ఇంటర్నెట్‌లో ఏం జరుగుతోంది..?

Posted By:

నిమిషం కాలంలో ఇంటర్నెట్‌లో ఏం జరుగుతోంది..? ఫోటోషేరింగ్ వెబ్‌సైట్ ఇన్స్‌టాగ్రామ్‌లో నిమిషానికి ఎన్ని ఫోటోలు షేర్ కాబడుతున్నాయ్..?, 60 సెకన్ల వ్యవధిలో ఎంత వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ కాబడుతోంది.? నిమిషానికి ఎన్ని ఫేస్‌బుక్ లైక్స్ లభిస్తున్నాయ్..?, ఎన్ని ట్వీట్‌లు నమోదవుతున్నాయ్..? వెబ్ ప్రపంచంలో 60 సెకన్ల వ్యవధిలో చోటుచేసుకునే ఆసక్తికర అంశాలను గిజ్‌బాట్ మీతో షేర్ చేసుకుంటోంది. ఈ సమాచారాన్ని ప్రముఖ క్యాస్‌బ్యాక్ వెబ్ పోర్టల్ క్యూమీ ద్వారా సేకరించటం జరిగింది.

ఇంటర్నెట్‌లో ఏం జరుగుతోంది..?

 ప్రముఖ ఫోటో షేరింగ్ వెబ్‌సైట్ ఇన్స్‌టాగ్రామ్‌లో నిమిషానికి 216000 ఫోటోలు షేర్ కాబడుతున్నాయి.

 ఆన్‌లైన్ రిటైలింగ్ దిగ్గజం ఆమెజాన్ నిమిషానికి $83,000 అమ్మకాలను చేపడుతోంది.

 ఫేస్‌బుక్‌లో నిమిషానికి 1.8మిలియన్ లైక్స్ నమోదువున్నాయి.

 యూట్యూబ్‌లో నిమిషానికి 72 గంటలు అంటే (3 రోజుల) నిడివి గల వీడియో అప్‌లోడ్ అవుతోంది.

 వెబ్ ప్రపంచంలో నిమిషానికి 70 కొత్త డొమైన్లు రిజిస్టర్ కాబడుతున్నాయి.

 నిమిషానికి ఆన్‌లైన్‌లో ఏర్పాటవుతున్న కొత్త వెబ్‌సైట్‌‍ల సంఖ్య 571.

 నిమిషానికి 204 మిలియన్ ఈ-మెయిళ్లు పంపబడుతున్నాయి.

 నిమిషానికి పోస్ట్ కాబడుతున్న ట్వీట్‌లు సంఖ్య 278,000.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot