Home
News

స్మార్ట్‌ఫోన్‌ లేదా ఏదైనా గ్యాడ్జెట్‌ను కొనుగోలు చేసినప్పుడు IP రేటింగ్‌ అనే పదం విన్నారా... ఏంటో తెలుసా...?

స్మార్ట్‌ఫోన్‌ లు లేదా ఇతర గ్యాడ్జెట్‌ లు కొనుగోలు చేసే సమయాల్లో IP రేటింగ్‌ (IP Ratings) అనే పదాన్ని ఎక్కడైనా విన్నారా.. వింటే దాని గురించి ఎప్పుడైనా తెలుసుకోవాలని ప్రయత్నం చేశారా.. స్మార్ట్‌ ఫోన్‌ లేదా ట్యాబ్లెట్ వంటి గ్యాడ్జెట్లు కొనుగోలు చేసే సమయంలో ఇతర స్పెసిఫికేషన్‌లతోపాటు IP52 నుంచి IP68 రేటింగ్‌ అనే పదాలను చూసి ఉంటారు. ఈ రేటింగ్‌ స్మార్ట్‌ఫోన్ లేదా ఇతర గ్యాడ్జెట్లు డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెన్స్‌ గురించి సూచిస్తుంది.

గతంలో కేవలం ప్రీమియం ఫోన్లకే ఈ రేటింగ్ ఉండేది. కానీ ప్రస్తుతం సుమారు అన్ని ఫోన్లు IP రేటింగ్‌ను కలిగి ఉంటున్నాయి. అసలు ఏంటీ IP రేటింగ్‌.. దీని వల్ల అసలు ఉపయోగం ఏంటి.. IP రేటింగ్‌ ఎంత ఉంటే మీ ఫోన్‌ సురక్షితంగా ఉంటుంది. వంటి వివరాలతో కూడిన పూర్తి కథనం మీకోసం.

do you know about IP Ratings

IP రేటింగ్ అంటే స్మా్ర్ట్‌ఫోన్‌ లేదా గ్యాడ్జెట్‌లోకి డస్ట్‌, వాటర్‌ చేరకుండా నియంత్రించే సామర్థ్యం గురించి సూచిస్తుంది. IP అంటే ఇన్‌గ్రేస్‌ ప్రొటెక్షన్‌. ఈ రేటింగ్‌ను అంతర్గాతీయ ఎలక్ట్రోటెక్నికల్‌ కమిషన్‌ (IEC) అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ కోసం IP రేటింగ్‌ను పొందేందుకు ఈ ఏజెన్సీలకు పంపాల్సి ఉంటుంది. వారు అనేక పరీక్షలు చేసి రేటింగ్ ఇస్తారు.

IP రేటింగ్‌లో ఏయే అక్షరాలు దేనిని సూచిస్తాయి. ఉదాహరణకు ఏదైనా స్మార్ట్‌ఫోన్‌ IP67 రేటింగ్‌ను పొందింది అనుకుందాం.. ఇందులో 6 అనే అంకె డస్ట్‌ రేటింగ్‌ను.. 7 వాటర్‌ రెసిస్టెన్స్‌ రేటింగ్‌ను సూచిస్తుంది. డస్ట్ రేటింగ్‌ 0 నుంచి 5 వరకు ఉంటుంది. అదే వాటర్‌ రేటింగ్‌ 0 నుంచి 9 వరకు ఉంటుంది. ఈ నంబర్‌ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచి రక్షణను కలిగి ఉంటుందని అర్థం.

ప్రస్తుతం అనేక స్మార్ట్‌ఫోన్‌లలో డస్ట్‌ రేటింగ్‌ 5 లేదా 6 గా ఉంటోంది. అదే వాటర్‌ రెసిస్టెన్స్‌ రేటింగ్‌ 7 ఉంటే.. కొంచెం నీటిలో తడిసినా డ్యామేజీ కాదు అని.. అదే 8 ఉంటే స్మార్ట్‌ఫోన్‌ను 1 మీటర్‌ నీటిలో 30 నిమిషాలపాటు ఉంచినా డ్యామేజీ కాదు. ఆ పరిమితులకు మించి IP రేటింగ్‌ను ప్రస్తుతానికి ఇవ్వడం లేదు.

స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్‌ సహా ఇతర గ్యాడ్జెట్‌లు ఏదైనా కారణం వల్ల డ్యామేజీ జరిగితే డస్ట్‌, వాటర్ బారి నుంచి రక్షణ కల్పించలేకపోవచ్చు. ఫ్రేమ్‌ లేదా డిస్‌ప్లే విరిగిపోయినా రక్షణ పొందే అవకాశం ఉండకపోవచ్చు. అయితే ఈ IP రేటింగ్ కేవలం డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెన్స్‌ కోసం మాత్రమే సూచిస్తుంది. ఫోన్ దృఢత్వాన్ని సూచించదు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
what are the IP Ratings on smartphones and gadgets what does it mean
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X