మరణించిన తరువాత మన ఆన్‌లైన్ అకౌంట్‌లు ఏమవుతాయ్..?

|

కమ్యూనికేషన్ అవసరాల రిత్యా ఫేస్‌బుక్, జీమెయిల్, వాట్సాప్, ట్విట్టర్ ఇలా అనేక వెబ్ ఆధారిత అప్లికేషన్‌లకు సంబంధించి ఆన్‌లైన్ అకౌంట్‌లను నిర్వహించుకుంటున్నాం. మరీ ముఖ్యంగా సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లు జీవనశైలిని పూర్తిగా మార్చేసాయి. మనం మరణించిన తరువాత మన ఆన్‌లైన్ అకౌంట్‌లు ఏమైపోతాయ్..?, వాటి ఎవరు నిర్వహిస్తారు..? ఇలాంటి సందేహాలు మనలో ప్రతి ఒక్కరికి వ్యక్తమై ఉండొచ్చు. ఆన్‌లైన్ అకౌంట్ అనేది వ్యక్తికి సంబంధించి పూర్తిగా వ్యక్తగతం. ఐడీ ఇంకా పాస్‌వర్డ్ తెలిస్తే తప్ప వేరొకరు మన అకౌంట్‌లను ఓపెన్ చేయలేరు. మరణించిన వ్యక్తులకు సంబంధించిన అకౌంట్‌లను ఏ విధంగా డీల్ చేయాలో ఇప్పుడు చూద్దాం...

 

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

మరణించిన తరువాత మన ఆన్‌లైన్ అకౌంట్‌లు ఏమవుతాయ్..?

మరణించిన తరువాత మన ఆన్‌లైన్ అకౌంట్‌లు ఏమవుతాయ్..?

ఫేస్‌బుక్‌లో రెండు ఆప్షన్‌లు

మరణించిన యూజర్‌కు సంబంధించి అకౌంట్‌ను డీల్ చేసేందుకు ఫేస్‌బుక్‌లో రెండు ఆప్షన్‌లు ఉన్నాయి. మొదటిది, మరణించిన యూజర్‌కు సంబంధించిన అకౌంట్‌ను స్మారక పేజీగా మార్చుకోవచ్చు. ఈ క్రమంలో ఫేస్‌బుక్ ఈ అకౌంట్‌ను సెక్యూర్ చేసేందుకు అదనపు చర్యలు తీసుకుంటుంది. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.

 

 

మరణించిన తరువాత మన ఆన్‌లైన్ అకౌంట్‌లు ఏమవుతాయ్..?

మరణించిన తరువాత మన ఆన్‌లైన్ అకౌంట్‌లు ఏమవుతాయ్..?

ఇలాంటి అరుదైన సందర్భాల్లో మరిణించిన వ్యక్తికి సంబంధించిన గూగుల్ ఇంకా జీమెయిల్ అకౌంట్ వివరాలను ఆ వ్యక్తి తరుపు ‘‘అధికార ప్రతినిధికి'' గూగుల్ అందజేస్తుంది. మరిన్నివివరాల కోసం క్లిక్ చేయండి

ఏప్రిల్ 2013లో గూగుల్ ‘ఇనాక్టివ్ అకౌంట్ మేనేజర్'ను పరిచయం చేసింది.  ఈ ప్లాన్‌లో భాగంగా మరణం తరువాత మన అకౌంట్‌లను ఏం చేయాలనుకుంటున్నామో గూగుల్‌కు చెబితే ఆ విధంగా చేయటం జరుగుతుంది. మరిన్నివివరాలకు సంబంధించి క్లిక్ చేయండి.

 

మరణించిన తరువాత మన ఆన్‌లైన్ అకౌంట్‌లు ఏమవుతాయ్..?
 

మరణించిన తరువాత మన ఆన్‌లైన్ అకౌంట్‌లు ఏమవుతాయ్..?

మరణించిన యూజర్‌కు సంబంధించి ట్విట్టర్ అకౌంట్‌‍కు సంబంధించిన యాక్సెస్‌ను ఎవ్వరికి ఇవ్వబోమని ట్విట్టర్ స్ఫష్టం చేసింది. అయితే, మరణించిన యూజర్‌కు సంబంధించి అకౌంట్‌ను డీయాక్టివేట్ చేయమని ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు ట్విట్టర్‌ను రిక్వస్ట్ చేయటం ద్వారా అకౌంట్‌ను డీయాక్టివేట్ చేస్తారు.

 

మరణించిన తరువాత మన ఆన్‌లైన్ అకౌంట్‌లు ఏమవుతాయ్..?

మరణించిన తరువాత మన ఆన్‌లైన్ అకౌంట్‌లు ఏమవుతాయ్..?

మరణించిన పింటరెస్ట్ యూజర్ అకౌంట్

మరణించిన యూజర్‌కు సంబంధించి అకౌంట్ వివరాలను ఎవ్వరికి ఇవ్వబోమని పింటరెస్ట్ వెల్లడించింది. మరణించిన యూజర్‌కు సంబంధించి అకౌంట్‌ను డీయాక్టివేట్ చేయమని ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు ఈమెయిల్ ద్వారా సంబంధిత ధృవీకరణ పత్రాలను సమర్పించినట్లయితే అకౌంట్‌ను డీయాక్టివేట్ చేస్తామని పింటరెస్ట్ నిబంధనులు చెబెతున్నాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.

 

మరణించిన తరువాత మన ఆన్‌లైన్ అకౌంట్‌లు ఏమవుతాయ్..?

మరణించిన తరువాత మన ఆన్‌లైన్ అకౌంట్‌లు ఏమవుతాయ్..?

మరణించిన ఇన్‌స్టాగ్రామ్ యూజర్ అకౌంట్

మరణించిన యూజర్‌కు సంబంధించి అకౌంట్‌ను క్లోజ్ చేయమని ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు ఇన్‌స్టాగ్రామ్‌ను రిక్వస్ట్ చేయటం ద్వారా సదరు అకౌంట్‌ను క్లోజ్ చేసేస్తారు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.

 

మరణించిన తరువాత మన ఆన్‌లైన్ అకౌంట్‌లు ఏమవుతాయ్..?

మరణించిన తరువాత మన ఆన్‌లైన్ అకౌంట్‌లు ఏమవుతాయ్..?

మరణించిన యాహూ యూజర్ అకౌంట్

మరణించిన యాహూ అకౌంట్ యూజర్‌కు సంబంధించిన వివరాలను ఆ వ్యక్తి తాలూకా అధికార ప్రతినిధి యాహూ దృష్టికి మెయిల్, ఫాక్స్, ఈమెయిల్‌కు రిక్వస్ట్ లెటర్‌తో పంపవల్సి ఉంటుంది. మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

మరణించిన తరువాత మన ఆన్‌లైన్ అకౌంట్‌లు ఏమవుతాయ్..?

మరణించిన తరువాత మన ఆన్‌లైన్ అకౌంట్‌లు ఏమవుతాయ్..?

మరణించిన పేపాల్ యూజర్ అకౌంట్

మరణించిన వ్యక్తికి సంబంధించిన పేపాల్ అకౌంట్‌ను క్లోజ్ చేయాలంటే సంబంధిత సమాచారాన్ని ఫ్యాక్స్ రూపంలో పంపవల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.

 

Best Mobiles in India

English summary
What Happens to Your Online Accounts When You Die. Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X