అయిన అనంతరం కన్స్యూమర్ గూడ్స్ కంపెనీ ప్రోక్టర్ & గ్యాంబిల్ కంపెనీలో రెండు సంవత్సరాల పాటు అసిస్టెంట్ మేనేజర్‌గా వ్యవహరించిన బాల్మర్ తన 24వ ఏట మైక్రోసాఫ్ట్ 30వ ఉద్యోగిగా నియమితులయ్యారు.

 

టెక్ బిలియనీర్లు 20 ఏళ్ల వయసులో ఏం చేసేవారు..?

టెక్ బిలియనీర్లు 20 ఏళ్ల వయసులో ఏం చేసేవారు..?

5.) లారీపేజ్, సెర్జీ‌బ్రిన్ (గూగుల్ సహ వ్యవస్థపాకులు):

గూగుల్ సహ వ్యవస్థాపకులైన లారీపేజ్ ఇంకా సెర్జీ‌బ్రిన్‌లు ఒకేసారి స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డి పట్టాలను అందుకున్నారు. వీరు ఇరువురు.. పేజీ ర్యాంగ్ అల్గారిథమ్‌ను వృద్ధి చేయటం జరిగింది. వీరిద్దరి భాగస్వామ్యంతోనే సెర్చ్ ఇంజన్ గూగుల్ ఆవిర్భవించింది.

1998లో ప్రారంభించబడిన గూగుల్, ప్రపంచంలోని మారు మూల పల్లెలకు సైతం విస్తరించిన పేరు. అంతర్జాల యూజర్లు మెచ్చుకున్నబెస్ట్ సెర్చ్‌ఇంజన్ వెబ్ సైట్. ఏ విషయం అయినా చటుక్కున తెలుసుకోగలిగే నెట్‌‌వర్క్‌. అన్నిటికీ మించి అన్నీ ఉచిత సేవలు. యూజర్లు తమకు వీలైనట్టుగా వాడుకొనే ఇంటర్‌ఫేస్‌. ప్రపంచంలోనే అత్యంత సులభతరమైన, వేగవంతమైన సెర్చ్‌ ఇంజిన్‌. రకరకాల అప్లికేషన్ల ద్వారా ప్రధమ స్థానానికి ఎగబాకిన సంస్థ.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X