అసలు 2జీ స్పెక్ట్రమ్ అంటే ఏంటి..?

Posted By: Staff

అసలు 2జీ స్పెక్ట్రమ్ అంటే ఏంటి..?

 

‘2జీ స్పెక్ట్రమ్’ కుంభకోణం అందరికి గుర్తింది కదూ.. యూవత్ ప్రపంచాన్ని ఒక్కసారి ఉలిక్కిపడేలే చేసిన ఈ భారీ అవినీతి భారత దేశ ప్రతిష్టతను దెబ్బతీసింది. ఈ కేసుకు సంబంధించి మాజీ కమ్యూనికేషన్ల మంత్రి ఎ.రాజా హయాంలో జారీచేసిన 122 టెలికాం లైసెన్స్‌లను రద్దుచేయాలంటూ సుప్రీం ధర్మాసనం తాజాగా సంచలన తీర్పును వెలవరించింది. ఈ నేపధ్యంలో.. అసలు ‘2జీ స్పెక్ట్రమ్’ అంటే ఏంటి..?, ఈ టెక్నాలజీని ఎందుకు ఉపయోగిస్తున్నారు...?, క్లుప్తంగా పాఠకుల కోసం...

తీగల సాయం లేకుండా, అంటే వైర్‌లెస్ విధానం ద్వారా సమచారాన్ని ప్రసారం చేసేందుకు ఉపయోగించే రెండవ తరం టెక్నాలజీని ‘2జీ’ అని పిలుస్తున్నారు. ఈ టెక్నాలజీ వాడకంలో పాటించాల్సిన పద్ధతులను గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్(జీఎస్‌ఎం) ద్వారా నిర్ణయించారు. అప్పట్లో మాటలతోపాటు ఎస్‌ఎంఎస్ సందేశాలు పంపేందుకు మాత్రమే ఈ టెక్నాలజీ ఉపయోగపడింది. రేడియో తరంగాల స్థానంలో విద్యుదయస్కాంత తరంగాలను ఉపయోగించడం ద్వారా తక్కువ స్పెక్ట్రమ్‌లోనే ఎక్కువ సంఖ్యలో కాల్స్‌ను ప్రసారం చేయడం ఈ టెక్నాలజీ ద్వారా వచ్చిన లాభం. అంతేకాకుండా నిర్ణీత ప్రాంతాలను చిన్నభాగాలుగా చేసుకుని (సెల్స్) సమాచార ప్రసారం చేయడం మొదలైందీ ఇక్కడి నుంచే!. 1991లో ఫిన్‌లాండ్‌కు చెందిన ‘రేడియోలింజా’ కంపెనీ తొలిసారిగా ఈ టెక్నాలజీని వాణిజ్య స్థాయిలో ఉపయోగించడం మొదలుపెట్టింది. 2జీ టెక్నాలజీని సెల్‌ఫోన్ ప్రసారాలతోపాటు టెలివిజన్, రేడియో ప్రసారాలకు ఉపయోగిస్తున్నారు. దేశ రక్షణ వ్యవస్థకు సైతం 2జీ వ్యవస్థ సేవలందిస్తుంది.

మొబైల్‌ఫోన్‌ల ద్వారా ఇంటర్నెట్‌ను అందుకునేందుకు వీలు కల్పించిన టెక్నాలజీ 2.5జీ. జీపీఆర్‌ఎస్ వంటి టెక్నాలజీల అభివృద్ధితో ఇది సాధ్యమైంది. అయితే ఇందులో నెట్ స్పీడ్ 56 కేబీపీఎస్ నుంచి 115 కేబీపీఎస్ వరకూ మాత్రమే ఉండేది. తరువాతి కాలంలో ఎడ్జ్ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో మొబైల్‌ఫోన్ల ద్వారా సెకనుకు 238 కిలోబిట్ల వరకూ సమాచారం పంపుకోవడం సాధ్యమైంది. దీన్ని 2.75జీగా పిలుస్తారు. ప్రస్తుతం విస్త్ళతంగా ఉపయోగిస్తున్న 3జీ టెక్నాలజీలో హెచ్‌ఎస్‌పీడీఏ , యూఎంటీఎస్ వంటి పద్ధతులను ఉపయోగించడం ద్వారా నెట్ స్పీడ్‌ను 14.4 ఎంబీపీఎస్ స్థాయికి పెంచగలిగారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot