కన్నీళ్లు తెప్పిస్తున్న స్టీవ్ జాబ్స్ ఆఖరి మాటలు

Written By:

స్టీవ్ జాబ్స్. పరిచయం అక్కర్లేని పేరు. వరల్డ్ మోస్ట్ వాల్యూబుల్ కంపెనీ ఆపిల్ సహ-వ్యవస్థాపకుడు. అనేక రంగాలను ప్రభావితం చేసిన విజనరీ. రివల్యూషనరీ. సరికొత్త ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేసిన ఇన్నోవేటర్.

మళ్లీ ఆ ఫోన్‌పై రూ.9 వేలు కోత, మొత్తంగా రూ.19 వేలు కట్

కన్నీళ్లు తెప్పిస్తున్న స్టీవ్ జాబ్స్ ఆఖరి మాటలు

Comio C1, S1, P1 Smartphones First Impressions

ఆపిల్ కంపెనీకే సాధ్యమైన ప్రత్యేక ఉత్పత్తులతో ప్రపంచ టెక్నాలజీ అభిమానులను ఉత్తేజపరిచిన స్టీవ్ జాబ్స్ 56 ఏళ్ళ వయసులో తనువు చాలించిన విషయ అందరికీ తెలిసిందే. గాడ్ ఆఫ్ టెక్నాలజీ గురించి చాలామందికి కొన్ని విషయాలు తెలియవు. తన డైరీలో రాసుకున్న ఈ వాక్యాలు చదివిన వారికి కళ్లల్లో నీరు రాక మానదు.

జియో ఫీచర్ ఫోన్ కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నేను గర్వపడిన పేరూ, డబ్బూ

వ్యాపార సామ్రాజ్యంలో శిఖరాన్ని చేరిన నాకు పని తప్ప వేరే ఆనందమంటే ఏంటో తెలియదు. జీవితమంతా సంపాదనకే అంకితమైపోయాను. మరణశయ్య మీద రోజులు లెక్కపెట్టుకుంటున్న నేను ఓ సారి ఆత్మ పరిశీలన చేసుకుంటే ఇన్నాళ్ళూ నేను గర్వపడిన పేరూ డబ్బూ ఎందుకూ కొరగానివని నాకు అనిపిస్తోంది .

నాకు మృత్యుదేవత ఊపిరి చప్పుడు

ఈ నిశిరాత్రిలో ...నా ప్రాణాలు నిలిపేందుకు అమర్చిన యంత్రాలు చేసే శబ్దంలో నాకు మృత్యుదేవత ఊపిరి చప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది. డబ్బంటే తెలియని అసహ్యం కలుగుతోంది.

డబ్బుకి అవతల చాలా ప్రపంచం

జీవితంలో సరిపడా డబ్బు సంపాదించాక మనం ఆలోచించాల్సిన విషయాలు వేరే ఉన్నాయి. కళలూ , అనుబంధాలూ , చిన్నపాటి కలలూ , కోరికలూ , సేవ ..ఇలా డబ్బుకి అవతల చాలా ప్రపంచం ఉంది . కానీ డబ్బు వెనుక పెట్టే పరుగు మనిషిని మరమనిషిలా మార్చేస్తుంది. అందుకు నేనే ఉదాహరణ .

నా ఈ ఆఖరి ప్రయాణంలో

నేను సంపాదించిన డబ్బు ఈ క్షణం నాకు తోడుగా లేదు. నా ఈ ఆఖరి ప్రయాణంలో అది నా వెంట రాదు. నేను నాతో తీసుకువెళ్ళగలిగేది ప్రేమానుభూతులూ, అందమైన జ్ఞాపకాలు మాత్రమే. .

ఎంత గొప్ప స్థితిలో ఉన్నా

జీవితంలో ఈరోజు మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నా కథ ముగిసే రోజు , తెరపడే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు ఎంత ఆరాటపడినా కాలం వెనక్కి వెళ్ళదు. అందుకే కాస్త ముందే కళ్ళు తెరువు.

డబ్బును కాదు , నీ కుటుంబాన్ని ప్రేమించు

డబ్బును కాదు , నీ కుటుంబాన్ని ప్రేమించు. నీ స్నేహితులను ప్రేమించు. నీ చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రేమించు. ఆనందంగా జీవించు.

ఖరీదైన మంచం ఏదో తెలుసా

ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన మంచం ఏదో తెలుసా? నువ్వు రోగంతో బాధపడుతూ పడుకున్న మంచం.

నీ బాధనూ అనుభవించే వ్యక్తిని

నీ కారు నడపడానికి ఒక డ్రైవర్ ను నియమించుకోగలవు. నీ కోసం సంపాదించిపెట్టగలిగే ఉద్యోగులను నియమించుకోగలవు. కానీ , నీ జబ్బునూ , నీ బాధనూ అనుభవించే వ్యక్తిని మాత్రం ఎన్ని కోట్లు పెట్టినా నువ్వు ఏర్పాటు చేసుకోలేవు .

చేజారిన జీవితాన్ని

నువ్వు దేన్ని కోల్పోయినా తిరిగి పొందవచ్చుగానీ చేజారిన జీవితాన్ని మాత్రం తిరిగి పొందలేవు. పాంక్రియటిక్ కేన్సర్ తో పోరాడి ఓడిన స్టీవ్ జాబ్స్ తన డైరీలో ఈ వాక్యాలను రాసుకున్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే ఐఫోన్ 4 ఎస్ విడుదల చేసిన తర్వాత రోజే స్టీవ్ మరణించడం.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
What are some mind-blowing facts about Steve Jobs Read more At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot