ఆపిల్ WWDC 2023.. 15 అంగుళాల మ్యాక్‌బుక్ ఎయిర్ లాంచ్?
ఆపిల్ వార్షిక సమావేశం WWDC (వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్) 2023 అనేక మంది దృష్టిని ఆకర్షించింది. ఈ కార్యక్రమం జూన్ 5 నుంచి 9 జరగనుంది. అయితే ఈ సంవత్సరం డబ్ల్యూడబ్ల్యూడీసీ ఆన్‌లైన్ వేదికగా జరగనుంది. ఆపిల్ పార్క్‌లో జరగనున్న తొలి రోజు సమావేశంలో ఆపిల్ సీఈవో టిమ్‌కుక్ ప్రసంగానికి... ఎంపిక చేసిన కొంత మంది డెవలపర్‌లు, విద్యార్థులను అనుమతించనున్నారు.
సాధారణంగా డబ్ల్యూడబ్ల్యూడీసీ వార్షిక సమావేశంలో ఆపిల్ సాఫ్ట్‌వేర్లు, iOS, iPadOS, macOS, వాచ్iOS, టీవీOS అప్‌డేట్ వేరియంట్లపై ప్రకటనలు వెలువడతాయి. వీటితోపాటు ఆపిల్ మాక్‌బుక్ తాజా మోడల్‌పై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

గత సంవత్సరం మాదిరిగానే కార్యక్రమంలో ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. కానీ ఎప్పటి నుంచో ఆపిల్ నుంచి ఎదురుచూస్తున్న మిక్సిడ్ రియాలిటీ హెడ్‌సెట్‌పై ప్రకటన వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే ఆపిల్ ఎప్పుడూ తన ఆవిష్కరణలను విడుదల వరకు గోప్యంగా ఉంచుతుందని గమనించాలి.
మిక్సిడ్ రియాలిటీ హెడ్‌సెట్ : ఈ హెడ్‌సెట్‌పై ఎప్పటి నుంచో ఉహాగానాలు వస్తున్నాయి. ఆపిల్ తన తొలి హెడ్‌సెట్‌లోనే ఆగ్‌మెంటెడ్ రియాలిటీ (ఏఆర్) మరియు విజువల్ రియాలిటీని (వీఆర్) ఒకే సమయంలో దగ్గరకు చేర్చడం ద్వారా యూనిక్ మిక్సిడ్ రియాలిటీ అనుభూతిని ఇస్తుందని పలువురు భావిస్తున్నారు.
వినియోగదారులకు అవసరం అయినప్పుడు ఏఆర్ నుంచి వీఆర్ మోడ్‌లోకి మార్చుకొనేందుకు ఆపిల్ వాచ్‌లోని డిజిటల్ క్రౌన్ తరహాలో ఓ నాబ్ ఉంటుందని తెలుస్తోంది. ఈ హెడ్‌సెట్ సొంత ఆపరేటింగ్ సిస్టమ్ "xrOS" తో విడుదల కానుందని సమాచారం.
అయితే ఈ హెడ్‌సెట్ బాహ్యా బ్యాటరీ ప్యాక్ (External battery pack) తో రానుందని సమాచారం. వినియోగదారుని నడుముకు క్లిప్ చేసుకొనే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు హెచ్‌సెట్ 4k మైక్రో OLED స్క్రీన్‌తో రానుందని సమాచారం. మరియు సంజ్ఞ ఆధారంగా (Gesture based) నియంత్రించవచ్చని తెలుస్తోంది.
మ్యాక్‌బుక్ ఎయిర్ : ప్రస్తుతం ఆపిల్ మ్యాక్‌బుక్ 11 మరియు 13 అంగుళాల్లోనే అందుబాటులో ఉంది. మరింత మంది వినియోగదారులను ఆకర్షించడంలో భాగంగా ఆపిల్ 15 అంగుళాల మ్యాక్‌బుక్‌ను లాంచ్ చేయనుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇన్ హౌస్ M2 చిప్‌సెట్ ఆధారంగా పనిచేయనుందని తెలుస్తోంది. ఈ వార్షిక సమావేశంలో స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఆపిల్ 13.3 అంగుళాల M1 మోడల్ మరియు 13.6 అంగుళాల M2 వేరియంట్లు ఆపిల్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి.
మ్యాక్ ప్రో: మ్యాక్ ప్రోను చివరిగా 2019లో అప్‌డేట్ చేశారు. త్వరలో కొత్త మ్యాక్ ప్రో రానుందని సమాచారం. ఇది ఆపిల్ ఇన్ హౌస్ ప్రో SoC ఆధారంగా పనిచేయనుందని తెలుస్తోంది. దీనిపైనా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
సాఫ్ట్‌వేర్ : ఆపిల్ సొంత సాఫ్ట్‌వేర్‌లు అయిన iOS 17, ఐపాడ్OS 17, మ్యాక్OS 14, టీవీOS, వాచ్OS 10 తోపాటు కొత్త OS వేరియంట్లను ఈ వార్షిక సమావేశం WWDC 2023లో విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ వార్తలు, ఉహాగానాలపై సమావేశంలోనే స్పష్టమైన ప్రకటనలు వస్తాయి.


Click it and Unblock the Notifications







