యాపిల్ ఐఫోన్‌లకు కఠిన పరీక్ష!

Posted By:

బ్లెండర్స్, మిక్సర్స్ అలాగే గ్రెయిన్ మిల్స్‌ను తయారు చేయటంలో సుప్రసిద్ధ కంపెనీగా గుర్తింపుతెచ్చుకున్న బ్లెంటిక్ తమ ఉత్పత్తులు ఎంత శక్తివంతమైనవో నిరూపించేందుకు ఇప్పటి వరకు అనేక పరీక్షలు నిర్వహించి వాటన్నింటింలోనూ సఫలీకృతమైన విషయం తెలసిందే. గతంలో బ్లెంటిక్ సంస్థ ‘ఐఫోన్5' అలాగే ‘గెలాక్సీ ఎస్3'లకు సహన పరీక్ష నిర్వహించింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

పరీక్షలో భాగంగా ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లను వేరువేరు బ్లెండర్‌లలో వేసి కొద్ది నిమిషాలు పాటు ఒత్తిడికిలోను చేసారు. కొద్ది సెకన్లలోనే ఆ డివైజ్‌లు పిండి పదార్థంలా మారిపోయాయి. తాజాగా, బ్లెంటిక్ సంస్థ ఐఫోన్ 5ఎస్ గోల్డ్ వర్షన్ ఇంకా ఐఫోన్ 5సీ‌లకు సంబంధించి కఠరోమైన పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్షలో భాగంగా వివిధ కలర్ వేరయంట్‌లతో కూడిన ఐఫోన్ 5సీలను ఓ బ్లెండర్‌లో, ఐఫోన్ 5ఎస్ గోల్డ్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ను మరొక బ్లెండర్‌లో వేసి కొద్ది నిమిషాల పాటు ఒత్తడికి లోను చేసారు. తురువాత ఏం జరిగిందో క్రింది వీడియోలో మీరే చూడండి.......

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/GAuhUTzNwiY?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot