రూ.800 జీతగాడు స్థాపించిన మహాసామ్రాజ్యం

|

హెడ్ లైన్ చూడగానే ఆశ్చర్యమనిపించిందా...అవును రూ.800 జీతగాడు ప్రపంచాన రారాజుగా వెలిగాడు. ఓ మహా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కేవలం 250 డాలర్లతో మొదలైన అతని ప్రయాణం నేడు వేల కోట్లకు చేరి ఎంతోమందికి నీడనిస్తోంది. అదే ఇన్పోసిస్.. ఆ జీతగాడే నారాయణ మూర్తి. ఇన్పోసిస్ ప్రస్థానం, నారాయణ మూర్తి జీవితంపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

ఈ 5 ఫోన్లను కొట్టే ఫోన్ లేదిప్పుడు, అదీ ప్రపంచ వ్యాప్తంగా !

కేవలం రెండేళ్లే
 

కేవలం రెండేళ్లే

ఇన్పోసిస్ ప్రారంభం కాకముందు నారాయణ మూర్తి పనిచేసింది కేవలం రెండేళ్లేనంటే నమ్మగలరా..అందులో ఒకటి అహమ్మదాబాద్ లోని ఐఐటీలో చీప్ సిస్టం పోగ్రామర్ కాగా, మరొకటి పుణెలోని పత్ని కంప్యూటర్ సిస్టమ్స్ లో ఉద్యోగం.

హెచ్ఎంటీ, ఈసీఐఎల్, టెల్కో

హెచ్ఎంటీ, ఈసీఐఎల్, టెల్కో

1969 నాటికి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన నారాయణ మూర్తికి అప్పటికే పారిశ్రామిక రంగంలో దూసుకుపోతున్న హెచ్ఎంటీ, ఈసీఐఎల్, టెల్కో తదితర కంపెనీలు ఆపర్ల మీద ఆపర్లిచ్చాయి. అయినా వాటిలో చేరలేదు.

రూ. 800 జీతానికి

రూ. 800 జీతానికి

కేవలం రూ. 800 జీతానికి అహమ్మదాబాద్ లోని ఐఐటీలో చీప్ సిస్టం పోగ్రామర్ గా చేరారు. ఎన్నో పాఠాలను నేర్పిన ఉద్యోగం కూడా అదే. అప్పుడు చాలీ చాలని జీతంతో నెట్టుకొచ్చిన రోజులను ఎప్పటికీ గుర్తు చేసుకునే ఉంటుంటారు నారాయణమూర్తి.

సొంత కంపెనీ స్థాపించాలనే తపన
 

సొంత కంపెనీ స్థాపించాలనే తపన

ఉద్యోగం చేయలేని పరిస్థితి, సొంత కంపెనీ స్థాపించాలనే తపన వెరసి ఇన్ఫోసిస్ అనే ఓ మహాసామ్రాజ్యం ప్రపంచానికి పరిచయమయ్యింది. ఆరుగురు మిత్రులతో కలిసి ఈ కంపెనీని స్థాపించారు. దీనికి అతని భార్య సుధామూర్తి కూడా చేయూతనిచ్చింది. తన వద్ద ఉన్న కొంత మొత్తాన్ని వ్యాపారం కోసం ఇచ్చింది.

చేతిలో చిల్లిగవ్వ లేదు

చేతిలో చిల్లిగవ్వ లేదు

చేతిలో చిల్లిగవ్వ లేదు. అయినా నారాయణ మూర్తి వేగం, దూకుడు ముందు అవి చిన్నబోయాయి. 250 డాలర్లతో ప్రారంభమైన కంపెనీ, బిలియన్ డాలర్ల కంపెనీగా ఎదిగేందుకు 23 ఏళ్ల సమయం పడితే, ఆ తర్వాత మరో 23 నెలల్లోనే అంటే 2004లోనే 2 బిలియన్ల మార్కును తాకింది.

2006 నాటికి 2 బిలియన్ డాలర్ల కంపెనీగా

2006 నాటికి 2 బిలియన్ డాలర్ల కంపెనీగా

2006 నాటికి 2 బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించింది. నేడు 12 బిలియన్ డాలర్లతో,2 లక్షలకు పైగా ఉద్యోగులతో ఏటా 50,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది.

షేర్ మార్కెట్ లో రారాజు

షేర్ మార్కెట్ లో రారాజు

నాస్ డాక్..షేర్ మార్కెట్ లో రారాజు. ప్రపంచంలోనే మేటి కంపెనీల షేర్ల క్రయ విక్రయాలకు కేంద్ర బిందువు. ఇందులో లిస్టయ్యేందుకు మొగ్గు చూపని పరిశ్రమ, పారిశ్రామిక వేత్త కూడా ఉండడు. ఘన చరిత్ర ఉన్న ఈ ఎక్సేంజ్ లో ఇన్ఫోసిస్ రాకముందు ఏ ఒక్క భారత కంపెనీకి చోటు దక్కలేదు.

చోటు దక్కించుకున్న తొలి భారతీయ కంపెనీ

చోటు దక్కించుకున్న తొలి భారతీయ కంపెనీ

1999లో ఇన్ఫోసిస్ చరిత్ర సృష్టించింది. నాస్ డాక్ లో చోటు దక్కించుకున్న తొలి భారతీయ కంపెనీగా రికార్డులకెక్కింది. వ్యాపారంలో తొలి అడుగేసిన 18 ఏళ్లకు గాని ఇన్ఫోసిస్, ఈ స్థాయికి చేరుకోలేకపోయింది.

1946, ఆగస్టు 20న మైసూర్ లో

1946, ఆగస్టు 20న మైసూర్ లో

1946, ఆగస్టు 20న మైసూర్ లో ఓ పాఠశాల ఉపాధ్యాయుడి ఇంటిలో పుట్టిన నారాయణ మూర్తి, ప్రస్తుతం బెంగళూరును తన స్థిర నివాసంగా చేసుకున్నారు. ఈ మధ్యలో కాన్పూర్, ఫుణేలలోనూ కొంతకాలం పాటు గడిపారు.

 1967 లో ఎలక్ట్రికల్ విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ

1967 లో ఎలక్ట్రికల్ విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ

యూనివర్సిటీ ఆఫ్ మైసూర్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ లో 1967 లో ఎలక్ట్రికల్ విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన మూర్తి, ఆ తర్వాత 1969లో ఐఐటీ, కాన్పూర్ లో అదే విభాగంలో మాస్టర్స్ పట్టా పొందారు.

కుటుంబ పరిస్థితి అంతంతమాత్రం

కుటుంబ పరిస్థితి అంతంతమాత్రం

తండ్రి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నేపథ్యంలో కుటుంబ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండేది. దీంతో డిగ్రీ పూర్తి చేసేందుకు మూర్తి... ప్రైవేట్ గా ట్యూషన్లు చెప్పాల్సి వచ్చింది.

ఇన్ఫోసిస్ సంక్షోభానికి కారణం ఆయనేనంటూ

ఇన్ఫోసిస్ సంక్షోభానికి కారణం ఆయనేనంటూ

మరి ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చిన ఇన్పోసిస్ నారాయణ మూర్తిపై నేడు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇన్ఫోసిస్ సంక్షోభానికి కారణం ఆయనేనంటూ ప్రమోటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

విశాల్ సిక్కా రాజీనామాకు

విశాల్ సిక్కా రాజీనామాకు

కంపెనీ సీఈఓ విశాల్ సిక్కా రాజీనామాకు ప్రధాన కారణం నారాయణమూర్తేనని వాదిస్తున్నారు. ఏది ఏమైనా ఇన్ఫోసిస్ నేడు సంక్షోభంలో కూరుకుపోయిన మాట వాస్తవం. అది త్వరలో పుంజుకోవాలని ఆశిద్దాం.

Most Read Articles
Best Mobiles in India

English summary
What are some interesting facts to know about Infosys Narayan Murthy Read More At gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X