ఈ సంవత్సరం Alexa ను ఎక్కువగా ఏమేం ప్రశ్నలు అడిగారో తెలుసా..?
మరికొన్ని రోజుల్లో 2024 సంవత్సరానికి గుడ్‌బై చెప్పబోతున్నాం. అనేక రంగాల్లో ఈ సంవత్సర కాలంలో జరిగిన ఎన్నో మధురమైన జ్ఞాపకాలను అనేక మంది మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. ఇందులో భాగంగా మరిన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సంవత్సర కాలంలో అలెక్సా ను (Alexa) పలువురు ఏమేం అడిగారో జాబితా రూపంలో వెల్లడైంది. ఇందులో క్రికెటర్ల వ్యక్తిగత వివరాలు సహా బాలీవుడ్ సహా ఇతర నటీనటుల వివరాలను ఆరా తీశారు.
వీటితోపాటు సాధారణ మరియు ఆసక్తిని రేకెత్తించే అనేక ప్రశ్నాలను అలెక్సాను (List of Questions Asked To Alexa 2024) అడిగిన జాబితా అందుబాటులోకి వచ్చింది. భూమి మీద మొత్తం జనాభా, భూమి మరియు సూర్యుడి మధ్య దూరం వంటి ప్రశ్నలను అడిగినట్లు తెలిసింది. భక్తి గీతాల నుంచి సంగీతాన్ని ప్లే చేయాలంటూ కోరిన సందర్భాలు కూడా ఉన్నాయి.

దీంతోపాటు వంటింటి రుచులపైనా అలెక్సాకు పలు ప్రశ్నలు సందించారు. చిల్లీ పన్నీర్, పటియాలా చికెన్ వంటి వంటకాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ జాబితాలో క్రికెట్, సెలబ్రిటీల వ్యక్తిగత వివరాలు సహా బిలియనిర్‌ల సంపద వంటి వివరాలు కావాలని అలెక్సాను అడిగారు. దీంతోపాటు కొందరి సెలబ్రిటీల భాగస్వామి వివరాలు తెలపాలని కోరారు. దీంతోపాటు జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన వివరాలను ఆరా తీశారు.
అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా భారత్ ప్రధాని ఎవరు?, భూమి మీద మొత్తం జనాభా ఎంత?, ఏకాదశి ఎప్పుడు? తలనొప్పికి చికిత్స ఏం చేస్తారు?, ఈరోజు తేదీ ఎంత?, ప్రస్తుతం లండన్‌లో టైం ఎంత?, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు విజయం సాధించారు?, ఇవాళ్టి రాశిఫలాలు గురించి వివరించు?, ప్రస్తుతం స్టాక్ మార్కెట్ పరిస్థితి ఏంటి?, సూర్యుడు మరియు భూమి మధ్య దూరం ఎంత? వంటి ప్రశ్నలను అలెక్సాను అడిగారు.
దీంతోపాటు క్రికెట్ స్కోర్ ఎంత?, ఇండియా VS సౌత్ ఆఫ్రికా స్కోర్ ఎంత?, క్రెకెట్ మ్యాచ్ ఎప్పుడు ప్రారంభం కానుంది?, ఇండియా క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు?, ఇవాళ ఏయే టీమ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది?, ఇవాళ్టి మ్యా్చ్‌లో ఎవరు గెలుస్తారు? రోహిత్ శర్మ ఎవరు వంటి ప్రశ్నలను అలెక్సాను అడిగారు.
కృతి సనన్, దీపికా పదుకొనే : గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అనేక మంది సెలబ్రిటీల వ్యక్తిగత, ఆస్తులు, భాగస్వామి వివరాలను అలెక్సాను అడిగారు. విరాట్ కోహ్లీ, రొనాల్డో, మెస్సీ, షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కృతి సనన్, దీపికా పదుకొనే, హృతిక్ రోషన్ ఎత్తు ఎంత అంటూ ఆరా తీశారు.
దీంతో పాటు పలువురి సెలబ్రిటీల వయస్సు ఎంతో చెప్పాలని అలెక్సాను కోరారు. ఈ జాబితాలో కోహ్లీ, నరేంద్ర మోదీ, షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్, రొనాల్డో, సల్మాన్ ఖాన్, ధోని, రోహిత్ శర్మ, హృతిక్ రోషన్, టేలర్ స్విఫ్ట్ వయస్సు వివరాలు అడిగారు. దీంతోపాటు పలువురి సెలబ్రిటిల భాగస్వామి వివరాలు సహా ఆదాయం వివరాలను అలెక్సా ద్వారా తెలుసుకున్నారు.
దీంతోపాటు పలు వంటకాలను ఎలా తయారుచేయాలో తెలుసుకున్నారు. ఈ జాబితాలో చాయ్, చిల్లీ పన్నీర్, పటియాలా చికెన్, కడాయి చికెన్, బటర్ చికెన్, చాకో లావా కేక్, కోల్డ్ కాఫీ, పన్నీర్ టిక్కా మసాలా పిజ్జా, చికెన్ బిర్యానీ, పావ్ బాజీ వంటి వంటకాల తయారీ, కావాల్సిన సరకుల వివరాలను కోరారు.
ముకేష్ అంబానీ, ఎలాన్ మస్క్, రొనాల్డో, జెఫ్ బెజోస్, షారుక్‌ఖాన్, కోహ్లీ, రతన్ టాటా, మెస్సీ, బిల్ గేట్స్ ఆస్తుల వివరాలు చెప్పాలని అలెక్సాను అడిగారు. కోహ్లీ, రోనాల్డో, షారుక్‌ఖాన్, సల్మాన్ ఖాన్, సచిన్, అమితాబ్, పాండ్యా, హృతిక్ రోషన్, ధోనీ, దీపికా పదుకొనే వంటి సెలబ్రిటీల భాగస్వామి వివరాలను అడిగారు.


Click it and Unblock the Notifications








