ఎటు నుంచి వచ్చినా సున్నా విలువ సున్నానే!

Posted By: BOMMU SIVANJANEYULU

గణిత శాస్త్ర్రంలో సున్నాకు ఎంతటి విలువుందో మనందరికి తెలుసు. ఏదైనా సంఖ్యతో సున్నాతో డివైడ్ చేయటమనేది దాదాపుగా అసాధ్యమనే చెప్పుకోవాలి. ఎలక్ట్రానిక్ పాకెట్ కాలుక్యులేటర్‌లో ఏదైనా సంఖ్యను సున్నాతో భాగహరించే ప్రయత్నం చేసినట్లయితే వెంటనే మనకో “Error” మెసేజ్ చూపిస్తుంది. ఇదే విధమైన భాగాహారాన్ని పూర్వకాలు మెకానికల్ కాలుక్యులేటర్ చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డివిజన్ అనేది తీసివేత పై ఆధారపడి ఉంటుంది...

నెంబర్‌ఫైల్ అనే యూట్యూబ్ ఛానల్ కొద్ది నెలల క్రితం పోస్ట్ చేసిన ఓ వీడియో గణిత శాస్త్రం పట్ల మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ వీడియోలో Facit ESA-01 అనే మెకానికల్ కాలుక్యులేటర్ ద్వారా చేసిన భాగాహారం పూర్వకాలపు కాలుక్యులేటర్లు ఏ విధంగా వర్క్ అవుతాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది.

ఈ ఛానల్ వివరించినదాని ప్రకారం మెకానికల్ కాలుక్యులేటర్‌లో డివిజన్ అనేది తీసివేత (subtraction)

పై ఆధారపడి జరుగుతుంది. మీరు మొదటి నెంబర్ ను రెండవ నెంబర్‌తో డివైడ్ చేయాలనుకున్నట్లయితే రెండవ నెంబర్‌తో వ్యవకలనం (subtraction) చేస్తే సరిపోతోంది.

జీరో అనేది ఈక్వటీకి సమానం కానప్పటికి...

ఉదాహరణకు మీరు 20 సంఖ్యను 5 సంఖ్యతో భాగహరించాలనుకుంటున్నట్లయితే ప్రొసీజర్ ఈ విధంగా ఉంటుంది. 20 - 5 = 15, 15 - 5 = 10, 10 - 5 = 5, 5 - 5 = 0. భాగహరణ మొత్తం పూర్తవటానికి ఎన్నైతే subtractions అవసరమవుతాయో అదే జవాబు అవుతుంది. పైన చూపించిన లెక్కలో 0 సంఖ్యను 5 సంఖ్యతో భాగహరించటానికి 4 subtractions అవసరమయ్యాయి.

కాబట్టి 4 అనేది జవాబు. ఇదే కాలుక్యులేటర్‌లో 20 అంకెను 0తో భాగహరించే ప్రయత్నం చేసినట్లయితే 0 నుంచి 20 వరకు అనేక సార్లు subtraction జరిగి డివిజన్ అనేది పూర్తవుతుంది. ఇక్కడ జీరో అనేది ఈక్వటీకి సమానం కానప్పటికి డివిజన్‌ కంప్లీట్‌ అయ్యేంత వరకు మెకానికల్ కాలుక్యులేటర్ ఆపరేషన్ లను నిర్వహిస్తూనే ఉంది.

సున్నాని మొదటి సారిగా వాడిందెవరు..?

సున్నాను ఓ అంకెగా మొదటిసారి వాడిందెవరన్న విషయాన్ని సైంటిస్టులు తెలుసుకోగలిగారు. పురాతన భారతీయ దస్త్రాల్లో సున్నాను ఓ అంకెగా వాడిన వైనాన్ని కార్బన్ డేటింగ్ ద్వారా శాస్రవేత్తలు గుర్తించగలిగారు. భక్షాలి హస్తలిపిలో సున్నాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నట్లు పురాతత్వ శాస్త్రవేత్తలు తేల్చేసారు.

భక్షాలి హస్తలిపితో ఉన్న కొంత మాన్యువల్ స్ర్కిప్ట్‌ను బ్రిటన్ పరిశోధకులు అధ్యయనం చేయాగా ప్రాచీన భారతీయలు సున్నాను ఓ అంకెగా వాడినట్లు నిర్థారణ అయ్యింది. ఈ ఆధారాలను బట్టి చూస్తుంటే మూడు లేదా నాలుగో శాతబ్ధంలో సున్నా అంకెను వాడి ఉండొచ్చన్న అభిప్రాయాలను నిపుణులు వ్యక్తం చేసారు. అయితే ముందుగా అనుకున్నదాని కంటే 500 సంవత్సరాల ముందే సున్నా అంకె వినియోగంలో ఉన్నట్లు తెలుస్తోంది.

జనవరి 26న వస్తోన్న...వన్ ప్లస్ 5T లావా రెడ్ వేరియంట్ !

పెషావర్‌కు సమీపంలోని భక్షాలి గ్రామంలో..

భక్షాలి హస్తలిపి 1881లో భయటపడింది. పెషావర్‌కు సమీపంలోని భక్షాలి గ్రామంలో ఈ లిపి తాలూకా ఆనవాళ్లు బయటపడ్డాయి. అక్కడి నుంచి సేకరించిన 70 డాక్యుమెంట్లను ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని బోడ్లియన్ గ్రంధాలయంలో భద్రంగా ఉంచారు. వీటిని అధ్యయం చేసిన ప్రొఫెసర్ మార్కస్ డూ సౌటాయ్ సున్నా విశిష్టతను గుర్తించగలిగారు. వాస్తవానికి సున్నా అంకెను భారతీయ శాస్త్రవేత్త ఆర్యభట్ట కనిపెట్టారన్న విషయం మనందరికి తెలుసు.

ఆర్యభట్ట 5వ శతాబ్థానికి చెందిన గణిత శాస్త్రవేత్త. అయితే ఇటీవల వెలుగులోకి వచ్చిన అధ్యయాన్ని బట్టి చూస్తుంటే ఆర్యభట్ట కంటే ముందేస మన ప్రాచీన భారతీయులు సున్నాను వాడినట్లు అర్థమవుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Watch What Happens If You Try To Divide By Zero On This Mechanical Calculator. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot